iDreamPost

మానవత్వం అంటే ఇదే.. ఈ వీడియో చూస్తే హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేరు.

  • Published Mar 30, 2024 | 8:28 PMUpdated Mar 30, 2024 | 8:28 PM

సోషల్ మీడియా యుగం పెరిగిపోతున్న క్రమంలో.. సోషల్ ఎక్సపెరిమెంట్స్ కూడా బాగా పెరిగిపోతున్నాయి. మనుషులలో మానవత్వం ఎంతవరకు ఉందో.. పరీక్షించేందుకు ఇలాంటి సోషల్ ఎక్సపెరిమెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియా యుగం పెరిగిపోతున్న క్రమంలో.. సోషల్ ఎక్సపెరిమెంట్స్ కూడా బాగా పెరిగిపోతున్నాయి. మనుషులలో మానవత్వం ఎంతవరకు ఉందో.. పరీక్షించేందుకు ఇలాంటి సోషల్ ఎక్సపెరిమెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.

  • Published Mar 30, 2024 | 8:28 PMUpdated Mar 30, 2024 | 8:28 PM
మానవత్వం అంటే ఇదే.. ఈ వీడియో చూస్తే హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేరు.

ఈరోజుల్లో మానవత్వంతో మసలుకునే వారు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. పైగా సోషల్ మీడియా యుగం పెరిగిపోయిన తర్వాత.. ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే.. దానిని వారి వారి మొబైల్స్ లో రికార్డు చేసి.. సోషల్ మీడియా అప్ లోడ్ చేసేవాళ్ళే ఎక్కువగా ఉన్నారు. కోడలిని వేధిస్తున్న అత్త, మామను హింసిస్తున్న కోడలు, భర్తను చిత్ర హింసలు పెడుతున్న భార్య అంటూ.. ఇలా రకరకాల ట్యాగ్ లైన్స్ తో సోషల్ మీడియాలో నిత్యం ఫోటోలు , వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి కానీ.. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే వారు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తున్నారు. వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే.. ఎదుటి వారికి సహాయం చేయాలి అనుకునే వారు అక్కడక్కడా ఉంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ అసలు ఏమై ఉంటుంది అనే విషయం తెలుసుకుందాం.

ప్రస్తుతం సోషల్ మీడియాలో.. సోషల్ ప్రాంక్స్ ఎక్కువైపోయాయి. అంటే ఎవరైనా ఆపదలో ఉంటే సహాయం చేస్తారా లేదా అని కావాలని ప్రాబ్లమ్ ను సృష్టించి.. సొల్యూషన్ ను ఇస్తున్నారు. అచ్చం ఇలాంటి ఒక సోషల్ ఎక్స్పరిమెంట్ కు సంబంధిచిన వీడియోనే ఇది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను గమనిస్తే.. ఓ వ్యక్తి తన దగ్గర డబ్బులు లేవని.. కానీ నాకు షూ పోలిష్ చేయండి అంటూ.. షూ పోలిష్ చేసే వారందరిని అడుగుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో తన దగ్గర డబ్బులు లేవు కాబట్టి.. ఎవరు కూడా అతని షూ పోలిష్ చేసేందుకు ఒప్పుకోవట్లేదు. అలా ఇద్దరు ముగ్గురు చేయమని చెప్పేశారు. ఆ తర్వాత అతను అదే షూ ని తీసుకుని మరొక వ్యక్తి దగ్గరకు వెళ్తాడు. కానీ, షూ పోలిష్ చేసే ఆ వ్యక్తి మాత్రం కస్టమర్ దగ్గర డబ్బులు లేకపోయినా సరే.. పోలిష్ చేయడానికి సరే అంటాడు. దీనితో కస్టమర్ ముందుగా ఒక కాలి షూ ను అతనికి ఇస్తాడు. అతను ఆ షూ పోలిష్ చేసాక.. మరొక షూలో ఇచ్చేటపుడు అందులో భారీ మొత్తంలో డబ్బు పెట్టి ఇస్తాడు. దీనితో ఒక్కసారిగా ఆ షూ పోలిష్ చేసే అతను ఒక్కసారిగా ఆశ్చర్యపడి.. భావోద్వేగానికి గురవుతాడు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ వీడియోను 87 లక్షల మంది చూశారు. వేల షేర్స్ లైక్స్ .. కామెంట్స్ తో ఈ వీడియో పాపులర్ అవుతుంది. ఇక దీనికి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ‘ఈ దృశ్యం చూసిన తర్వాత తనకు ఏడుపు వచ్చింది’ అని ఒకరు.. ‘దయ అనేది చాలా అందమైన భావం.. చివరికి ఒకరు గెలుస్తారు’ అని మరొకరు. ‘డబ్బులు లేకుండా పని చేయము అని వారు చెప్పడంలో తప్పేమి లేదు’ అని మరొకరు ఇలా రకరకాల అభిప్రాయాలను ఈ వీడియోపై వ్యక్తపరుస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి సోషల్ ఎక్సపెరిమెంట్స్ చాలా మందికి ఆదర్శంగా కూడా నిలుస్తున్నాయని చెప్పి తీరాలి. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి