iDreamPost

వారి కుటుంబాల్లో దీపావళి వెలుగులు

వారి కుటుంబాల్లో దీపావళి వెలుగులు

వైసీపీ సర్కార్‌ ప్రజా సంక్షేమ పాలనకు పునాదులు వేసిన వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప పాదయాత్ర ఫలాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుతున్నాయి. అర్హతే ఆధారంగా చివరి లబ్ధిదారుడుకు కూడా పథకాలు అందించేలా నాటి పాదయాత్ర దోహడపడుతోది. ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూసి, వారి బాధలు విన్న వైఎస్‌ జగన్‌.. ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి కన్నీళ్లు తుడిచేందుకు, కష్టాలు తీర్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసమే అన్నట్లుగా.. ప్రతి నిర్ణయం ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్నారు.

వివిధ పధకాలకు అర్హత ఉండి సకాలంలో దరఖాస్తు చేసుకోలేకపోయినా వారికి ఆయా పథకాల ద్వారా లబ్ధిని అందించేందుకు ప్రజా సంకల్ప పాదయాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భం వేదికగా నిలిచింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వివిధ పథకాలను మిగిలిన అర్హులకు అందించే కార్యక్రమం ప్రారంభమైంది. రోజుకు ఒక పథకం చొప్పున బు«ధవారం నుంచి లబ్ధిదారులకు ఆయా పథకాల అందజేత మొదలైంది. బుధవారం వైఎస్సార్‌ నేతన్న హస్తం పథకం ద్వారా లబ్ధిదారులు ఖాతాల్లో 24 వేల రూపాయలు జమ చేశారు. కొత్తగా 8,903 మందికి ఈ పథకం ద్వారా 21.36 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరింది. మొత్తం మీద ఈ పథకం ద్వారా 82 వేల మంది 24 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం పొందారు.

గురువారం వైఎస్సార్‌ చేయూత పథకాన్ని మిగిలిపోయిన అర్హులకు వర్తింజేయనున్నారు. ఈ పథకం ద్వారా కొత్త 2.72 లక్షల మందికి 18,750 రూపాయల చొప్పున వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇప్పటికే ఈ పథకంతో 21 లక్షల మంది లబ్ధి పొందారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలలోని 45 నుంచి 60 ఏళ్ల లోపు మహిళలు ఈ పథకానికి అర్హులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి