iDreamPost

Acharya ఆచార్య బిజినెస్ ఎన్ని కోట్లు

Acharya ఆచార్య బిజినెస్ ఎన్ని కోట్లు

ఇంకో నలభై ఎనిమిది కంటే తక్కువ గంటల్లో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య తెరపైకి రానుంది. రామ్ చరణ్ కాంబినేషన్ కావడంతో అభిమానుల్లో అంచనాలు మాములుగా లేవు. హైదరాబాద్ లో ఇంకా పూర్తి స్థాయి బుకింగ్ అందుబాటులోకి రాలేదు. థియేటర్ల విషయంగా డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్ల మధ్య ఏదో ఇష్యూ కారణంగా ఆన్ లైన్ బుకింగ్లో అన్ని థియేటర్లు కనిపించడం లేదు. ఇవాళ సాయంత్రానికి ఒక కొలిక్కి వస్తుంది. స్క్రీన్ కౌంట్ పరంగా మొదటి రోజు మాత్రం భారీ నెంబర్ ఉండబోతోంది. టాక్ ని బట్టి వాటిలో ఎన్ని కొనసాగించాలి ఎన్ని తీసేయాలనేది వీకెండ్ అయ్యాక డిసైడ్ చేస్తారు. అప్పటిదాకా మెగా మూవీకి పండగే.

ఇక థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే అన్ని ఏరియాలు భారీ రేట్లకు బిజినెస్ చేశారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ మూవీ కావడంతో వెయిట్ పెరిగిపోయింది. ట్రైలర్ మరీ బ్లాక్ బస్టర్ అనిపించుకోకపోయినా తండ్రికొడుకుల కాంబో కోసం ప్రేక్షకులు ఖచ్చితంగా థియేటర్ కు వస్తారనే నమ్మకంతో ట్రేడ్ ఉంది. మౌత్ టాక్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్స్ చాలా కీలకంగా మారనుంది. సుమారు 130 కోట్లకు పైగా అమ్ముడుపోయిన ఆచార్య అంత షేర్ ని రాబట్టుకోవడం సులభం కాదు. బ్లాక్ బస్టర్ అయితే సమస్యే లేదు. ఈజీగా వస్తుంది. లేదంటేనే చిక్కులు. ఇక ప్రాంతాల వారిగా జరిగిన బిజినెస్ ఈ లెక్కల్లో ఉంది.

నైజామ్ – 40 కోట్లు
సీడెడ్ – 18 కోట్ల 50 లక్షలు
ఉత్తరాంధ్ర – 13 కోట్లు
ఈస్ట్ గోదావరి – 9 కోట్ల 40 లక్షలు
వెస్ట్ గోదావరి – 7 కోట్ల 10 లక్షలు
గుంటూరు – 9 కోట్లు
కృష్ణా – 8 కోట్లు
నెల్లూరు – 4 కోట్ల 30 లక్షలు

ఏపి తెలంగాణ బిజినెస్ మొత్తం – 109 కోట్ల 30 లక్షలు

కర్ణాటక – 9 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా – 2 కోట్ల 70 లక్షలు
ఓవర్సీస్ – 12 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా జరిగిన బిజినెస్ (సుమారుగా) – 132 కోట్లు

సో ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే 133 కోట్ల దాకా షేర్ రావాలి. అంటే రెండు వందల కోట్ల గ్రాస్ వస్తే కానీ ఆచార్య హిట్ అని చెప్పలేం. ఇదంత సులభం కాదు. అలా అని అసాధ్యమూ కాదు. ఎటొచ్చి ఇప్పుడున్న సోసో వైబ్రేషన్స్ ని దాటుకుని సినిమా చాలా బాగుందనే మాట పబ్లిక్ నుంచి రప్పించుకోవాలి. ఎడతెరిపి లేకుండా చిరు చరణ్ పూజ హెగ్డే కొరటాల శివ ప్రమోషన్లు చేస్తూనే ఉన్నారు. ట్రైలర్ కట్ సినిమాకు తెచ్చే హైప్ విషయంలో ఎంత కీలకమో మరోసారి రుజువయ్యింది. ఏవో కొత్త ప్రోమోలు వస్తాయన్నారు కానీ ఆ సూచనలేమి లేవు. ఒక రోజు ముందు వస్తున్న డబ్బింగ్ సినిమా కన్మణి రాంబో కతిజా తప్ప ఇంకేదీ పోటీలో లేదు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి