iDreamPost

విజయ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.. అసలేం జరిగిందంటే?

Case against Thalapathy Vijay: ఇటీవల ‘తమిళగ వెట్రి కజగం’ పార్టీని స్థాపించిన విజయ్ దళపతి శుక్రవారం జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఓ సంఘటన జరిగింది.

Case against Thalapathy Vijay: ఇటీవల ‘తమిళగ వెట్రి కజగం’ పార్టీని స్థాపించిన విజయ్ దళపతి శుక్రవారం జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఓ సంఘటన జరిగింది.

విజయ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.. అసలేం జరిగిందంటే?

తమిళనాట ఎన్నికల హడావుడి ముగిసింది. ఎన్నికల ముందు అన్ని పార్టీల నేతలు తమ ప్రచారాలతో హూరెత్తించారు. శుక్రవారం పోలింగ్ సమయంలో కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు సంఘటలను మినహా అంతా బాగానే కొనసాగినట్లు వార్తలు వచ్చాయి. పోలింగ్ బూత్ వద్దకు ఓటు వేయడానికి వచ్చిన సమయంలో దాదాపు రెండు వందలమందికి పైగా తన అనుచరులతో రావడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బంది పడ్డారని ఓ సామాజిక కార్యకర్త ప్రముఖ నటుడు, టీవీకే నేత విజయ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం తమిళ నాల తీవ్ర కలకలకం రేపింది. అసలు ఏం జరిగిందనే విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో 40 లోక్ సభ నియోజకవర్గాలకు శుక్రవారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. కొన్ని చోట్ల చిన్న చిన్న సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘనకు పాల్పపడ్డారని, ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలతో తన మద్దతుదారులతో వచ్చారంటూ ఒక సామాజిక కార్యకర్త చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. హీరో విజయ్ తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి స్థానిక నిలాంగరైలోని పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఆ సమయంలో 200 మంది అనుచరులతో విజయ్ రావడంతో.. గట్టి బందోబస్తు నడుమ పోలీసులు పోలింగ్ కేంద్రానికి తీసుకువెళ్లారు.

ఆ సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారని.. ఓటు వేసే సమయంలో పోల్ కోడ్‌ను ఉల్లంఘించారని ఫిర్యాదుదారు ఆరోపించారు. మరోవైపుఈ వార్తలను పోలీసు సన్నిహిత వర్గాలు ఇంకా ధృవీకరించలేదు. ఇటీవల హీరో విజయ్ తలపతి ‘తమిళగ వెట్రి కజగం’ పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. లియో సినిమా తర్వాత ఆక్ష్న ‘GOAT’ మూవీలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రష్యాలో సాగుతుంది. ఎన్నికల సందర్భంగా తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు చెన్నై చేరుకున్నట్లు సమాచారం. గతంలో విజయ్ నటించిన ‘సర్కార్’ మూవీ.. ఓటు హక్కు గురించి మంచి సందేశాత్మక చిత్రంగా తెరకెక్కించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి