iDreamPost

Heart Attack: శరీరంలో ఈ భాగాల్లో నొప్పిగా ఉంటుందా.. అయితే గుండెపోటు వచ్చే ఛాన్స్ ఉంది జాగ్రత్త..!

  • Published Apr 22, 2024 | 4:30 PMUpdated Apr 22, 2024 | 4:30 PM

గుండెపోటు.. ఈమధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తోన్న జబ్బు పేరు. ఆకస్మాత్తుగా గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. మరి హార్ట్‌ ఎటాక్‌ వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అంటే..

గుండెపోటు.. ఈమధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తోన్న జబ్బు పేరు. ఆకస్మాత్తుగా గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. మరి హార్ట్‌ ఎటాక్‌ వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అంటే..

  • Published Apr 22, 2024 | 4:30 PMUpdated Apr 22, 2024 | 4:30 PM
Heart Attack:  శరీరంలో ఈ భాగాల్లో నొప్పిగా ఉంటుందా.. అయితే గుండెపోటు వచ్చే ఛాన్స్ ఉంది జాగ్రత్త..!

గుండెపోటు.. ఈ మధ్య కాలంలో తరచుగా వినిపిస్తోన్న పేరు. ఒకప్పుడు హార్ట్‌ ఎటాక్‌ అంటే.. వయసు పైబడిన వారికి.. అధిక బరువు ఉన్న వారికి.. మద్యపానం, పొగతాగే అలవాటు ఉన్న వారికి వచ్చే జబ్బుగా పరిగణించేవారు. కానీ గత నాలుగైదేళ్లలో దేశవ్యాప్తంగా గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. పట్టుమని పదేళ్ల వయసు లేని చిన్నారులు సైతం హార్ట్‌ ఎటాక్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అప్పటి వరకు ఎంతో సంతోషంగా.. ఎంతో ఆరోగ్యంగా ఉన్న వారు ఉన్నట్లుండి హార్ట్‌ ఎటాక్‌ బారిన పడి చనిపోతున్నారు. వెంటనే స్పందించినా సరే.. ప్రాణాలు కాపాడుకోలేకపోతున్నాం. కొన్ని సందర్భాల్లో సీపీఆర్‌ చేయడంతో ప్రాణాపాయం నుంచి బయటపడుతున్నారు కొందరు. అయితే ఈ సమస్యను ముందగానే గుర్తించలేమా.. హార్ట్‌ ఎటాక్‌ రావడానికి ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఆ వివరాలు మీ కోసం

సాధారణంగా గుండె నొప్పి అనేది ఆక‍స్మాత్తుగా.. ఒకేసారి రాదంటున్నారు వైద్యులు. దాని కన్నా ముందు కొన్ని లక్షణాలు బయటపడతాయని.. వాటిని సకాలంలో గుర్తించి.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు. గుండెపోటు అనేది దీర్ఘమైన ప్రక్రియ. హార్ట్‌ ఎటాక్‌ రావడానికి ముందు.. శరీరంలో చాలా లక్షణాలు కన్పిస్తాయి. వీటిని సకాలంలో గుర్తించగలిగితే.. ప్రాణాలు కాపాడుకోవచ్చు అంటున్నారు వైద్యులు.

హార్ట్ ఎటాక్ సంబంధిత లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే చనిపోయే అవకాశాలే  ఎక్కువ అంటున్నారు. గుండెపోటు లక్షణాల్లో ముఖ్యమైంది.. శరీరం ఎగువభాగంలో వచ్చే నొప్పి. మరి ఈ నొప్పి ఏయే భాగాల్లో వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

వీపు నొప్పి..

హార్ట్ ఎటాక్ లక్షణాల్లో ప్రధానమైంది వీపు నొప్పి. గుండెపోటు బారిన పడే వారిలో దీర్ఘకాలంగా వీపు నొప్పి వస్తుండవచ్చు. చాలామంది కూర్చునే, పడుకునే పొజిషన్‌ సరిగా లేకపోవడం వల్ల వీపు నొప్పి వస్తుంది అనుకుంటారు. నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇది గుండె పోటుకు సంకేతం కావచ్చు అంటున్నారు వైద్యులు. నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి అని సూచిస్తున్నారు.

ఛాతీ నొప్పి..

హార్ట్ ఎటాక్ లక్షణాల్లో అతి సాధారణమైంది ఛాతీ నొప్పి. గుండె నొప్పి వచ్చే ముందే కాకుండా ఇతర సందర్భాల్లో కూడా ఛాతీ నొప్పి వస్తుంటుంది. అంటే ఎసిడిటీ, క్రాంప్స్ కారణంగా ఛాతీ నొప్పి రావచ్చు. అలాగని దీన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

జబ్బల్లో నొప్పి..

జబ్బల్లో నొప్పి అనేది హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కన్పించే మరో ప్రధాన లక్షణం అంటున్నారు వైద్యులు. గుండె నొప్పి వచ్చే ముందు జబ్బల్లో తీవ్రమైన భరించలేని నొప్పి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి వస్తే.. ఆలస్యం చేయకుండా.. వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.

భుజాల నొప్పి..

హార్ట్ ఎటాక్ వచ్చే ముందు శరీరం ఎగువ భాగంలో కన్పించే వివిధ రకాల నొప్పుల్లో ముఖ్యమైంది భుజాల నొప్పి. ఎలాంటి కారణం లేకుండా భుజాల్లో నొప్పి వస్తే.. ఇది కచ్చితంగా గుండెపోటుకు సంకేతం కావచ్చు అంటున్నారు డాక్టర్లు.

మెడనొప్పి..

ఇక హార్ట్ ఎటాక్ వచ్చే ముందు మెడనొప్పి కనిపిస్తుంది అంటున్నారు నిపుణులు. దీన్ని హార్ట్ ఎటాక్ ప్రారంభ లక్షణాల్లో ఒకటిగా చెప్పవచ్చు. మీక్కూడా ఎలాంటి కారణం లేకుండా మెడ నొప్పి వస్తుంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ని కలవండి అని సూచిస్తున్నారు. ఈ నొప్పుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని. ఆరోగ్యకరమైన అలవాట్లతో గుండెపోటు బారి నుంచి తప్పించుకోవచ్చిన చెబుతున్నారు.

గమనిక: ఇది నిపుణుల అభిప్రాయం మాత్రమే. దీనితో ఐడ్రీమ్‌ మీడియాకు ఎలాంటి సంబంధం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి