iDreamPost

తమన్నాకు పోలీసుల నోటీసులు.. ఎందుకంటే..?

తెలుగు, తమిళ్, హిందీ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది మిల్కీ బ్యూటీ తమన్నా. అలాగే ప్రకటనల్లో కూడా నటిస్తుంది. అంతేకాకుండా కొన్ని బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది. ఇప్పుడు చిక్కుల్లో పడింది.

తెలుగు, తమిళ్, హిందీ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది మిల్కీ బ్యూటీ తమన్నా. అలాగే ప్రకటనల్లో కూడా నటిస్తుంది. అంతేకాకుండా కొన్ని బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది. ఇప్పుడు చిక్కుల్లో పడింది.

తమన్నాకు పోలీసుల నోటీసులు.. ఎందుకంటే..?

టాలీవుడ్ నుండి బాలీవుడ్‌కు ఎగిసి పడ్డ మరో బ్యూటీ తమన్నా భాటియా. తెలుగు ఇండస్ట్రీలో గ్లామర్ పాత్రలకు ఓకే చెప్పి.. బోల్డ్ సన్నివేశాలకు నో అన్న ఈ మిల్కీ గర్ల్.. బీటౌన్ వెళ్లాక..కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో శృతి మించి నటించిన సంగతి విదితమే. ప్రస్తుతం బాలీవుడ్ గడ్డపై సినిమాలు చేస్తూ.. ఇటు తెలుగు, తమిళ సినిమాలను కూడా మడత పెట్టేస్తోంది ఈ బాహుబలి సుందరి. అలాగే కొన్ని యాడ్స్ కూడా చేస్తుంది. ఇవి చాలవన్నట్లు కొన్ని ఆన్ లైన్ గేమింగ్, అండ్ బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది. ఇప్పుడు ఆమె చిక్కుల్లో పడింది. ఓ బెట్టింగ్ యాప్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు చూడాలంటూ వీక్షకులను ప్రమోట్ చేసింది. ఇదే ఆమెను సమస్యల్లోకి నెట్టింది.

నిబంధనలకు విరుద్దంగా ఫెయిర్ ప్లే యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేసినందుకు మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఇదే కేసులో గాయకుడు బాద్ షా, ప్రముఖ నటుడు సంజయ్ దత్, నటి జాక్వెలెన్ ఫెర్నాండేజ్ నోటీసులు అందాయి. కాగా, బాద్ షా, సంజయ్, జాక్వెలిన్ మేనేజర్ల నుండి వాంగూల్మాన్ని నమోదు చేసింది సైబర్ క్రైమ్. ఫెయిర్ ప్లే అనేది మహాదేవ్ ఆన్ లైన్ గేమింగ్ అనుబంధ యాప్. ఇందులో క్రికెట్, పోకర్, బ్యాడ్మింటన్, టెన్నిస్, ఫుట్ బాల్ కార్డ్ గేమ్స్ ఉంటాయి. ఈ యాప్ లైవ్ గేమ్స్‌లో అక్రమంగా బెట్టింగ్ చేసేందుకు కూడా సహకరిస్తుందన్న ఆరోపణ ఉంది. అయితే ఇందులో కొన్ని ఐపీఎల్ మ్యాచ్‌లు చట్టవిరుద్ధంగా స్ట్రీమింగ్ చేయబడ్డాయని, దీని వల్ల కోట్లలో నష్టం వచ్చిందంటూ డిజిటల్ ప్రసార హక్కులను సొంతం చేసుకున్న వయాకామ్ ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదు ఆధారంగా తమన్నాకు సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 29న విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఈ నెల 29న మహారాష్ట్ర సైబర్ సెక్యూరిటీ, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కోసం నోడల్ ఏజెన్సీ అధికారుల ముందు హాజరు కావాల్సి ఉంటుంంది. ఇదే కేసులో సీనియర్‌ నటుడు సంజయ్‌ దత్‌కు కూడా పోలీసులు నోటీసులు పంపించారు. ఈ నెల 23న ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉండగా..స్కిప్ చేశారు. తన స్టేట్ మెంట్ రికార్డు చేయడానికి మరో తేదీకి షెడ్యూల్ చేయమని కోరారు. ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే.. సుందర్ తెరకెక్కిస్తున్న హారర్ మూవీ అరణ్మనై4లో కనిపిస్తుంది. దీనితో పాటు రెండు హిందీ చిత్రాలు.. సంపత్ నంది దర్శకత్వంలో ఓదేల 2లో నటిస్తోంది ఈ మిల్కీ బ్యూటీ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి