iDreamPost

ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువుపై కీలక నిర్ణయం!

Aadhaar Free Upadate: ఆధార్ కార్డు గురించి తెలియని వారు ఉండరు. దేశంలోని ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఉంటుంది. అయితే ఈ కార్డుకు సంబంధించి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారక సంస్థ తరచూ ఏదో ఒక సమాచారం అందిస్తూనే ఉంటుంది. తాజాగా మరో కీలక అప్ డేట్ ఇచ్చింది.

Aadhaar Free Upadate: ఆధార్ కార్డు గురించి తెలియని వారు ఉండరు. దేశంలోని ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఉంటుంది. అయితే ఈ కార్డుకు సంబంధించి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారక సంస్థ తరచూ ఏదో ఒక సమాచారం అందిస్తూనే ఉంటుంది. తాజాగా మరో కీలక అప్ డేట్ ఇచ్చింది.

ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువుపై కీలక నిర్ణయం!

ప్రస్తుతం మనకు అత్యంత ముఖ్యమైన ధ్రువపత్రాల్లో ఆధార్ కార్డు ఒకటి. ఈ కార్డు లేనిదే ఏ పని జరగదు అంటే అతిశయోక్తికాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలకు ఆధార్ కార్డు కీలకం. అంతేకాక ఇతర వ్యక్తిగత పనుల  విషయాల్లో కూడా ఈ కార్డే ముఖ్యమనే విషయం అందరికి తెలిసిందే. ఈ కార్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆధార్ కార్డు జారీ అయి పదేళ్లు దాటిన వాళ్లు.. వాటిని తప్పని సరిగా అప్ డేట్ చేసుకోవాలని తెలిపింది. 2023 ఫిబ్రవరి వరకే ఉచిత సేవలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారక సంస్థ (యూఐడీఏఐ) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ గడువు మూడు సార్లు పెంచగా.. తాజాగా ఆధార్ కార్డు అప్ డేట్ గడువులో యూఐడీఏఐ మార్పు చేసింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆధార్ కార్డులో అడ్రెస్, పేరు, ఫోన్ నెంబర్ వంటి  తదితర వివరాలను సొంతంగా అధికారిక ఆన్ లైన్ వెబ్ పోర్టల్ లో అప్ డేట్ చేసుకునే వారికి యూఐడీఏఐ గడువు విధించిన సంగతి తెలిసిందే. ఆధార్ కార్డు కలిగి ఉన్న ఎవరైనా ఆ కార్డు పొందిన పదేళ్లు గడువులో  ఒక్కసారైనా వారికి సంబంధించి.. ప్రస్తుత అడ్రెస్ వంటి వివరాలను కచ్చితంగా మార్పు చేసుకోవాలని ఉదయ్  గతంలో సూచించింది. ఈ కార్డులో అప్ డేట్ కోసం  2023 ఫిబ్రవరి వరకు గడువు విధించింది. అయితే తాజాగా గడువు విషయంలో ఉదయ్  మార్పులు చేసింది. ఆధార్ కార్డు అప్ డేట్  చేసుకునే వారికి  ఆ సేవలను ఉచితంగా అందజేసే గడవును మరోసారి పెంచింది.  వచ్చే ఏడాది మార్చి  14వ తేదీ వరకు పొడిగించింది.

Aadhaar Free Update

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరంగా అన్ని కార్యక్రమాల్లో ఆధార్ వినియోగం  తప్పని సరిగా పెరిగిన  విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వినియోదారుడికి పాత సమాచారం కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఐడీఏఐ గతంలో ప్రకటించింది.  ఆ సమయంలోనే ఆధార్ కు సంబంధించిన వివిధ రకాల సేవలను పొందాలంటే నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉండగా.. ఆన్ లైన్ లో సొంతంగా ఆధార్ వివరాలు అప్ డేట్ చేసుకునే వారికి మాత్రం ఆ ఛార్జీల మినహాయింపు ఉంటుందని గతంలో ప్రకటించింది. అంటే ఆధార్ అప్ డేట్ చేసుకునే వారికి ఎలాంటి రుసుము చెల్లించకుండా చేసుకోవచ్చు.  మొదట 2023 ఫిబ్రవరి  వరకే ఈ ఉచిత సేవలని ప్రకటిచంగా… అనంతరం ఆ గడువును మూడు దఫాలు పొడిగించింది.

తాజాగా నాలుగోసారి  2024 మార్చి  14 వరకు గడువు పొడిగిస్తున్నట్లు పేర్కొంటూ యూఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్ సీఆర్ ప్రభాకరన్ తాజాగా వెల్లడించారు. ఇక గడువు ముగిసిన తరువాత ఎవరైనా ఆధార్ వివరాలు అప్ డేట్ చేయించుకోవాలంటే రుసుం చెల్లించాల్సి ఉంటుంది. యూఐడీఏఐనిబంధనల మేరకు తాజా ఐడీ కార్డు రేషన్ కార్డు,ఓటరు కార్డు,పాస్ పోర్టు, కిసాన్ ఫొటో పాస్ బుక్,  ఏదైనా టీసీ, మార్కుల జాబితా, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటితో చిరునామా వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆ ఐడీ కార్డులే కాకుండా కరెంటు, టెలిఫోన్, వాటర్, గ్యాస్ లకు సంబంధించిన బిల్లులను కూడా చిరునామా ధ్రువీకరణ కోసం సమర్పించవచ్చని యూఐడీఏఐ తెలిపింది. అయితే ఈ బిల్లులు ఇటీవల మూడు నెలల్లోపు చెల్లించినవి అయ్యుండాలి. మరి.. తాజాగా మరోసారి ఆధార్ అప్ డేట్ గడువు పెంచడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి