iDreamPost

భర్తలు ఈ గుడికి వెళ్లి మొక్కితే విడాకులు గ్యారంటీ.. ఈజీగా వస్తాయి..!

  • Published Mar 19, 2024 | 6:26 PMUpdated Mar 19, 2024 | 6:26 PM

సాధారణంగా మంచి ఆరోగ్యం, ఉద్యోగం, కోరుకున్న జీవిత భాగస్వామి ఇలాంటివి కావాలని.. దేవుడిని మొక్కుకోడానికి గుడికి వెళ్తూ ఉంటారు. అలాగే వారి వారి కోరికలు కూడా తీరుతూ ఉంటాయి. అయితే, విడాకులు కావాలంటే మాత్రం ఇప్పుడు మనం చెప్పుకోబోయే గుడికి వెళ్తే చాలట.. వెంటనే విడాకులు వచ్చేస్తాయని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు.

సాధారణంగా మంచి ఆరోగ్యం, ఉద్యోగం, కోరుకున్న జీవిత భాగస్వామి ఇలాంటివి కావాలని.. దేవుడిని మొక్కుకోడానికి గుడికి వెళ్తూ ఉంటారు. అలాగే వారి వారి కోరికలు కూడా తీరుతూ ఉంటాయి. అయితే, విడాకులు కావాలంటే మాత్రం ఇప్పుడు మనం చెప్పుకోబోయే గుడికి వెళ్తే చాలట.. వెంటనే విడాకులు వచ్చేస్తాయని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు.

  • Published Mar 19, 2024 | 6:26 PMUpdated Mar 19, 2024 | 6:26 PM
భర్తలు ఈ గుడికి వెళ్లి మొక్కితే విడాకులు గ్యారంటీ.. ఈజీగా వస్తాయి..!

ప్రపంచంలో ఎవరైనా సరే.. వారి వారి కోరికలను తీర్చమని మొక్కుకోడానికి దేవాలయాలకు వెళ్తూ ఉంటారు. కోరికలంటే సాధారణంగా ఏ మనిషికైనా ఉండేవి ఉన్నత విద్య, మంచి ఉద్యోగం, కోరుకున్న జీవిత భాగస్వామి రావడం, తల్లి దండ్రులు హ్యాపీగా ఉండడం.. నూటికి తొంబై మందికి ఇలాంటి కోరికలే ఉంటాయి. కాబట్టి ఇటువంటి కోరికలను దేవుడు దగ్గర చెప్పుకోవడం కోసం చాలా మంది గుడులకు వెళ్తూ ఉంటారు. మరి కొంతమంది మాత్రం ప్రశాంతత కోసం వెళ్తూ ఉంటారు. ఇంకా వారి వారి భక్తిని బట్టి వారి కోరికలు తీరుతూ ఉంటాయి. అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే గుడికి వచ్చే వ్యక్తులు మాత్రం.. పైన చెప్పిన కోరికలన్నిటికి విరుద్ధంగా.. కోరుకుంటారట. వారికీ విడాకులు ఇప్పించమని, బంధాల నుంచి విముక్తి చేయమని కోరుకోవడం కోసం మాత్రమే వెళ్తారట. ఇంతకీ ఈ గుడి ఎక్కడ ఉంది! అనే విషయాల గురించి తెలుసుకుందాం.

బంధాల నుంచి దూరం చేయకుండా ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూడమని.. దేవుడిని వేడుకోవడం కామన్. కానీ, లైఫ్ పార్టనర్ తో విడిపోవాలని, ఉన్న ఉద్యోగం నుంచి కంపెనీ ఏ పొలైట్ గా బయటకు పంపించేయాలని, బిజినెస్ పార్టనర్ తో బిజినెస్ క్లోజ్ చేయాలనీ, గొడవలు, వివాదాలు, కోర్టు కేసులు ఇవేం లేకుండా ఆయా బంధాలు విడిపోవాలనే కోరికలు ఉంటే మాత్రం జపాన్ లోని.. గొప్ప ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన హిగషియమలోని క్యోటో నగరంలో ఉన్న “యూసుమ్ కోనేగు” ఆలయంలో మొక్కుకుంటే చాలు. వెంటనే ఆ కోరికలు నెరవేరుతాయని అక్కడి భక్తుల నమ్మకం. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా సరే.. అక్కడి భక్తులు ఇలాంటి బంధాల నుంచి.. బంధవిముక్తులను చేయమని ఎంతో విశ్వాసంగా ప్రార్దిస్తారట.

Divorce is sure if you plant in this temple

ఆ ఆలయంలో ఓ పెద్ద బండరాయి ఉంటుంది. ఆ బండరాయి మధ్యలో ఒక మనిషి పట్టేంత పెద్ద రంద్రం ఉంటుంది. ఎవరైనా భక్తులు ఎటువంటి గొడవలు లేకుండా తాము తెంచుకోవాలనుకుంటున్న బంధాల వివరాలను ఒక చీటిపై రాసి బండరాయి మధ్యలో.. ఉన్న రంధ్రం నుంచి .. రెండు సార్లు బండరాయిపై ఉన్న వస్త్రానికి కట్టి.. తమ బంధాన్ని దూరం చేయమని ప్రార్ధించాలి. అలా చేసిన వారికీ ఖచ్చితంగా ఆ మొక్కు తీరుతుందని జపాన్ వాసుల నమ్మకం. కాబట్టి ఎవరైనా బంధాల నుంచి విముక్తి పొందాలంటే మాత్రం ఈ గుడికి వెళ్లాల్సిందే. ఇక సోషల్ మీడియాలో దీనిని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మరి వినడానికి విచిత్రంగా ఉన్న ఈ దేవాలయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి