iDreamPost

దీపావళి బోనస్‌గా ఉద్యోగులకు రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్స్! సూపర్ బాస్!

దీపావళి పండుగ వస్తుందంటే ఇంట్లోనే కాదూ ఆఫీసుల్లోనూ దీపాలు వెలుగుతుంటాయి. అయితే ఈ వెలుగులు ఉద్యోగుల కళ్లల్లో నుండి. ఎందుకంటే.. దీవాళిని పురస్కరించుకుని యజమానులు.. తమ ఉద్యోగులకు బోనస్, ఇన్సెంటివ్స్, కొత్త బట్టలు, బంగారం, గిఫ్టులు ఇస్తుంటారు.

దీపావళి పండుగ వస్తుందంటే ఇంట్లోనే కాదూ ఆఫీసుల్లోనూ దీపాలు వెలుగుతుంటాయి. అయితే ఈ వెలుగులు ఉద్యోగుల కళ్లల్లో నుండి. ఎందుకంటే.. దీవాళిని పురస్కరించుకుని యజమానులు.. తమ ఉద్యోగులకు బోనస్, ఇన్సెంటివ్స్, కొత్త బట్టలు, బంగారం, గిఫ్టులు ఇస్తుంటారు.

దీపావళి బోనస్‌గా ఉద్యోగులకు రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్స్! సూపర్ బాస్!

దీపావళి పండుగ అంటే కోటి కాంతుల పండుగ. పర్వదినానికి కొన్ని రోజుల ముందు నుండే టపాసులు మోత మోగిపోతూ ఉంటుంది. చిన్నా, పెద్ద సంబరంలో మునిగి తేలిపోతుంటారు. ఇక ఉద్యోగుల అయితే డబుల్ ఆనందంలో ఉంటారు. ఎందుకంటే ఆ సమయంలో కంపెనీ యజమానులు.. తమ ఉద్యోగులకు స్వీట్లతో పాటు క్రాకర్లు, బట్టలు పెట్టడమే కాదూ.. బోనస్‌లు, ఇన్సెంటివ్స్, స్పెషల్ గిఫ్టులు ఇస్తూ ఉంటారు. అందుకే ఉద్యోగులు ఆ పండుగ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తమ బాస్ ఈ పండుగకు ఏం ఇస్తారా అని కుతుహలంతో వెయిట్ చేస్తారు. దక్షిణాది కన్నా ఉత్తరాదిలో ఈ బోనస్, స్పెషల్ గిఫ్టుల కల్చర్ ఉందని చెప్పొచ్చు. గతంలో సూరత్ కు చెందిన వజ్రాల వ్యాపారి తమ ఉద్యోగులకు కార్లు, ప్లాట్లు, వజ్రాలు బహుమతిగా ఇచ్చిన సంగతి విదితమే.

ఇప్పుడు మరో వ్యాపార వేత్త తమ ఉద్యోగులకు ఖరీదైన బైకులు అందించి.. సంభ్రమాశ్చర్యంలో మునిగేలా చేశారు. ఇంతకు ఆ బైకులు ఏంటంటే రాయల్ ఎన్ ఫీల్డ్స్. ఇంత గొప్ప మనస్సు ఉన్న ఆ వ్యాపార వేత్తది తమిళనాడు. తిరుప్పూర్ బిజినెస్ మ్యాన్ శివకుమార్‌కు నీలగిరి జీల్లా కోటగిరిలో టీ ఎస్టేట్ ఉంది. అందులో సుమారు 15 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులోని ఉద్యోగులకు దీపావళి పండుగను పురస్కరించుకుని 10 రోజుల ముందు సర్ ప్రైజ్ గిప్ట్ ఇచ్చారు. వారందరికీ రాయల్ ఎన్ ఫీల్డ్ బైకులు ఇచ్చారు. దీంతో సంబరంలో మునిగి తేలిపోయారు ఎంప్లాయిస్. వారితో ఆటలు ఆడించి, ఈ భారీ బహుమతిని ఇవ్వడమే కాదూ.. అతడూ ఆ బైక్స్ పై రైడ్ చేశారు.

ఉద్యోగులు మాట్లాడుతూ.. ఆయన ఓనర్‌లా ఉండరని, అన్నయ్య, స్నేహితుడిలా ఉంటారని అన్నారు. ప్రతి దీపావళికి ఏదో ఒక గిఫ్ట్స్ ఇస్తూనే ఉంటారు. ఈ సారి మీటింగ్ అని పిలిచి.. సర్ ప్రైజ్ ప్లాన్ చేశారని, అక్కడకు వెళ్లిన అరగంట తర్వాత రాయల్ ఎన్ పీల్డ్ బైక్స్ ఇచ్చారని చెప్పారు. తాము ఇటువంటి బహుమతులు ఇస్తారని ఊహించలేదన్నారు. తమ టీమ్ వర్క్ మెచ్చి వీటిని ఇచ్చినట్లు చెప్పారు. నీలగిరిలో తన పేరు తెలిసిందంటే.. అది ఉద్యోగుల చలవే కారణమన్నారు వ్యాపార వేత్త శివకుమార్. అందుకే వారికి ఇలా సర్ ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలిపారు. నిజంగా ఇలాంటి యజమానులు ఉంటే.. ఉద్యోగులు .. మరో జాబ్ కోసం పరుగెత్తరు కదా.. జీతం ఇవ్వడమే భారంగా ఫీలవుతున్న యజమానులు ఉన్న ఈ రోజుల్లో.. ఉద్యోగులకు ఇలాంటి సర్ ప్రైజ్ ట్రీట్ ఇవ్వడంపై మీరేమంటారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి