iDreamPost

అచ్చెన్న మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు…

అచ్చెన్న మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు…

ప్రభుత్వం పై ఎప్పటిలానే నిరాధార ఆరోపణలు

వెనకా ముందు చూడకుండా తనకు నోటికి ఏది అనిపిస్తే అది మాట్లాడడంలో టిడిపి ఎమ్మేల్యే కింజరాపు అచ్చెన్నాయుడు ముందుంటారు. గతంలో టిడిపి హయాంలో మంత్రిగా ఉన్నపుడు కూడా ఆయన ప్రతిపక్షం మీద ఇష్టానుసారం విరుచుకుపడేవారు.. అధికారం పోయాక కూడా కొన్నాళ్ళు అదే నోటిదురుసుతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మీద, మంత్రుల మీద కామెంట్స్ చేసేవారు.అయితే ఆ తరువాత ఈఎస్ఐ ఆస్పత్రుల్లో వైద్య పరికరాల కొనుగోలు విషయంలో ఆయన కార్మికమంత్రిగా ఉన్నపుడు కొన్ని అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఆ విషయంలో ఆయనను విచారిస్తా రని కూడా వార్తలొచ్చాయి. కానీ అవేమి జరగకపోయినా అచ్చెన్న మాత్రం సైలెంట్ అయ్యారు. పెద్దగా కామెంట్స్ చేయడం లేదు..మళ్ళీ ఇన్నాళ్లకు చాలా నెలల తరువాత ఆయన ట్విట్టర్లో ప్రభుత్వం మీద పోస్ట్ లు పెట్టారు.

‘‘ప‌రిపాల‌నా రాజ‌ధాని పేరుతో విశాఖ‌ని పంచుకుతినేందుకు.. పులివెందుల పంచెలు దిగాయి. ల్యాండ్ల‌పై పంచాయ‌తీలు మొద‌ల‌య్యాయి. రూ.10 కోట్లిస్తావా? జ‌గ‌న్‌రెడ్డికి చెప్పి లాక్కోమంటావా? ఇదీ దందా తీరు.. అధికార‌ పార్టీ ఆక్రమ‌ణ‌ల‌తో కుంచించుకుపోయి.. విశాఖ‌ప‌ట్టణం.. విజ‌య‌సాయి ప‌ట్టణ‌మైపోతుందేమో అని ఆందోళనగా ఉంది’’ అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు..

అచ్చెన్నాయుడు ఆరోపణలు చూసి విశాఖ ప్రజలు ముక్కున వేలు వేసుకుంటున్నారు.గత ప్రభుత్వ హాయంలో ఇద్దరు మంత్రులు విశాఖ భూఆక్రమణల మీద ఒకరి మీద ఒకరు బహిరంగంగా దుమ్మెత్తిపోసుకున్న సంగతి అచ్చెన్నాయుడు మర్చిపోయినట్లున్నాడు కానీ ప్రజలు మర్చిపోలేదు.

టిడిపి హయాంలో విశాఖలో జరిగిన భూ దందా..

అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన అనుచరులు, విధేయ అధికారుల ప్రమేయంతోనే ఈ దందా జరిగిందన్న ఆరోపణలున్నాయి. దీనిమీద సీనియర్ మంత్రి అయ్యన్న పాత్రుడు కూడా గంటా మీద ఓ వేదికపై విమర్శలు గుప్పించారు. విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కొందరు నాయకులు అవినీతి చేసేందుకు, కోట్లు కొల్లగొట్టేందుకే రాజకీయాల్లోకి వస్తారని ఆరోపించారు. మొత్తానికి ఈ ఇద్దరిమధ్య వివాదాన్ని చంద్రబాబు జోక్యంతో సద్దుమణిగింది. అప్పటి పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత కూడా ఈ భూ కబ్జాల కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు.

వందల ఎకరాల ప్రభుత్వ ప్రయివేటు భూములకు చెందిన రికార్డులు మార్చేశారు. దీనిపై గత ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను కూడా వేసింది. దానికి అప్పట్లో వందలాది ఫిర్యాదులు వచ్చాయి. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ప్రభుత్వం మీద అచ్చెన్న ఆరోపణలు చేయడాన్ని వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. తనవద్ద ఆధారాలు ఉంటే ఫిర్యాదు చేస్తే బాగుణ్ణు గానీ ఇలా అసత్య ఆరోపణలు చేయడం ఏమిటని వారు అంటున్నారు. టిడిపి హయాంలోనే భూ కబ్జాలు దందాలు జరిగాయని వారు గుర్తు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి