iDreamPost

రష్యాలో చిక్కుకున్నాం కాపాడండి ప్లీజ్ .. భారతీయుల కన్నీటి ఆవేదన!

  • Published Mar 07, 2024 | 7:25 PMUpdated Mar 07, 2024 | 7:25 PM

అనుకోకుండా రష్యాకు వెళ్లిన కొంతమంది భారతీయులు.. అక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో బానిసలుగా చిక్కుకుపోయారు. ఉక్రెయిన్ తో రష్యా సైన్యం బలవంతంగా పోరాడమంటున్నారని ..వారి బాధను చెప్పుకుంటూ 7 మంది భారతీయులు ఓ వీడియోను విడుదల చేశారు.

అనుకోకుండా రష్యాకు వెళ్లిన కొంతమంది భారతీయులు.. అక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో బానిసలుగా చిక్కుకుపోయారు. ఉక్రెయిన్ తో రష్యా సైన్యం బలవంతంగా పోరాడమంటున్నారని ..వారి బాధను చెప్పుకుంటూ 7 మంది భారతీయులు ఓ వీడియోను విడుదల చేశారు.

  • Published Mar 07, 2024 | 7:25 PMUpdated Mar 07, 2024 | 7:25 PM
రష్యాలో చిక్కుకున్నాం కాపాడండి ప్లీజ్ .. భారతీయుల కన్నీటి ఆవేదన!

ఇటీవల అనుకోని కారణాల వలన.. తెలిసి తెలియక ఇతర దేశాలకు వెళ్లి.. అక్కడ దేశ ద్రోహుల ఉచ్చులో చిక్కుకునే వారు ఎంతోమంది ఉన్నారు. ఈ క్రమంలోనే రెండు నెలల క్రితం .. సరదాగా పార్టీ చేసుకుందాం అని.. రష్యాకు వెళ్లిన ఏడుగురు యువకులు.. ఉక్రెయిన్ రష్యా వార్ లో చిక్కుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రష్యా కు వెళ్లి మోసపోయిన ఏడుగురు భారతీయులు.. వారిని కాపాడాలంటూ కేంద్రాన్ని సాయం కోరారు. పంజాబ్ లోని హోషియాపూర్ కు చెందిన ఏడుగురు యువకులు .. రష్యాకు వెళ్లి చిక్కుకు పోయారు. అక్కడ గగన్ దీప్ అనే వ్యక్తి సహాయంతో.. సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు . అది 105 సెకన్ల వీడియో. ఆ వీడియోలో వారు మిలిటరీ డ్రెస్ ను ధరించి ఉన్నారు. అక్కడ వారు పడుతున్న అనేక ఇబ్బందుల గురించి ఈ వీడియోలో చర్చించారు. గగన్ దీప్ అనే వ్యక్తి ఈ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. అసలు ఎం జరిగిందంటే.

న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం పంజాబ్ కు చెందిన ఏడుగురు వ్యక్తులు.. గత ఏడాది డిసెంబర్ 27వ తేదీన రష్యాకు బయల్దేరి వెళ్లారు. అక్కడ ఉన్న ఓ ఏజెంట్ వారిని బెలారస్ కు తీసుకుని వెళ్లారు. అయితే, బెలారస్ కు వెళ్లేందుకు వేరే వీసా అవసరమని ఆ ఏడుగురు యువకులకు తెలియదు. బెలారస్ కు వెళ్లిన తర్వాత ఆ ఏజెంట్ వారి వద్ద నుంచి మరిన్ని డబ్బులు తీసుకుని.. వారిని అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ ఏజెంట్ ను నమ్మి వారు మోసపోయారు. ఇది గమనించిన అక్కడి స్థానికులు ఈ విషయాన్నీ అక్కడి పోలీసులకు తెలియజేయగా.. రష్యన్ పోలీసులు ఆ యువకులను అదుపులోకి తీసుకుని .. ఏవో పత్రాల మీద సంతకాలు చేయించుకున్నారు. ఆ తరువాత వారిని ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో పోరాడాలని వారిని బలవంతం చేశారు. వారు సంతకాలు చేసిన పత్రాలు కూడా దానికి సంబంధించినవే. వారికీ రష్యన్ భాష అర్థంకాకపోవడంతో .. వారు ఏమి చేయలేకపోయారు.

ఆ పత్రాలపై ఎం రాసి ఉందంటే.. పదేళ్ల జైలు శిక్షను ఒప్పుకోవడం లేదా ఉక్రెయిన్ తో పోరాటానికి సిద్ధం అవ్వడం .. ఈ రెండిటిలో ఎదో ఒకటి చేయాలనీ ఆ పత్రాలపై రాసి ఉంది. ఇక వారికీ ఏ దారి లేక .. ఉక్రెయిన్ తో పోరాటానికి సిద్ధపడ్డారు. దానికోసం వారికీ 10రోజులు శిక్షణ కూడా ఇచ్చారు. అలా వారిని బలవంతంగా ఉక్రెయిన్ తో పోరాటినికి పంపించారు. ఇలా వీరు మాత్రమే కాకుండా .. ఎంతో మంది భారతీయులు ఈ ఉచ్చులో చిక్కుకుని ఉన్నారని వారు తెలియజేయజేశారు. రష్యాలో ఆర్మీ హెల్పర్స్ గా ఉన్న భారతీయులను .. విడుదల చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని.. అధికారులు వెల్లడించారు. రష్యా నుండి భారతీయులు రష్యా ఉక్రెయిన్ యుద్దానికి దూరంగా ఉండాలని.. అధికారులు సూచించారు. దీనికోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం అని అధికారులు తెలియజేశారు. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి