iDreamPost

MLA బరిలో సర్పంచ్‌ నవ్య.. అవకాశం ఇస్తే గెలిచి చూపిస్తాను

  • Published Aug 31, 2023 | 9:03 AMUpdated Aug 31, 2023 | 9:03 AM
  • Published Aug 31, 2023 | 9:03 AMUpdated Aug 31, 2023 | 9:03 AM
MLA బరిలో సర్పంచ్‌ నవ్య.. అవకాశం ఇస్తే గెలిచి చూపిస్తాను

ఎన్నికలు దగ్గరకు వస్తుండటంతో.. తెలంగాణలో పొలిటికల్‌ వాతావరణం హీటెక్కింది. విపక్షాలతో పోలిస్తే.. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ.. ఎన్నికల రేసులో చాలా ముందంజలో ఉన్నది. ఇప్పటికే తొలి విడత అభ్యర్థుల లిస్ట్‌ ప్రకటించింది. దాంతో పాటు.. ఎన్నికల హామీలను నెరవేర్చడం.. అన్ని వర్గాల ఓటర్లను ఆకర్షించేందుకు వారిపై వరాల జల్లు కురిపిస్తోంది. ఇక కేసీఆర్‌ విడుదల చేసిన తొలి విడత అభ్యర్థుల జాబితాలో.. దాదాపు 95 శాతం వరకు.. సిట్టింగులకే అవకాశం ఇచ్చారు. ఇక తొలి విడత అభ్యర్థుల లిస్ట్‌ విడుదల చేసిన నాటి నుంచి అసంతృప్తులు తమ అసమ్మతి గళాన్ని వినిపిస్తున్నారు.

టికెట్‌ ఆశించిన సిట్టింగుల్లో కొందరికి మొండి చేయి చూపారు కేసీఆర్‌. వారిలో స్టేషన్ ఘన్‌పూర్‌ సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా ఉన్నారు. ఈ సారి రాజయ్యకు కాకుండా.. కడియం శ్రీహరికి టికెట్ కేటాయించారు కేసీఆర్. అయితే రాజయ్యను పక్కకు పెట్టడానికి కారణం.. సర్పంచ్‌ నవ్య చేసిన ఆరోపణలే అని విషయం అందరికి తెలిసిందే. టికెట్‌ రాకపోవడంతో.. రాజయ్య తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కార్యకర్తల ముందు ఏకంగా కన్నీరు పెట్టుకున్నారు.

అయితే ఇప్పటికి కూడా రాజయ్య ఎమ్మెల్యే టికెట్‌ మీద ఆశ మాత్రం వదులుకోలేదు. త్వరలోనే తాను అనుకున్నది జరుగుతుందని.. కేసీఆర్ మళ్లీ తనకు అవకాశం ఇస్తారనే భావిస్తున్నారు. అంతేకాక బీ ఫాం ఇచ్చేవరకు వేచి చూస్తానన్న సంకేతాలు కార్యకర్తలకు ఇస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా సర్పంచ్‌ నవ్య చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. తనకు ఛాన్స్ ఇస్తే పోటి చేసి ఎమ్మెల్యేగా గెలిచి చూపిస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తోంది జానకీపురం సర్పంచ్ నవ్య.

‘‘బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ సార్, కేటీఆర్ అన్న అవకాశం ఇస్తే.. స్టేషన్ ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యే‌గా నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉన్నా.. మీ ఆశీర్వాదం, సహకారం ఉంటే గెలిచి చూపిస్తా..” అంటూ సర్పంచ్ నవ్య ఓ ఇంటర్వూలో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. సర్పంచ్‌ నవ్య చేసిన ఆరోపణల వల్లే తాటికొండ రాజయ్యకు టికెట్ రాలేదన్న ప్రచారం జోరుగా సాగుతోన్న సమయంలో.. ఇప్పుడు తాను కూడా పోటీలో ఉంటానంటూ నవ్య చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి