iDreamPost

ఆడవాళ్ళతో పోలిస్తే మగవాళ్లకే గుండెపోటు ఎక్కువగా వస్తుంది! ఎందుకంటే?

  • Published May 10, 2024 | 10:58 AMUpdated May 10, 2024 | 10:58 AM

ఆడవాళ్ళతో పోలిస్తే మగాళ్లకే గుండెపోటు ఎక్కువగా వస్తుందని అందరికీ తెలిసిందే. అయితే ఆడవాళ్లకు గుండెపోటు రాకుండా ఆపుతున్నది ఏంటో తెలుసా?

ఆడవాళ్ళతో పోలిస్తే మగాళ్లకే గుండెపోటు ఎక్కువగా వస్తుందని అందరికీ తెలిసిందే. అయితే ఆడవాళ్లకు గుండెపోటు రాకుండా ఆపుతున్నది ఏంటో తెలుసా?

  • Published May 10, 2024 | 10:58 AMUpdated May 10, 2024 | 10:58 AM
ఆడవాళ్ళతో పోలిస్తే మగవాళ్లకే గుండెపోటు ఎక్కువగా వస్తుంది! ఎందుకంటే?

ఎక్కువగా గుండెపోట్లు మగవారికే వస్తాయని పలు పరిశోధనల్లో తేలింది. అయితే మగాళ్లకే ఎందుకు గుండెపోటు వస్తుంది? ఆడవారికి ఎందుకు తక్కువగా వస్తుంది అని అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆడవాళ్ళకి హార్ట్ ఉండదు కాబట్టి వారికి గుండెపోటు రాదు అని అంటారు. ఇంకొందరైతే ఆడవాళ్లు మగాళ్ల గుండెల్లో ఉంటారు కాబట్టి మగాళ్లకే గుండెపోటు వస్తుంది అని అంటారు. ఈ జోకులు ఎప్పుడూ ఉండేవే. అయితే శాస్త్రీయంగా ఇలా జరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. 

ఇండియన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. గుండెపోటు వచ్చిన 50 శాతం మగాళ్లలో 50 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వాళ్ళే ఉన్నారు. గుండెపోటు ఉన్న 25 శాతం మగాళ్లలో 40 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వాళ్ళే ఉన్నారట. విదేశీ వారితో పోలిస్తే.. మన దేశంలో ఉన్న మగాళ్లు రెండు రెట్లు ఎక్కువగా గుండె సంబంధిత జబ్బులతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. సాధారణంగా మగవారికి గుండెపోటు రావడానికి సిగరెట్ స్మోకింగ్, మద్యపానం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్,  అధిక కొవ్వు, ఒబెసిటీ అండ్ ఫిజికల్ ఇనాక్టివిటీ, మధుమేహం, ఒత్తిడి వంటివి కారణమవుతాయి. అయితే మగాళ్ళతో పోలిస్తే ఆడవారికి గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా తక్కువని  పరిశోధనలు చెబుతున్నాయి.

We have more heart attacks 02

స్త్రీలలో మోనోపాజ్ దశకు ముందు, ఈస్ట్రోజన్ స్థాయి అధికంగా ఉంటుంది. దీని వల్ల చెడు కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. ఈ కారణంగా ఆడవారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువ. అయితే మోనోపాజ్ దశ తర్వాత ఆడవారిలో ఈస్ట్రోజన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీని కారణంగా మహిళలకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. మోనోపాజ్ దశ అనేది 45 నుంచి 55 ఏళ్ల మధ్య ఉంటుంది. అంటే ఆడవారిలో 45 ఏళ్లు దాటిన తర్వాత గుండెపోటు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే 30 ఏళ్ల లోపు ఉన్న మగవారు కూడా గుండెపోటుతో చనిపోతున్నారు. మళ్ళీ దీనికి ఒత్తిడి, మధుమేహం వంటివి కారణాలుగా ఉన్నాయి. ఒక కుటుంబంలో ఎవరికైనా గుండె సంబంధిత జబ్బులు ఉంటే ఆ అమ్మాయికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

కాబట్టి డైట్, జీవన విధానాన్ని సరిగా మెయింటెయిన్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఫ్యామిలీ హిస్టరీ ప్రకారం ఇంట్లో ఎవరికైనా కార్డియోవాస్క్యులర్ డిసీస్ ఉంటే 50 ఏళ్ల పైబడిన మహిళలకు గుండెపోటు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే మగాళ్లతో పాటు మాకూ సమాన హక్కులు కావాలని కోరుకునే అమ్మాయిలు కూడా ఉన్నారు. మందు, చిందు, సిగరెట్, డ్రగ్స్ వంటివి తమ హక్కు అని చెప్పి అలవాటు చేసుకునే అమ్మాయిలకి సాధారణ స్త్రీలతో పోలిస్తే.. ఎక్కువ శాతం గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుందని స్టడీస్ చెబుతున్నాయి. ఓవరాల్ గా సైంటిఫిక్ గా ఆడవారితో పోలిస్తే మగాళ్లకే గుండెపోటు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి