iDreamPost

వీడియో: తమ్ముడికి రాఖీ కట్టేందుకు 8 కి.మీ నడిచిన 80 ఏళ్ల వృద్ధురాలు!

  • Author Soma Sekhar Updated - 11:49 AM, Thu - 31 August 23
  • Author Soma Sekhar Updated - 11:49 AM, Thu - 31 August 23
వీడియో: తమ్ముడికి రాఖీ కట్టేందుకు 8 కి.మీ నడిచిన 80 ఏళ్ల వృద్ధురాలు!

ఆమె 80 ఏళ్ల వృద్ధురాలు.. శరీరంలో సత్తువ చచ్చినా గానీ.. తన తమ్ముడిపై ప్రేమ మాత్రం చావలేదు. దేశమంతా రాఖీ పండుగ చేసుకుంటుంటే.. నా తమ్ముడికి ఎవరున్నారు.. నేను తప్ప అని పేగు గుంజినట్లుంది ఆ ముసలవ్వకు. అందుకోసం ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా.. కాలి నడకన బయలుదేరింది ఆ వృద్ధురాలు. తల్లిదండ్రుల తర్వాత తోబుట్టువులే ఎక్కువ అని రుజువు చేసింది.  ఇక అన్నా చెల్లెల్లలకు ముఖ్యమైన పండుగ రాఖీ. ఈ పండగ సందర్భంగా తన తమ్ముడికి రాఖీ కట్టడం కోసం ఓ 80 ఏళ్ల ముసలవ్వ ఏకంగా 8 కి.మీ నడిచి వెళ్లింది.

రాఖీ పండుగ అనగానే అన్న చెల్లిల అనుబంధం గుర్తుకు వస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న ఆధునిక జీవితంలో.. ఉరుకుల పరుగుల యాంత్రిక జీవితంలో ఈ బంధాలు కాస్త పలుచబారుతున్నాయి. ఇలాంటి రోజుల్లో తన తమ్ముడికి రాఖీ కట్టడం కోసం ఓ 80 ఏళ్ల ముసలవ్వ ఏకంగా 8 కిలోమీటర్లు నడిచింది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లాకు చెందిన బక్కవ్వ తన తమ్ముడికి రాఖీ కట్టాలని బయలుదేరింది. కానీ అక్కడికి రవాణ సౌకర్యం లేదు. బక్కవ్వ తమ్ముడు మల్లేశం కరీంనగర్ జిల్లాలో ఉంటున్నాడు.

అయితే అక్కడికి రవాణ సౌకర్యం లేకపోవడంతో.. 8 కిలోమీటర్ల మేర నడిచి వెళ్లింది ఆ ముసలవ్వ. దారిలో నడిచి వెళ్తున్న బక్కవ్వను ఎక్కడికి వెళ్తున్నావ్ అంటూ ఓ యువకుడు ప్రశ్నించగా.. తమ్ముడికి రాఖీ కట్టేందుకు వెళ్తున్నాను అని చెప్పింది. ఎర్రటి ఎండలో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా రాఖీ కట్టడానికి వెళ్లింది. తన తమ్ముడిపై ఉన్న ప్రేమను చాటుకుంది. మానవ సంబంధాలు అన్ని మనీ సంబంధాలు అయిన ఈ కాలంలో ఇలాంటి ప్రేమ ఉండటం నిజంగా అద్భుతమనే చెప్పాలి. మరి ఈ ముసలవ్వకు తమ్ముడిపై ఉన్న ప్రేమపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి