iDreamPost

RC 16 Movie: రామ్ చరణ్ – బుచ్చిబాబు సినిమాలో ఆ బిగ్ స్టార్?

  • Published Mar 18, 2024 | 1:32 PMUpdated Mar 18, 2024 | 1:32 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానాతో ఓ భారీ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే.ఇక పైన చెప్పుకున్నట్లు ఈ సినిమాలోని కాస్టింగ్ విషయంలో ఇప్పటికే ఎన్నో ఆసక్తికరమైన పుకార్లు వచ్చాయి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానాతో ఓ భారీ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే.ఇక పైన చెప్పుకున్నట్లు ఈ సినిమాలోని కాస్టింగ్ విషయంలో ఇప్పటికే ఎన్నో ఆసక్తికరమైన పుకార్లు వచ్చాయి.

  • Published Mar 18, 2024 | 1:32 PMUpdated Mar 18, 2024 | 1:32 PM
RC 16 Movie: రామ్ చరణ్ – బుచ్చిబాబు సినిమాలో ఆ బిగ్ స్టార్?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానాతో ఓ భారీ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం కోసం చరణ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించనున్నారని ప్రకటించారు. అంతే కాకుండా ఈ సినిమాలోని ఇతర పాత్రలలో నటించే స్టార్స్ పై కూడా కొన్ని పుకార్లు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాలో ఒక స్పెషల్ రోల్ ఉందని… ఈ పాత్రలో బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. RC 16 పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనుంది కాబట్టి అమితాబ్ బచ్చన్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.

మరి ఈ వార్తలో ఏ మాత్రం నిజం ఉందో తెలియాలంటే… మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక పైన చెప్పుకున్నట్లు ఈ సినిమాలోని కాస్టింగ్ విషయంలో ఇప్పటికే ఎన్నో ఆసక్తికరమైన పుకార్లు వచ్చాయి. మొదట్లో ఈ సినిమాలోని ముఖ్యమైన పాత్రకు విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలు నిజం కాలేదు.

ఆ తర్వాత అదే పాత్రకు కన్నడ సీనియర్ హీరో శివ రాజ్ కుమార్ ను ఎంచుకున్నట్లు చెప్పారు. కాగా ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయనే దాదాపుగా కన్ఫర్మ్ చేశారు. యానిమల్ సినిమాతో విలన్ గా ఫామ్ లోకి వచ్చిన బాబీ డియోల్ కూడా ఈ సినిమాలో నటించే అవకాశం ఉందట. ఈ వార్త పై కూడా అధికారిక ప్రకటన రాలేదు. ఏదేమైనా రామ్ చరణ్ – బుచ్చిబాబు సినిమా భారీ కాస్టింగ్ తో తెరకెక్కనుందనే విషయం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈలోపు రామ్ చరణ్ అభిమానులకు సంతోషం కలిగించే విషయం ఏమిటంటే మరో పది రోజుల్లో రానున్న ఆయన పుట్టినరోజు నాడు గేమ్ చేంజర్ సినిమాలోని ఫస్ట్ సింగిల్ విడుదల కావడమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి