iDreamPost
android-app
ios-app

వీడియో: అంబటి రాయుడిని ముఖం మీదే జోకర్ అనేసిన కెవిన్ పీటర్సన్!

Ambati Rayudu- Kevin Peterson: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఫైనల్స్ సందర్భంగా అంబటి రాయుడు- కెవిన్ పీటర్సన్ మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. కెవిన్ పీటర్సన్ ఒక్కసారిగా అంబటి రాయుడును జోకర్ అనేశాడు.

Ambati Rayudu- Kevin Peterson: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఫైనల్స్ సందర్భంగా అంబటి రాయుడు- కెవిన్ పీటర్సన్ మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. కెవిన్ పీటర్సన్ ఒక్కసారిగా అంబటి రాయుడును జోకర్ అనేశాడు.

వీడియో: అంబటి రాయుడిని ముఖం మీదే జోకర్ అనేసిన కెవిన్ పీటర్సన్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 అయితే ఘనంగా ముగిసింది. మూడోసారి కేకేఆర్ జట్టు ట్రోఫీని అందుకుంది. అయితే ఈ సీజన్లో ఇప్పటివరకు క్రికెట్, మ్యాచెస్, క్రీడాకారులు ఎలా అయితే వైరల్ అయ్యారో.. లాస్ట్ లో ఒక 10 రోజుల నుంచి అంబటి రాయుడు కూడా అలాగే వైరల్ అయ్యాడు. ఎప్పుడైతే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లీగ్ దశలో ఇంటికి వెళ్లిందో.. అప్పటి నుంచి అంబటి రాయుడు సోషల్ మీడియా, కామెంటేటర్ గా వీలైనన్ని కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు. ముఖ్యంగా రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు జట్టును టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశాడు. వాటిలో నిగూఢ అర్థంలో విరాట్ కోహ్లీ టార్గెట్ అని అందరికీ అర్థమైపోయింది. అయితే తాజాగా అంబటి రాయుడు మరో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈసారి అవమానం రాయుడుకే జరిగింది.

అంబటి రాయుడు క్రికెట్ నుంచి రిటైర్ అయిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ నుంచి కూడా తప్పుకున్నాడు. అయితే రిటైర్మెంట్ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ లో ఉన్నాడు. ఆ జట్టుతోనే రాయుడుకి అనుబంధం ఎక్కువ ఉంది. అందుకేనేమో చెన్నై ఓటమిని తట్టుకోలేక కాస్త పక్క జట్ల మీద ట్రోలింగ్ కూడా చేశాడు. అయితే అంబటి రాయుడు ఏం చేసినా అంతా మొదట చెన్నై జట్టు ఓటమిని తట్టుకోలేక చేశాడు అనుకున్నారు. కానీ, అతని పోస్టులు చూస్తే.. పరోక్షంగా కోహ్లీని టార్గెట్ చేశాడు అనే వార్తలు వచ్చాయి. కొన్ని వ్యాఖ్యలు చూస్తే అది నిజం అనే భావన కూడా కలుగుతుంది. ఇవన్నీ పక్కన పెడితే అంబటి రాయుడుకి కెవిన్ పీటర్సన్ పెద్ద అవమానమే చేశాడు.

ఈ సీజన్లో అంబటి రాయుడు కామెంటేటర్ గా కనిపించాడు. చాలా మ్యాచులకు కామెంటేటర్ గా వ్యవహరించాడు. అయితే తాజాగా అంబటి రాయుడు- కెవిన్ పీటర్సన్ కు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది ఫైనల్ మ్యాచ్ సమయంలో జరిగింది. కెవిన్ పీటర్సన్ మాట్లాడుతూ నేను కేకేఆర్ కు సపోర్ట్ చేస్తున్నాను. అందుకే ఇలా ఈ డ్రెస్ లో వచ్చాను అంటాడు. అయితే రాయుడు మాత్రం రెండు టీమ్స్ అనడంపై కెవిన్ పీటర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

నువ్వు జోకర్ అందుకే ఇలా వచ్చావ్ అంటూ కెవిన్ పీటర్సన్ రాయుడుని ముఖం మీద తిట్టేశాడు. అయితే రాయుడు దానిని కవర్ చేసే ప్రయత్నం కూడా చేశాడు. నేను రెండు జట్లను సపోర్ట్ చేస్తున్నాను. నేను గుడ్ క్రికెట్ ని సపోర్ట్ చేస్తున్నాను అందుకే ఇలా వచ్చాను అంటూ రాయుడు సమాధానం చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రాయుడుని జోకర్ అనడంపై కోహ్లీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నిరోజులు కోహ్లీని టార్గెట్ చేసినందుకు పీటర్సన్ కరెక్ట్ పేరు పెట్టాడు అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరి.. కెవిన్ పీటర్సన్- అంబటి రాయుడు మధ్య జరిగిన సంభాషణపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alhilarionbethilarionbetberlinbetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş