iDreamPost

ఒకప్పుడు బిచ్చగాడు ఇప్పుడు బిలియనీర్! 35 కార్లు, 150కి పైగా ఉద్యోగులు..

జీవితంలో ఏదైనా సాధించాలనే తపనతో నిత్యం ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చని పెద్దలు చెబుతుంటారు. చాలా మంది పారిశ్రామికవేత్తలు దీన్ని నిజమని నిరూపించారు. తాజాగా ఒక వ్యక్తి.. భిక్షాటన స్థితి నుంచి బిలియనీర్ గా మారారు. ఆయన సక్సెస్ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

జీవితంలో ఏదైనా సాధించాలనే తపనతో నిత్యం ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చని పెద్దలు చెబుతుంటారు. చాలా మంది పారిశ్రామికవేత్తలు దీన్ని నిజమని నిరూపించారు. తాజాగా ఒక వ్యక్తి.. భిక్షాటన స్థితి నుంచి బిలియనీర్ గా మారారు. ఆయన సక్సెస్ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒకప్పుడు బిచ్చగాడు ఇప్పుడు బిలియనీర్! 35 కార్లు, 150కి పైగా ఉద్యోగులు..

జీవితంలో ఏదైనా సాధించాలనే తపన ప్రతి మనిషికి ఉండాలి. అలాంటి పట్టుదల, కోరిక ఉన్నవాళ్లు జీవితంలో కచ్చితంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. శ్రమ, పట్టుదలతో ఎంతో మంది వ్యాపార వేతలు జీవితంలో గొప్ప స్థానంలో ఉన్నారు. అలాంటి వారు మన నిత్య జీవితంలో ఎందరో ఉన్నారు. మరికొందరు చాలా విచిత్రమైన పరిస్థితి నుంచి ఊహించని విధంగా రారాజుగా మారుతుంటారు. అలాంటి వారే కర్నాటకకు చెందిన రేణుకా ఆరాధ్య. ఆయన ఒకప్పుడు  బతుకు దెరువు కోసం భిక్షాటన చేసేవారు. కానీ తన కృషి, అంకిత భావం కారణంగా నేడు బిలియనీర్ గా మారారు. ఆయన సక్సెస్ స్టోరీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు సమీపంలో ఒక చిన్న గ్రామానికి చెందిన వ్యక్తి రేణుకా ఆరాధ్య. ఆయన చాలా పేద కుటుంబంలో జన్మించారు. అతడి కుటుంబం పరిస్థితి ఎంతో దయనీయంగా ఉండేది.  పదవ తరగతి పూర్తి చేసిన తరువాత కుటుంబానికి సహయం వివిధ పనులు చేసేవారు. ఇళ్లలో పనికి, ఇంటింటికీ వెళ్లి బియ్యం, పిండి, పప్పు కోసం అడుక్కోవాల్సిన దారుణమైన స్థితిలో వారు ఉండే వారు.

అయితే అదే పద్ధతిలో జీవితాన్ని సాగించడం రేణుకాకు కష్టంగా మారింది. దీంతో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగంలో చేరాడు. ఆ తరువాత ఓ ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగం సంపాదించాడు. ప్లాస్టిక్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు సొంతంగా బిజినెస్ చేయాలనే ఆలోచన వచ్చింది. అందులో భాగంగా సూట్‌కేస్ కవర్లను విక్రయించాలని నిర్ణయించుకున్నారు. కానీ వారు అనుకున్నట్లుగా పనులు జరగలేదు.

ఇదే సమయంలో డ్రైవింగ్ నేర్చుకుని ఓ ట్రావెల్ ఏజెన్సీలో డ్రైవర్ గా ఉద్యోగంలో చేరాడు. ఆ ఏజెన్సీ వద్దకు వచ్చే విదేశీ పర్యాటకులను ఎక్కడికైనా తీసుకెళ్లేవారు. నాలుగేళ్ల పాటు ట్రావెల్ ఏజెన్సీలో పని చేశారు.  ఆ తర్వాత, రేణుకా ఆరాధ్య కూడా సొంతంగా ట్రావెల్ ఏజెన్సీని ప్రారంభించాలని అనుకున్నాడు. ప్రవాసీ క్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక కంపెనీని ప్రారంభించారు. ఇందుకోసం సొంత డబ్బుతో పాటు బ్యాంకుల సాయం కూడా తీసుకున్నారు.

ఈ క్రమంలోనే ఒక కారు కొన్న  ఏడాదికే మరో కారు కొన్నారు.  ఇదే సమయంలో రూ.6 లక్షలు పెట్టి ఓ ట్రావెల్ ఏజెన్సీని కొనుగులో చేశాడు. ఆ సమయంలో కంపెనీకి 35 క్యాబ్‌లు ఉండేవి. ఇక ఇక్కడి నుంచి రేణుక ఆరాధ్య జాతకం మారిపోయింది. అమెజాన్ ఇండియా ప్రమోషన్ కోసం రేణుకా కంపెనీని ఎంచుకుంది. వాల్‌మార్ట్, జనరల్ మోటార్స్ వంటి కంపెనీలు కూడా వారితో కలిసి పని చేయడం ప్రారంభించాయి. అలా అంచెలంచేలుగా ఎదికి ప్రస్తుతం రూ.40 కోట్లు  వరకు చేరుకుంది. ఒక్కప్పుడు భిక్షాటన చేసిన రేణుకా ఆరాధ్య ఈరోజు 150 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నారు. మరి.. భిక్షాటన స్థితి నుంచి బిలియనీర్ గా మారిన రేణుకా ఆరాధ్య జీవితంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి