iDreamPost

మరో పెద్ద రికార్డు కొట్టేసిన అమీర్

రెండో వారంలో అడుగు పెట్టడం ఆలస్యం అరవై శాతానికి పైగా థియేటర్లలో లాల్ సింగ్ ని తీసేయడం దారుణ అవమానంగా చెప్పుకోవచ్చు. అక్షయ్ కుమార్ రక్షా బంధన్ తో పోటీగా తీసికట్టు కలెక్షన్లు రావడం ట్రేడ్ ని షాక్ లో ముంచెత్తింది. బాయ్ కాట్ వివాదాల సంగతి ఎలా ఉన్నా మినిమమ్ కంటెంట్ ఇందులో లేదన్న మాట ఎవరూ కాదనలేని నిజం.

రెండో వారంలో అడుగు పెట్టడం ఆలస్యం అరవై శాతానికి పైగా థియేటర్లలో లాల్ సింగ్ ని తీసేయడం దారుణ అవమానంగా చెప్పుకోవచ్చు. అక్షయ్ కుమార్ రక్షా బంధన్ తో పోటీగా తీసికట్టు కలెక్షన్లు రావడం ట్రేడ్ ని షాక్ లో ముంచెత్తింది. బాయ్ కాట్ వివాదాల సంగతి ఎలా ఉన్నా మినిమమ్ కంటెంట్ ఇందులో లేదన్న మాట ఎవరూ కాదనలేని నిజం.

మరో పెద్ద రికార్డు కొట్టేసిన అమీర్

అసలు ఏ దుర్ముహూర్తంలో ఫారెస్ట్ గంప్ రీమేక్ చేయాలన్న ఆలోచన వచ్చిందో కానీ పాపం అమీర్ ఖాన్ కు లాల్ సింగ్ చడ్డా కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 200 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగిన ఈ ఎమోషనల్ డ్రామా యాభై కోట్లకే కిందా మీదా పడుతోంది. రెండో వారంలో అడుగు పెట్టడం ఆలస్యం అరవై శాతానికి పైగా థియేటర్లలో లాల్ సింగ్ ని తీసేయడం దారుణ అవమానంగా చెప్పుకోవచ్చు. అక్షయ్ కుమార్ రక్షా బంధన్ తో పోటీగా తీసికట్టు కలెక్షన్లు రావడం ట్రేడ్ ని షాక్ లో ముంచెత్తింది. బాయ్ కాట్ వివాదాల సంగతి ఎలా ఉన్నా మినిమమ్ కంటెంట్ ఇందులో లేదన్న మాట ఎవరూ కాదనలేని నిజం.

Aamir who broke another big record

తాజాగా ఈ లాల్ సింగ్ మరో రికార్డు వచ్చి చేరింది. ఇప్పటి దాకా బాలీవుడ్ ని ఏలుతున్న ముగ్గురు ఖాన్ల ద్వయంలో చెత్త రికార్డు షారుఖ్ ఖాన్ జీరో పేరు మీద ఉంది. వంద కోట్లకు పైగా నష్టాలతో ఇప్పటికీ అది చెక్కుచెదరకుండా నిలిచిపోయింది. ఇప్పుడు అమీర్ ఖాన్ దాన్ని పెద్ద మార్జిన్ తో దాటేయబోతున్నాడు. లక్కీగా సల్మాన్ ఖాన్ కు ఇంత తీవ్రమైన పరాభవం లేదు. రేస్ 3 బోల్తా కొట్టింది కానీ మాస్ ఓపెనింగ్స్ పుణ్యమాని గట్టెక్కిపోయింది. కానీ లాల్ సింగ్ చడ్డాకు అలాంటి అవకాశం కించిత్ కూడా లేకపోయింది. సుమారు 120 నుంచి 150 కోట్ల మధ్య ఫైనల్ లాస్ ఉండొచ్చని అంచనా. కనీసం కరెంటు బిల్లులు కూడా వసూలు కాలేనంత వీక్ గా ఉంటున్నాయి లెక్కలు.

ఇంతోటి సంబరానికి ఆరు నెలల తర్వాతే తన సినిమా ఓటిటిలో వస్తుందని అమీర్ ఖాన్ పదే పదే చెప్పుకోవడం రివర్స్ లో కొట్టింది. ఇప్పుడిది ఆరు సంవత్సరాల తర్వాత వచ్చినా పెద్ద తేడా ఉండదని ఆడియన్స్ ఓపెన్ గానే అంటున్నారు. దెబ్బకు అగ్రిమెంట్ ని రివైజ్ చేసి ముందే స్ట్రీమింగ్ చేసే అవకాశాలున్నాయి. అయినా ఆచార్య లాంటి చేదు అనుభవాన్ని హీరోగా చవి చూసిన చిరంజీవి ఇంత తక్కువ గ్యాప్ లో సమర్పకుడుగా తన మొదటి డబ్బింగ్ మూవీకి సైతం అదే ఫలితం అందుకోవడం విధి లిఖితం. రిలీజయ్యాక చైతు కూడా మౌనంగా ఉండిపోయారు. ఎక్కడ దాని ప్రస్తావన తెస్తే ట్రోలింగ్ కి గురవ్వాల్సి ఉంటుందోని మౌనం వహిస్తున్నారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి