iDreamPost

వాచ్‌మెన్‌ ఉద్యోగం చేస్తూనే..మూడు ప్రభుత్వ ఉద్యోగాలు

  • Published Mar 01, 2024 | 10:54 AMUpdated Mar 01, 2024 | 10:54 AM

జీవితంలో సక్సెస్ అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. అందుకు ఎంతో కష్టపడాలి. అయితే అలా కష్టపడి కృషి చేయడమే కాకుండా ఆత్మవిశ్వాసన్ని కూడా కోల్పో కూడాదని ఓ యువకుడు చాటి చెప్పాడు. ఓవైపు వాచ్ మెన్ గా పనిచేస్తునే ఏకంగా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు.

జీవితంలో సక్సెస్ అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. అందుకు ఎంతో కష్టపడాలి. అయితే అలా కష్టపడి కృషి చేయడమే కాకుండా ఆత్మవిశ్వాసన్ని కూడా కోల్పో కూడాదని ఓ యువకుడు చాటి చెప్పాడు. ఓవైపు వాచ్ మెన్ గా పనిచేస్తునే ఏకంగా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు.

  • Published Mar 01, 2024 | 10:54 AMUpdated Mar 01, 2024 | 10:54 AM
వాచ్‌మెన్‌ ఉద్యోగం చేస్తూనే..మూడు ప్రభుత్వ ఉద్యోగాలు

ప్రతిఒక్కరి జీవితంలో సక్సెస్ అనేది అంత ఈజీగా వచ్చేది కాదు, అందుకు ఎంతో కష్టపడాలి.అలా కష్టపడితే కానీ మనం అనుకున్నది సాధించలేము.ఇలా ఏదో విధంగా లైఫ్ లో ఎదగడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అనేక అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, విమర్శలు అన్ని తోడై ఉంటాయి. కానీ వాటికి బెదరకుండా ఒక్కో మెట్టు ఎక్కి అనుకున్న గమ్యస్థానానికి చేరుకున్న వారే సక్సెస్ ను చవి చూస్తారు. అయితే ఒకొక్కసారి ఎంత ప్రయత్నించినా తాము అనుకున్న స్థాయికి చెరుకోవడంలో కాస్తా అలస్యం అవుతుంది. అటువంటి పరిస్థితిలో విధిని నిందించుకుంటాము. అలా కాకుండా..ధృడ సంకల్పం, ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుస్తు పోరాటం చేయాలి. అప్పుడే సక్సెస్ మన వెంట ఉంటుంది.అయితే ప్రస్తుతం ఉన్న పోటీ రంగంలో ప్రభుత్వం ఉద్యోగం సంపాదించాలంటే.. కృషి ఒక్కటి ఉంటే సరిపోదు. ఆత్మవిశ్వాసం ఒక్కటి ఉంటే చాలని ఓ యువకుడు నిరూపించాడు.కేవలం ఒక వాచ్‌మెన్‌గా ఉద్యోగం చేస్తున్న ఆ యువకుడు.. నేడు ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించిన ఆదర్శ వ్యక్తిగా నిలిచాడు. మరి ఇంతటి సక్సెస్ ను సాధించిన ఆయన రియల్ లైఫ్ స్టోరి గురించి తెలుసుకుందాం.

‘కష్టేఫలి’ అన్నారు పెద్దలు. ఎందుకంటే.. కష్టపడితే కానిదంటూ అంటూ ఏదీ ఉండదు. కానీ, ఇక్కడ కష్టంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా ఉండాలని తన విజయంతో చాటి చెప్పాడు ఓ యువకుడు. ఓవైపు వాచ్‌మెన్‌గా ఉద్యోగం చేస్తూనే మరోవైపు పట్టుదలతో ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్‌ అయ్యాడు. అలా ధృడ సంకల్పంతో ప్రిపేర్‌ అవ్వడమే కాకుండా.. ఇప్పడు ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు.అవును.. మనపై మనం నమ్మకం ఉంచుకొని పట్టుదలతో నిరంతర కృషి చేస్తే ఏదైనా ఏదైనా సాధించవచ్చని నిరూపించారు ప్రవీణ్.మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొన్కల్ గ్రామానికి చెందిన ప్రవీణ్.. ప్రాధమిక విద్య నుంచి డిగ్రీ వరకు జెన్నారంలో పూర్తి చేశారు.అయితే ప్రవీణ్ తండ్రి పెద్దులు మేస్త్రీ పనిచేస్తుండగా, తల్లి పోసమ్మ బీడీ కార్మికురాలిగా పనిచేస్తు ఇతనిని చదివించారు. అయితే తన తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూసిన ప్రవీణ్.. తాను ఎలా అయిన ఉన్నత ఉద్యోగం సాధించాలని నిర్ణయించుకున్నారు. అలా నిరంతరం కష్టపడి చదువు పై దృష్టి పెడుతూ.. ఎంకాం, బీఈడీ, ఎంఈడీ ఓయూ క్యాంపస్ లో ప్రవీణ్ చదుపుకున్నారు. కాగా, ఈయన ఖర్చుల కోసం తల్లిదండ్రల మీద ఆధారపడకుండా.. ఖర్చుల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎడ్యుకేషనల్ మల్టీ మీడియా రీసెర్చ్ సెంటర్ (EMRC) లో రాత్రిపూట వాచ్ మెన్‌గా పనిచేసేవాడు. ఇంత చదువులు చదివినా ప్రవీణ్ ఇలా వాచ్ మెన్ గా పనిచేస్తున్నందుకు తనని తాను ఏరోజు తక్కువ చేసుకోలేదు. అదే పనిగా పట్టుదలతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు.

ఈ క్రమంలోనే.. ఆయన పది రోజుల వ్యవధిలోనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. ఇటీవలే తెలంగాణ గురుకుల విద్యాలయాల బోర్డు ప్రకటించిన ఫలితాల్లో… టీజీటి, పీజీటి, జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు సాధించారు.ఇక ఆయన ఆత్మవిశ్వాసం పట్టుదల, శ్రమ ఫలించి..ఒకే సారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు.అలాగే సక్సెస్ వెంట మనం పరిగెత్తడం కాదు, అందుకు తగిన కృషి చేస్తే సక్సెస్ మన వెంట ఉంటుందని అందరికి ఆదర్శషంగా నిలిచాడు. కాగా, ప్రవీణ్ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించటం పట్ల ఈఎమ్మార్సీ డైరెక్టర్, ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రవీణ్ లాంటి వారి స్పూర్తితో పేదరికాన్ని జయించేందుకు విద్యార్థులు, యువత మరింత ముందుకు అడుగులు వేస్తూ.. ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ ను ఈఎమ్మార్సీ ఉద్యోగులు ప్రశంసిస్తూ సన్మానించారు. మరి, ఒక వాచ్‌మెన్‌గా ఉద్యోగం చేస్తూ మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ప్రవీణ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి