iDreamPost

Chiranjeevi ఆచార్య గాయాలకు మందు ఏది?

Chiranjeevi ఆచార్య గాయాలకు మందు ఏది?

వారం తిరక్కుండానే ఆచార్య ఫైనల్ రన్ కు రావడమనేది మెగాస్టార్ గా మారాక చిరంజీవి కెరీర్ లో ఇదే మొదటిసారని చెప్పొచ్చు. ఫస్ట్ వీక్ లో రంజాన్ హాలిడే ఉన్నప్పటికీ కనీసం హౌస్ ఫుల్స్ చేసుకోలేనంత దారుణమైన పొజిషన్ కి పడిపోయింది. మొత్తం థియేట్రికల్ గా కలిగిన నష్టం 80 కోట్లకు పైగానే ఉండొచ్చని, డబ్బింగ్ లేకుండా ఒక స్ట్రెయిట్ తెలుగు మూవీకి సంబంధించి ఇదే అతి పెద్ద డిజాస్టరని ట్రేడ్ పేర్కొంటోంది. రాధే శ్యామ్ లాస్ కూడా వంద కోట్లకు పైమాటే కానీ అది అన్ని భాషలకు కలిపి. అలా పోల్చుకుంటే ఆచార్యనే ఫస్ట్ ప్లేస్ తీసుకుంటుంది. మెగా ఫాన్స్ ఈ డిజాస్టర్ ని జీర్ణించుకోలేక పడుతున్న బాధలు వర్ణనాతీతం.

ఆచార్య రేపిన గాయాలకు మందు ఏదంటే కాలమే సమాధానం చెప్పాలి. డిస్ట్రిబ్యూటర్లు ఈ వారాంతంలో దర్శకుడు కొరటాల శివతో పాటు నిర్మాతను కలిసి తమ పరిహారం గురించి డిమాండ్ చేయబోతున్నారని ఫిలిం నగర్ టాక్. అది జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్టు మీద తగ్గిస్తారా లేక గాడ్ ఫాదర్ ని డిస్కౌంట్ లో ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈ రెండు ఇతర ప్రొడ్యూసర్లవి కాబట్టి వ్యవహారం అంత సులభంగా ఉండదు. పైగా ఆచార్య బ్యానరే నిర్మించిన మిషన్ ఇంపాజిబుల్ సైతం చిన్న బడ్జెట్ లోనూ డెఫిషిట్లు ఇచ్చింది. మరోవైపు చిరంజీవి కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లిపోవడంతో ఆయనను సంప్రదించి నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండా పోయింది.

అసలు చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటించిన సినిమాకు ఇంత ఘోరమైన రెస్పాన్స్ కు కారణమేంటనేది మెగా వర్గాలు ఆరా తీస్తున్నాయి. సినిమా బాలేదు సరే కనీసం రెండు మూడు రోజుల పాటు చెప్పుకోదగ్గ ఆక్యుపెన్సీలు లేక నెగటివ్ షేర్స్ ఎలా వచ్చాయనేదాని గురించి పరిశోధిస్తున్నాయి. దీని వల్ల ఫలితమేంటనేది పక్కనపెడితే చిరంజీవి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఆచార్య రిజల్ట్ నొక్కి చెప్పింది. దీని ప్రభావం ఎంత వద్దనుకున్నా రాబోయే చిరు చరణ్ సినిమాల మీద పడొచ్చు పడకపోవచ్చు. కానీ ఈ సినిమా తాలూకు చేదు జ్ఞాపకాలు మాత్రం కొన్ని నెలల పాటు వెంటాడుతూనే ఉంటాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి