iDreamPost

7 ఏళ్లకే లాఠీ పట్టిన చిన్నోడు.. దాని వెనుక కన్నీరు తెప్పిస్తున్న కథ

మానవ జీవితంలో అందమైన దశ బాల్యం. ఏమీ తెలియని ఈ వయస్సులో చాలా అద్భుతంగా గడుస్తుంది కొందరికీ.. మరికొందరికీ బరువుగా నడుస్తుంది. ఈ సమయంలో కొన్ని లక్ష్యాలు ఉంటాయి. అవి నెరవేర్చుకునేందుకు సమయం ఉండదు. కానీ తమ కోరికలు తీర్చుకోవాలన్న ఆశ. కానీ తీరదన్న ఆవేదన. కానీ..

మానవ జీవితంలో అందమైన దశ బాల్యం. ఏమీ తెలియని ఈ వయస్సులో చాలా అద్భుతంగా గడుస్తుంది కొందరికీ.. మరికొందరికీ బరువుగా నడుస్తుంది. ఈ సమయంలో కొన్ని లక్ష్యాలు ఉంటాయి. అవి నెరవేర్చుకునేందుకు సమయం ఉండదు. కానీ తమ కోరికలు తీర్చుకోవాలన్న ఆశ. కానీ తీరదన్న ఆవేదన. కానీ..

7 ఏళ్లకే లాఠీ పట్టిన చిన్నోడు.. దాని వెనుక కన్నీరు తెప్పిస్తున్న కథ

చిన్నప్పుడు టీచర్ లేదా తల్లిదండ్రులు, బంధువులు నువ్వు పెద్దయ్యాక ఏమౌతావురా అని అడిగితే.. డాక్టర్, టీచర్, పోలీస్ ఇవే చెబుతుంటారు ఎక్కువ మంది పిల్లలు. ఎందుకంటే.. అవి ప్రొఫెషనల్ జాబ్స్‌గా ఆ వయస్సులో ఫీలవుతుంటారు చిన్నారులు. సినిమా, కార్టూన్స్ ప్రభావం కూడా వీరిపై కొంత ఉంటుంది. ఏం చదవాలో, ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియక పోయినా.. ఫ్యూచర్ లో అలాగే కావాలనుకుంటారు.  ముఖ్యంగా పోలీసు కావాలని ఆశపడుతుంటారు. పోలీసులు అంటే ఓ ఠీవి, రెస్పెక్ట్, ప్రజలకు మంచి చేయొచ్చునన్న భావన ఉంటుంది. కానీ బాల్యం అందరికీ ఒకేలా గడవదు. ఒకరికి మధురంగా, మరొకరికి భారంగా గడుస్తూ ఉంటుంది. ఇదిగో మనం చెప్పుకోబోయే చిన్నారికి కూడా ఎన్నో ఆశలు, ఆశయాలు ఉన్నాయి. కానీ లక్ష్యం నెరవేర్చుకునేందుకే సమయం లేదు. కానీ అతడి కలను నెరవేర్చారు బంజారా హిల్స్ పోలీసులు. ఏడేళ్ల వయస్సు బాలుడ్ని ఎస్సైగా మార్చేశారు. ఇంతకు ఏం జరిగిందంటే..?

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు చెందిన అనుపోజు బ్రహ్మం, లక్ష్మి దంపతుల రెండో కుమారుడు మోహన్ సాయి నాలుగో తరగతి వరకు చదువుకున్నాడు. గత ఏడాది మోహన్ సాయి అనారోగ్యం బారిన పడటంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. పరీక్షల్లో అతడికి రెక్టం క్యాన్సర్ అని నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం అతడు బంజారా హిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతున్నాడు. చికిత్స అందిస్తున్నప్పటికీ..అది ప్రాణం తీసే వ్యాధిగా మారింది. బాబు ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణిస్తోంది. దీంతో అతడికి ఏవేమీ కోరికలు ఉన్నాయో అవి తీర్చేందుకు సిద్ధమయ్యారు పేరేంట్స్. చిన్నప్పటి నుండి అతడికి పోలీస్ కావాలన్నది కల. ఆ విషయం తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది..మేక్ ఏ విష్ ఫౌండేషన్ సభ్యులకు తెలిపారు.

మోహన్ విష్‌ను తీర్చేందుకు బంజారా హిల్స్ పోలీసులతో మాట్లాడారు ఆ ఎన్జీవో సభ్యులు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని, అతడి కోరిక నేరవేర్చేందుకు ముందుకొచ్చారు పోలీసులు. మోహన్ సాయికి పోలీస్ డ్రస్ వేసి.. స్టేషన్‌కు తీసుకెళ్లారు తల్లిదండ్రులు, ఆసుపత్రి సిబ్బంది, ఎన్జీవో సభ్యులు. బాబును సాదరంగా ఆహ్వానించారు పోలీసులు. అధికారిగా కుర్చీలో కూర్చోబెట్టి మోహన్ కోరిక తీర్చారు. బాబుకి బంజారా హిల్స్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ జాకీర్ హుస్సేన్ గౌరవ వందనం చేశారు. పోలీస్ స్టేషన్ లో జరిగే పనివ విధానాన్ని అడ్మిన్ సబ్ ఇన్‌స్పెక్టర్ శివ శంకర్ వివరించారు. ఆ చిన్నారికి సబ్ ఇన్‌స్పెక్టర్ రవీందర్‌తో పాటు ఇతరులు బహుమతులు అందించారు.

కొడుకు మరికొన్ని రోజుల్లో దూరమౌతున్నాడని తెలిసి ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. అయితే అతడిని పోలీసు డ్రెస్సులో చూసుకుని మురిసిపోయారు. అధికారులు సెల్యూట్ చేస్తుంటే ఆనంద భాష్పాలతో పాటు భవిష్యత్తులో అతడు ఉండడని తెలిసి కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే బాబు కోరిక నెరవేర్చిన సంస్థకు, ఆసుపత్రి సిబ్బందికి, సహకరించిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ బాబు మోహన్ సాయి కోరిక నెరవేర్చడం వెనుక తల్లిదండ్రులు,ఎన్జీవో సంస్థ, పోలీసులు చేసిన సహకారం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి