iDreamPost

హార్ట్ ఎటాక్ తో 8వ తరగతి విద్యార్థిని మృతి!

Student Passes away: ఈ మద్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో కన్నమూస్తున్నారు. చిన్నవయసులోనే ఓ విద్యార్థిని కన్నుమూయడం అందరి హృదయాలు కలచివేసింది.

Student Passes away: ఈ మద్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో కన్నమూస్తున్నారు. చిన్నవయసులోనే ఓ విద్యార్థిని కన్నుమూయడం అందరి హృదయాలు కలచివేసింది.

హార్ట్ ఎటాక్ తో 8వ తరగతి విద్యార్థిని మృతి!

ఇటీవల దేశంలో గుండెపోటు మరణాల సర్వసాధారణంగా మారాయి. ఒకప్పుడు పెద్ద వయస్సు వారికే గుండెపోటు వస్తుందని అనేవారు.. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు సైతం గుండెపోటుకు గురై  ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు. హై టెన్షన్, ఎక్కువగా వ్యాయామం చేయడం, డ్యాన్సులు చేయడం, అనారోగ్యం, కంటిన్యూగా ఆటలు ఆడటం ఇలా ఎన్నో కారణాల వల్ల హార్ట్ ఎటాక్ కి గురవుతున్నారని వైద్యులు చెబుతున్నారు. అప్పటి వరకు మన కళ్ల ముందు ఉన్నవాళ్లు హఠాత్తుగా కంటికి కానరాని లోకానికి వెళ్తున్నారు. ఎనిమిదో తరగతి విద్యార్థిని హార్ట్ ఎటాక్ తో కన్నుమూయడంతో ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే..

సిద్దిపేట అర్బన్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బుధవారం తడ్కపల్లిలో అంబటి మహేష్ కూతురు లాక్షణ్య (13) గుండెపోటుతు కన్నుమూసింది. స్థానిక ప్రైవేట్ పాఠశాలలో లాక్షణ్య 8వ తరగతి చదువుతుంది. మంగళవారం రాత్రి జ్వరంతో బాధపడుతుండగా తల్లిదండ్రులు ట్యాబ్లెట్ వేయడంతో ఉదయం వరకు తగ్గిపోయింది. ఉదయం టిఫిన్ చేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంది. బాత్ రూం కు వెళ్లిన లాక్షణ్య ఎంతకీ బయటికి రాకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది వెళ్లి చూడగా ఆపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లుగా ధృవీకరించారు. లాక్షణ్యకు తీవ్రమైన గుండెపోటు రావడం వల్లనే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

లాక్షణ్య చిన్నప్పటి నుంచి ఎంతో చురుకుగా ఉండేదని.. చదువులో కూడా బాగా రాణించేదని.. అలాంటి తమ కూతురు హఠాత్తుగా గుండెపోటుతో చనిపోవడం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాని కన్నీరుమున్నీరవవుతున్నారు తల్లిదండ్రులు. అందరితో కలివిడిగా ఉంటూ.. సంతోషంగా కనిపించే లాక్షణ్య అకస్మాత్తుగా గుండెపోటుకి గురికావడం.. కన్నుమూయడంతో స్నేహితులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి