iDreamPost

Acharya & RRR : కాంట్రావర్సీ చుట్టుముట్టిన క్రేజీ చిత్రాలు

Acharya & RRR : కాంట్రావర్సీ చుట్టుముట్టిన క్రేజీ చిత్రాలు

పాన్ ఇండియా సినిమాలేవీ ఈ పండక్కు బరిలో లేకపోయినా వాటి తాలూకు వివాదాలు మాత్రం వార్తల్లో షురూ అయ్యాయి. ఆర్ఆర్ఆర్ లో సీతారామరాజు పాత్రను తప్పుగా చూపించారని, బ్రిటిష్ సైన్యంలో తొలుత పని చేసిన పోలీసుగా చూపించడం సబబుగా లేదని, అంతేకాదు అసలు సీత అనే యువతికి రామరాజుకి మధ్య ప్రేమకథ లేదని, కోరుకున్నవాడి కోసం ఆమే ప్రాణ త్యాగం చేసిందని తాజాగా కోర్టులో వేసిన పీల్ లో పై అంశాలను పేర్కొన్నారు. అల్లూరి వంశానికి చెందిన సౌమ్య అనే యువతి ఈ అభ్యంతరాలను లేవనెత్తారు. ఆర్ఆర్ఆర్ యూనిట్ ఆలస్యం చేయకుండా స్పందించింది. తమది కల్పిత కథని ముందు నుంచి చెబుతూ వచ్చామని అంటోంది.

ఇదే విషయం పలుమార్లు స్పష్టం చేశామని, ఒకవేళ సినిమా రిలీజయ్యాక కూడా అలాగే అనిపిస్తే అప్పుడు ఎలాంటి చర్యలకైనా వెళ్లొచ్చని వివరణలో పేర్కొన్నారు. దీంతో సంతృప్తి చెంది సౌమ్య పిటీషన్ ని వెనక్కు తీసుకుంటారో లేదో తెలియదు కానీ మొత్తానికి విడుదల వాయిదా పడ్డాక ఈ పరిణామం జరగడం గమనార్హం. కొమరం భీమ్ గురించి కూడా చాలా నెలల నుంచి వివాదం నెలకొంది. కాకపోతే లీగల్ గా వెళ్లే స్థాయిలో ఎవరూ స్పందించకపోవడంతో అదేమంత హై లైట్ కాలేదు. ఇప్పుడు అల్లూరి సౌమ్య న్యాయస్థానానికి వెళ్లడం వల్ల ఇష్యూ బయటికి వచ్చింది. ఇప్పట్లో రిలీజ్ లేదు కాబట్టి పరిష్కారం చేసుకోవచ్చు.

ఇక చిరంజీవి ఆచార్య మరోరకమైన కాంట్రావర్సీని తెచ్చుకుంది. ఇటీవలే వచ్చిన శానా కష్టం పాటలో తమ వృత్తిని కించపరుస్తూ మనోభావాలు దెబ్బ తినేలా లైన్స్ ఉన్నాయని తెలంగాణ రాష్ట్రం జనగాం ఆర్ఎంపి డాక్టర్ల అసోసియేషన్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అమ్మాయిలను నిమరడానికే అబ్బాయిలు ఆర్ఎంపిలు అవుతారని రచయిత భాస్కర భట్ల రాయడం దీనికి కారణం అయ్యింది. మరి కొణిదెల సంస్థ, హీరో ఏమంటారో వేచి చూడాలి. చేతిలో టైం ఉంది కాబట్టి లిరిక్స్ మార్చో ఇంకొకటి చేసి సాల్వ్ చేసుకోవచ్చు. మొత్తానికి ఆర్ఆర్ఆర్, ఆచార్య రెండు రామ్ చరణ్ సినిమాలు ఒకేసారి వివాదాల్లోకి ఎక్కడం గమనించాల్సిన అంశం

Also Read : Akhanda : పుష్ప పొరపాటు బాలయ్య సినిమా చేయలేదు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి