iDreamPost

మిచౌంగ్ తుఫాన్.. చెన్నై వరదల్లో చిక్కుకున్న అమీర్ ఖాన్, విష్ణు విశాల్

మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు చెన్నై నగరాన్ని ముంచెత్తుతున్నాయి. వరదలధాటికి జనం బెంబేలెత్తిపోతున్నారు. సెలబ్రిటీలకు కూడా కష్టాలు తప్పడం లేదు. తాజగా అమీర్ ఖాన్, విష్ణు విశాల్ వరదల్లో చిక్కుకున్నారు.

మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు చెన్నై నగరాన్ని ముంచెత్తుతున్నాయి. వరదలధాటికి జనం బెంబేలెత్తిపోతున్నారు. సెలబ్రిటీలకు కూడా కష్టాలు తప్పడం లేదు. తాజగా అమీర్ ఖాన్, విష్ణు విశాల్ వరదల్లో చిక్కుకున్నారు.

మిచౌంగ్ తుఫాన్.. చెన్నై వరదల్లో చిక్కుకున్న అమీర్ ఖాన్, విష్ణు విశాల్

తమిళనాడులోని చెన్నై నగరాన్ని అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తోంది. భారీగా కురుస్తున్న వర్షాలతో రోడ్లు, కాలనీలు నదులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. కాలనీల్లో పార్క్ చేసిన కార్లు వరద నీటిలో కొట్టుకు పోయాయి. చెన్నై ఎయిర్ పోర్టులో భారీగా నీరు చేరడంతో విమానాలను సైతం రద్దు చేసి, విమానాశ్రయాన్ని మూసివేశారు. అయితే చెన్నై లో సంబవించిన ఈ వరదల్లో ఇద్దరు నటులు చిక్కుకుపోయారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింటా వైరల్ గా మారాయి.

మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్ తో చెన్నైలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో కోలీవుడ్ స్టార్ విష్ణు విశాల్, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ చెన్నై వరదల్లో చిక్కుకుపోయారు. విశాల్ భార్య గుత్త జ్వాల, ఇతర ప్రముఖులు ఇళ్లల్లో ఇరుక్కుపోయారు. ఈ విషయాన్ని విష్ణు విశాల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కరపాకంలోని తమ ఇంట్లోకి వరద నీళ్లు వచ్చి చేరాయి. విద్యుత్ లేదు, ఇంటర్నెట్ సౌకర్యం లేదు. దీంతో తమ సమాచారం అందించలేని స్థితి అని తెలిపారు. ఈ క్రమంలో మేడమీదికి చేరుకున్న విష్షు సిగ్నల్‌ వచ్చే ప్రాంతానికి వచ్చి తమ పరిస్థితిని ఫోటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

తమకు సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకున్నారు. దీనికి స్పందించిన అధికారులు రెస్య్కూ సిబ్బంది విష్ణు విశాల్‌ ఉండే ప్రాంతానికి చేరుకుని వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అధికారులు నీటి పడవలపై అమీర్‌ ఖాన్‌, విష్ణు భార్య గుత్త జ్వాల, ఇంకా ఇతర కుటుంబ సభ్యులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న ఫోటోలను విష్ణు విశాల్‌ నెటిజన్స్ తో పంచుకున్నారు. వరదల్లో చిక్కుకున్న తమను రక్షించినందుకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఇక మిచౌంగ్ తుఫాన్ ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. ఏపీలో తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. భారీ ఈదురు గాలులతో అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం స్తంభించిపోయింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి