iDreamPost

తనకి అనుకూలంగా తీర్పు ఇవ్వలేదనీ కోర్టులోనే జడ్జిపై దాడి!

  • Published Jan 04, 2024 | 6:50 PMUpdated Jan 05, 2024 | 11:54 AM

సాధారణంగా ఎవరైనా చట్టానికి వ్యతిరేకంగా తప్పులు చేస్తే.. కోర్టు వారికి తగిన శిక్షను విదిస్తుంది. నిందితులు కూడా న్యాయస్థానానికి కట్టుబడి ఉండవలసి వస్తుంది. అయితే, తాజాగా ఒక కోర్టులో మాత్రం తనకు అనుకూలంగా న్యాయం చెప్పలేదని ఓ నిందితుడు ఏకంగా జడ్జ్ పైనే దాడి చేశాడు.

సాధారణంగా ఎవరైనా చట్టానికి వ్యతిరేకంగా తప్పులు చేస్తే.. కోర్టు వారికి తగిన శిక్షను విదిస్తుంది. నిందితులు కూడా న్యాయస్థానానికి కట్టుబడి ఉండవలసి వస్తుంది. అయితే, తాజాగా ఒక కోర్టులో మాత్రం తనకు అనుకూలంగా న్యాయం చెప్పలేదని ఓ నిందితుడు ఏకంగా జడ్జ్ పైనే దాడి చేశాడు.

  • Published Jan 04, 2024 | 6:50 PMUpdated Jan 05, 2024 | 11:54 AM
తనకి అనుకూలంగా తీర్పు ఇవ్వలేదనీ కోర్టులోనే జడ్జిపై దాడి!

ప్రపంచంలో ప్రతి రోజు చట్టానికి విరుద్ధంగా ఏవో ఒక సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. పోలీసులు కూడా వీటిపై సరైన యాక్షన్ తీసుకుంటూనే ఉంటారు. అలాగే కేసులన్నీ కోర్టు వరకు వెళ్తూ ఉంటాయి. కోర్టులో న్యాయ అన్యాయాలను పరిగణలోకి తీసుకుని.. నిందితులకు శిక్షను విధిస్తూ ఉంటారు. తప్పు చేసిన ఎవరైనా కోర్టు వేసిన శిక్షకు తల వంచాల్సిందే. ఒకవేళ నిందితుడి వైపే న్యాయం ఉంది అనిపిస్తే.. చట్ట పరంగా వాటికి సంబంధించిన ఎవిడెన్స్ లను ప్రూవ్ చేసుకోవాలి. ఇవన్నీ సాధారణంగా ఎక్కడైనా జరిగే ప్రక్రియలు. అయితే, తాజాగా అమెరికా న్యాయస్థానంలో జరిగిన ఓ సంఘటనకు అందరూ ఒక్కసారిగా కంగుతిన్నారు. తనకు తగిన తీర్పు రాలేదని ఓ వ్యక్తి ఏకంగా జడ్జ్ పైన దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

అమెరికాలోని వాషింగ్టన్‌లో క్లార్క్ కౌంటీ జిల్లా కోర్టులో ఈ సంఘటన చోటు చేసుకుంది. డియోబ్రా రెడ్‌డెన్‌ (30) అనే వ్యక్తి హానికరమైన బ్యాటరీతో దాడికి యత్నించాడు. ఈ విషయమై ఇతనిపై మూడు కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా ఇతనిని కోర్టులో ప్రవేశ పెట్టారు. అయితే, ఈ కేసు విషయంలో వాద ప్రతి వాదనలు జరుగుతున్నాయి. విచారణలో ఈ వ్యక్తిని దోషిగా నిర్దేశించి శిక్షను విధించారు. ఇదే విషయాన్నీ న్యాయమూర్తి మేరీ కే హోల్థస్ తన తీర్పుగా చదువుతున్నారు. అతని ప్రొబేషన్ అభ్యర్థనను కూడా తిరస్కరించి .. అతను శిక్ష అనుభవించే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. దీనితో ఆ వ్యక్తి కోపోధ్రిక్తుడై ‘ఫక్ దట్ బిచ్’ అంటూ ఉన్నట్టుండి జడ్జి మీదకు దూసుకుపోయాడు. ఆమెపై చేయి చేసుకున్నాడు.. కోపంతో బలంగా  కొట్టబోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతుంది.

పైగా , ఉన్నత అధికారుల అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. ఎవరు ఊహించనటువంటి ఈ సంఘటన అందరిని కొన్ని నిమిషాల పాటు కంగారు పెట్టింది. వెంటనే జడ్జ్ కు రక్షణ కల్పించే విధంగా పోలీసులు నిందితుడిని బంధించారు. ఈ ఘటనలో న్యాయమూర్తి తలకు బలమైన గాయాలు అయినట్టుగా సమాచారం. వీడియోలో గమనించినట్లయితే ఆ ఆవరణలో ఉన్న వస్తువులు కూడా అన్ని చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఇక నిందితుడి ఈ దారుణ ప్రవర్తనకు ఉన్న శిక్షలతో పాటు అదనపు శిక్షలను కూడా విదించనున్నారని తెలిపారు. గతంలోనూ ఈ నిందితుడిపైన అనేక కేసులు నమోదు అయ్యి ఉన్నాయని.. ఇంతకుముందు కూడా ఓసారి జైలుకు వెళ్లి వచ్చాడని .. అధికారులు పేర్కొన్నారు. ఏదేమైనా, తనకు అనుకూలంగా తీర్పును చెప్పలేదని.. నిందితుడు ఇంతటి హింసాత్మకంగా ప్రవర్తించడం అనేది సరైన పద్ధతి కాదు. ఈ విషయమై అధికారులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇక ప్రస్తుతం ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పదింస్తున్నారు. మరి , ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి