iDreamPost

బాయ్‌ఫ్రెండ్‌తో కారులో అమ్మాయి! వీడియో తీసి, బ్లాక్‌మెయిల్‌ చేసి.. దారుణం!

  • Published Jul 13, 2023 | 12:33 PMUpdated Jul 13, 2023 | 12:48 PM
  • Published Jul 13, 2023 | 12:33 PMUpdated Jul 13, 2023 | 12:48 PM
బాయ్‌ఫ్రెండ్‌తో కారులో అమ్మాయి! వీడియో తీసి, బ్లాక్‌మెయిల్‌ చేసి.. దారుణం!

ఓ అమ్మాయి తన బాయ్‌ ఫ్రెండ్‌తో ఏకాంతంగా ఉండగా.. రవి సోలంకి అనే వ్యక్తి తన సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. ఆ వీడియో చూపించి, సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తానని, తాను పోలీస్‌ అధికారినని బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీలోని ప్రశాంత్‌ విహార్‌లో ఈ నెల 7వ తేదీన ఓ 23 ఏళ్ల అమ్మాయి తన బాయ్‌ ఫ్రెండ్‌తో కారులో ఏకాంతంగా ఉండగా.. రవి సోలంకి అనే వ్యక్తి తన సెల్‌ఫోన్‌తో సీక్రెట్‌గా వీడియో తీశాడు.

కొద్ది సేపటి తర్వాత.. బాయ్‌ఫ్రెండ్‌ కారులో ఆ అమ్మాయిని వాళ్ల అపార్ట్‌మెంట్‌ వద్ద దింపి వెళ్లిపోయాడు. వాళ్లనే ఫాలో అవుతూ వచ్చిన రవి.. అపార్ట్‌మెంట్‌లో ఆ అమ్మాయిని ఆపి.. ఇంతకు ముందు తాను రికార్డ్‌ చేసిన వీడియోను చూపించాడు. తానో పోలీస్‌ అధికారినని, తన మాట వినకపోతే ఈ వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తానని బ్లాక్‌మెయిల్‌ చేశాడు. భయంతో వణికిపోతున్న ఆ అమ్మాయిపై రవి దారుణానికి ఒడిగట్టాడు.

అపార్ట్‌మెంట్‌లో మనుషులు లేని చోటు ఆమెపై అత్యాచారానికి పాల్పడి, అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే తన బాయ్‌ఫ్రెండ్‌కు ఫోన్‌ చేసిన ఆ అమ్మాయి అతనికి జరిగిన విషయం మొత్తం చెప్పింది. వారిద్దరూ కుటుంబసభ్యులతో కలిసి పోలీసులుకు ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని వ్యక్తిగా ముందు కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీ కెమెరాలు, అమ్మాయి చెప్పిన పోలికలతో ఊహాచిత్రం గీయించి.. ఎట్టకేలకు గురువారం నిందితుడిని పట్టుకున్నారు. మరి ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సగం కాలిన శవాన్ని తిన్న మందుబాబులు.. భయాందోళనలో ప్రజలు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి