iDreamPost

తన వల్లే చనిపోయాడని.. యువకుడి ఇంటికి వెళ్లి శునకం మూగ రోదన

జంతువుల్లో చాలా విశ్వాసంగా ఉండేది శునకం మాత్రమే. అందుకే చాలా మంది జాగిలాన్ని పెంచుకునేందుకు ఇష్టపడుతుంటారు. ఇంట్లో మనిషిలా మారిపోతుంటుంది. కోప్పడితే.. కామ్ గా ఉండటం, అలగడం వంటివి చేస్తుంటుంది. యజమానికి ఏదైనా జరిగితే.. విలవిలలాడిపోతుంది..

జంతువుల్లో చాలా విశ్వాసంగా ఉండేది శునకం మాత్రమే. అందుకే చాలా మంది జాగిలాన్ని పెంచుకునేందుకు ఇష్టపడుతుంటారు. ఇంట్లో మనిషిలా మారిపోతుంటుంది. కోప్పడితే.. కామ్ గా ఉండటం, అలగడం వంటివి చేస్తుంటుంది. యజమానికి ఏదైనా జరిగితే.. విలవిలలాడిపోతుంది..

తన వల్లే చనిపోయాడని.. యువకుడి ఇంటికి వెళ్లి శునకం మూగ రోదన

మనిషికి అత్యంత విశ్వాసపాత్రమైన జంతువు శునకం. దానికి ఒక్క ముద్ద అన్నం పెడితే చాలు.. అది బతికున్నంత వరకూ గుర్తించుకుంటుంది. ఇక పెంపుడు కుక్కల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంట్లో ఓ మనిషిలా మసలుతుంది. ప్రమాదంలో ఉండే యజమానులను కాపాడటం, ఇంట్లో ఇష్టమైన వ్యక్తులు చనిపోతే బాధతో రోధించే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఒక్క నిమిషం మనం కనిపించకపోతే.. హడావుడిగా ఇల్లంతా తిరిగేస్తూ ఉంటాయి. మనం కోప్పడితే అలుగుతాయి. బుజ్జగిస్తే.. ఆనందాన్ని వ్యక్తం చేస్తాయి. అయితే.. ఇటీవల కర్ణాటకలో రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మరణిస్తే.. ఓ శునకం ప్రవర్తించిన తీరు ఆశ్చర్యమేయడమే కాదూ కంటతడి పెట్టించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాళ్లోకి వెళ్తే..

రోడ్డు ప్రమాదంలో చనిపోయిన యువకుడి ఇంటిని వెతుక్కుంటూ వెళ్లింది ఓ శునకం. అక్కడ అది ప్రవర్తించిన తీరు అందర్ని ఆశ్యర్యపరించింది. హొన్నాళి తాలూకా క్యానికెరెకు చెందిన తిప్పేశ్ (21)అనే యువకుడు ఈ నెల 16న తన సోదరిని బైక్ పై బస్ స్టాప్‌లో డ్రాప్ చేశాడు. అక్కడ నుంచి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. దారిలో ఉన్నట్టుండి ఒక శునకం పరిగెత్తుకుంటూ బైక్‌కి అడ్డంగా వచ్చింది. దానిని గమనించిన తిప్పేశ్ సడెన్ బ్రెక్ వేయడంతో.. ఒక్కసారిగా అదుపుతప్పి కిందపడ్డాడు. దీనితో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దృశ్యాన్ని గమనించిన స్థానికులు వెంటనే అతనిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. అయితే ఇదంతా గమనించిన ఆ శునకం తిప్పేశ్ మృతదేహన్ని అతని ఇంటికి తరలిస్తుండగా.. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి దాదాపు 8 కిలోమీటర్లు దూరం వరకు పరిగెత్తుకుంటూ వెంబడించింది.

అలా ఆ శునకం.. చనిపోయిన యువకుడి ఇంటికి వెతుక్కుంటూ వెళ్లింది. అయితే ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ఆ శునకం నేరుగా తిప్పేశ్ ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేసింది. కాని, వీధి కుక్క అని భావించి తరిమేశామని.. మృతుని మేనమామ సందీప్‌ తెలిపారు. అయినా.. ఆ శునకం ఇంటి దగ్గరే తిరుగుతూ కనిపించిందని స్థానికులు అంటున్నారు. ఈ క్రమంలో.. ఆ శునకం తిప్పేశ్ ఇంటి లోపలికి ప్రవేశించి అతని తల్లి యశోదమ్మ పక్కన కూర్చుని మౌనంగా దుఃఖించిందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా యశోదమ్మ చేతిలో తల పెట్టి దాని మూగ బాధను వ్యక్తం చేసింది. చాలాసేపు ఆ ఇంట్లో అన్ని గదులనూ చూసి, మళ్లీ తిరిగి వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రమాదవశాత్తూ తిప్పేశ్ చనిపోయాడనుకుని.. ఆ కుటుంబం బాధలో ఉంది. అదే సమయంలో ఆ శునకం మాత్రం తన వల్ల తిప్పేశ్ చనిపోయాడని వారి ఇంటికి వెళ్లిన ఘటన ఇప్పుడు చర్చంశనీయంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి