iDreamPost

IND vs SA: అతడితో జాగ్రత్త.. దక్షిణాఫ్రికాకు డివిలియర్స్ వార్నింగ్!

  • Author Soma Sekhar Updated - 05:46 PM, Tue - 5 December 23

టీమిండియాలోని ఆ ప్లేయర్ తో జాగ్రత్త అంటూ తమ టీమ్ కు వార్నింగ్ ఇచ్చాడు దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్. మరి ఏబీడీ చెప్పిన ఆ స్టార్ ప్లేయర్ ఎవరు? ఇప్పుడు చూద్దాం.

టీమిండియాలోని ఆ ప్లేయర్ తో జాగ్రత్త అంటూ తమ టీమ్ కు వార్నింగ్ ఇచ్చాడు దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్. మరి ఏబీడీ చెప్పిన ఆ స్టార్ ప్లేయర్ ఎవరు? ఇప్పుడు చూద్దాం.

  • Author Soma Sekhar Updated - 05:46 PM, Tue - 5 December 23
IND vs SA: అతడితో జాగ్రత్త.. దక్షిణాఫ్రికాకు డివిలియర్స్ వార్నింగ్!

ఆస్ట్రేలియాతో జరిగిన 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 4-1తో టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక కంగారూ జట్టుపై చూపించిన జోరును త్వరలోనే జరగబోయే సౌతాఫ్రికా సిరీస్ లో కూడా చూపించాలని భావిస్తోంది భారత జట్టు. సఫారీ జట్టుతో మూడు టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్ లు ఆడనుంది. ఇక ఇప్పటికే ఈ సిరీస్ కు సంబంధించి మూడు ఫార్మాట్లకు టీమ్స్ ను ప్రకటించింది బీసీసీఐ. పొట్టి క్రికెట్ కు సూర్య కుమార్ యాదవ్, వన్డేలకు కేఎల్ రాహుల్, టెస్టులకు రోహిత్ శర్మలు సారథ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియాలోని ఆ ప్లేయర్ తో జాగ్రత్త అంటూ తమ టీమ్ కు వార్నింగ్ ఇచ్చాడు దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్. మరి ఏబీడీ చెప్పిన ఆ స్టార్ ప్లేయర్ ఎవరు? ఇప్పుడు చూద్దాం.

ఆస్ట్రేలియాపై సిరీస్ విజయంతో ఫుల్ స్వింగ్ లో ఉంది టీమిండియా. ఇక ఇదే జోరును సౌతాఫ్రికాపై కూడా చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. ప్రస్తుతం టీమిండియాలో దాదాపు అందరు ప్లేయర్లు భీకర ఫామ్ లో ఉన్నారు. ఇక ఇదే విషయంపై తమ టీమ్ సభ్యులను హెచ్చరించాడు సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్. టీ20, వన్డేలతో పాటుగా గాంధీ-మండేలా ఫ్రీడమ్ సిరీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కాగా.. టెస్ట్ సిరీస్ కోసం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తిరిగి జట్టులోకి వచ్చారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీతో జాగ్రత్తగా ఉండాలని సఫారీ జట్టుకు వార్నింగ్ ఇచ్చాడు ఏబీడీ.

“సౌతాఫ్రికాపై కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాడు. ఈ టెస్ట్ మ్యాచ్ ల్లో అతడి నుంచి భారీ ఇన్నింగ్స్ లను నేను ఆశిస్తున్నాను. అదీకాక ప్రస్తుతం కోహ్లీ భీకర ఫామ్ లో ఉన్నాడు. ఈ వరల్డ్ కప్ లో మనం చూసే ఉన్నాం. కాబట్టి సౌతాఫ్రికా ప్లేయర్లు విరాట్ తో జాగ్రత్తగా ఉండాలి” అంటూ పేర్కొన్నాడు డివిలియర్స్. విరాట్ కోహ్లీ వరల్డ్ క్లాస్ ప్లేయర్ అతడిని ఎదుర్కొవడం చాలా కష్టమని తమ ప్లేయర్లకు సూచనలు ఇచ్చాడు ఏబీడీ. కాగా.. డిసెంబర్ 26 నుంచి 30 వరకు సెంచూరియన్ వేదికగా తొలి టెస్ట్, జనవరి 3 నుంచి 7 వరకు కేప్ టౌన్ వేదికగా రెండో టెస్ట్ జరగనుంది. ఇదిలా ఉండగా.. సఫారీ సిరీస్ లో భాగంగా టీ20లకు, వన్డేలకు విశ్రాంతి తీసుకున్నారు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు. మరి విరాట్ కోహ్లీ విషయంలో ప్రోటీస్ జట్టుకు ఏబీడీ వార్నింగ్ ఇవ్వడం మీకేవిధంగా అనిపించిందో? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి