iDreamPost
android-app
ios-app

Vishwak Sen విశ్వక్ సేన్ కోసం ప్యాన్ ఇండియా టీమ్

  • Published Jun 22, 2022 | 4:04 PM Updated Updated Jun 22, 2022 | 4:06 PM
Vishwak Sen విశ్వక్ సేన్ కోసం ప్యాన్ ఇండియా టీమ్

ఇటీవలే అశోక వనంలో అర్జున కళ్యాణంతో డీసెంట్ హిట్ అందుకున్న విశ్వక్ సేన్ కు దాని వల్ల థియేట్రికల్ గా లాభాలు భారీగా రాలేదు కానీ ఓటిటిలో వచ్చాక జనం బాగానే చూశారు. రిపోర్ట్స్ కూడా బాగున్నాయి. కొంత మాస్ టచ్ ఉండే తన ఇమేజ్ కి భిన్నంగా మిడిల్ క్లాస్ కుర్రాడిగా చేసిన ప్రయత్నం మంచి ఫలితాన్నే ఇచ్చింది. పాగల్ కోసం అంత కష్టపడినా దక్కని ఫలితం ఇదిచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం తను ధమ్కీ చేస్తున్నాడు. ఫలక్ నుమా దాస్ తర్వాత తనే సెల్ఫ్ డైరెక్ట్ చేసుకుంటున్న మూవీ ఇది. షూటింగ్ జరుగుతోంది. ఇదిలా ఉండగా విశ్వక్ త్వరలో యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో నటించబోతున్న సంగతి తెలిసిందే.

దీని కోసం చాలా క్రేజీ టీమ్ ని సెట్ చేస్తున్నారు. సంభాషణల రచయిత ఆల్రెడీ సాయి మాధవ్ బుర్రని లాక్ చేశారు. ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న రైటర్ గా ఈయన డిమాండ్ గురించి చెప్పేదేముంది. ఆర్ఆర్ఆర్ లాంటి గ్రాండియర్ తో మొదలుపెట్టి గగనం లాంటి ఆఫ్ బీట్ మూవీ దాకా అందరూ సాయిమాధవ్ ని అడిగేవారే. మొదటిసారి విశ్వక్ చిత్రానికి కలం ఇవ్వబోతున్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా రవి బస్రూర్ ఫిక్స్ అయ్యాడు. కెజిఎఫ్, సలార్ తో అమాంతం రేంజ్ పెంచుకున్న ఈ సంగీత దర్శకుడి కోసం ఎదురు చూస్తున్న దర్శకులు ఎందరో ఉన్నారు. కన్నడిగుడు అయిన అర్జున్ సర్జా అడిగితే ఎందుకు కాదంటాడు.

ఈ సినిమాతోనే అర్జున్ కూతురు ఐశ్వర్య తెరకు పరిచయం కాబోతోంది. దీన్ని ప్యాన్ ఇండియా లెవెల్ లో తీర్చిదిద్దతున్నారు. బడ్జెట్ ఎంతనేది బయటికి రాలేదు కానీ పాతిక కోట్లకు పైగానే ఉండొచ్చని టాక్. మరి అర్జున్ తనకు ఇష్టమైన యాక్షన్ జానర్ ని తీసుకుంటారా లేక మారుస్తారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి విశ్వక్ సేన్ లక్ బాగుంది. ఇది హిట్ అయ్యిందా కన్నడలోనూ మార్కెట్ వస్తుంది. అక్కడెలాగూ అంతగా గుర్తింపు లేదు. ఇప్పుడు దీని ద్వారా రాబట్టుకోవచ్చు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనున్న ఈ ప్రాజెక్టుకి సంబంధించి మరికొన్ని వివరాలు, టైటిల్ లుక్ రాబోయే రోజుల్లో ఒక్కొక్కటిగా రివీల్ చేయబోతున్నారు.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler