iDreamPost

బెంగాల్ యువకుడ్ని పెళ్లాడేందుకు పాక్ నుండి

ప్రేమించిన యుపి యువకుడి కోసం పాకిస్తాన్ కు చెందిన సీమా హైదర్ తన పిల్లలను తీసుకుని ఇండియాలోకి వచ్చేసిన సంగతి విదితమే. అయితే ఇప్పుడు మరో యువతి.. ఓ వ్యక్తిని మనువాడేందుకు భారత్ కు చేరుకుంది. ఈ వార్త ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.

ప్రేమించిన యుపి యువకుడి కోసం పాకిస్తాన్ కు చెందిన సీమా హైదర్ తన పిల్లలను తీసుకుని ఇండియాలోకి వచ్చేసిన సంగతి విదితమే. అయితే ఇప్పుడు మరో యువతి.. ఓ వ్యక్తిని మనువాడేందుకు భారత్ కు చేరుకుంది. ఈ వార్త ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.

బెంగాల్ యువకుడ్ని పెళ్లాడేందుకు పాక్ నుండి

ఇటీవల కాలంలో ప్రేమలు, పెళ్లిళ్లు హద్దులే కాదూ సరిహద్దులు కూడా దాటేస్తున్నాయి.  సోషల్ మీడియాలో పరిచమైన ప్రేమికుడి కోసం పరాయి దేశానికి చెందిన మహిళలు వస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్ కోసం పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదరి తన నలుగురు పిల్లలను తీసుకుని అక్రమంగా ఇండియాలోకి అడుగుపెట్టిన సంగతి విదితమే. పోలాండ్ నుండి పోలాక్ బార్బరా, మన చిత్తూరు వాసి లక్ష్మణ్ కోసం శ్రీలకం యువతి విఘ్నేశ్వరి, బంగ్లాదేశ్ నుండి మరో మహిళ.. ఇండియన్ పోరగాళ్ల కోసం వచ్చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ప్రేమ కథల జాబితా చాలా పెద్దగానే ఉంది. ఇప్పుడు మరో పాకిస్తాన్ మహిళ.. తన ప్రియుడి కోసం సరిహద్దు బోర్డర్ దాటి భారత్‌లోకి అడుగు పెట్టింది.

భారత్‌లోని కోల్ కత్తా నివాసి సమీర్ ఖాన్‌ని పెళ్లి చేసుకునేందుకు కరాచీకి చెందిన యువతి జవేరియా ఖానుమ్.. తన దేశాన్ని వీడింది. మంగళవారం వాఘా-అట్టారీ అంతర్జాతీయ సరిహద్దు నుండి ఇండియాలో అడుగుపెట్టింది జవేరియా. ఆమెకు ఘనంగా భారత్‌లోకి ఆహ్వానించారు సమీర్ ఖాన్, అతడి కుటుంబ సభ్యులు. వీరి వివాహం జనవరిలో జరగనుంది. పశ్చిమ బెంగాల్‌లోని గురుదాస్ పూర్‌లో ముస్లిం ఆచారాల ప్రకారం వీరు పెళ్లి చేసుకోనున్నారు. 45 రోజుల వీసా పై జవేరియా భారత్‌లో ఉండనున్నారు. వాస్తవానికి జవేరియా, ఆమె కుటుంబ సభ్యులకు గతంలో రెండు సార్లు వీసా ఇచ్చేందుకు ఇండియా తిరస్కరించింది. ఓ సామాజిక కార్యకర్త సాయంతో జవేరియా, ఆమె కుటుంబ సభ్యులు ఈ వీసా పొందారు. పెళ్లి తర్వాత వీసా గడువును పొడిగించేందుకు దరఖాస్తు చేసుకోనున్నారు.

మే 2018లో తమ జర్నీ ప్రారంభమైందని, జర్మనీ చదువుకుంటున్న సమయంలో ఇంటికి వచ్చానని, ఆ సమయంలో జవేరియా ఫోటోను చూసి, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపాడు సమీర్. అయితే కరోనా కారణంగా పలు మార్లు పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. దీనికి తోడు వీసా పలుమార్లు తిరస్కరించడంతో అలా తమ వివాహం పోస్ట్ పోన్ అవుతూ వచ్చిందని, ఎట్టకేలకు ఆమె ఇక్కడకు వచ్చిందని అన్నారు. తన ఆనందానికి అవధుల్లేవని, జనవరిలో తమ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంటున్నట్లు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి