iDreamPost

మరణించిన కొడుకు వీర్యంతో బిడ్డను కన్న నటి! ఏ తల్లి చేయని పని!

  • Published Apr 13, 2024 | 4:47 PMUpdated Apr 13, 2024 | 4:47 PM

బిడ్డలను కనడం ఒకప్పుడు చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందింది. కొత్త కొత్త పద్ధతుల ద్వారా బిడ్డలకు జన్మనిస్తున్నారు తల్లులు. ఈ క్రమంలో కన్న కొడుకు వీర్యంతో ఒక తల్లి మరొక బిడ్డకు జన్మనించింది. వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తున్న ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

బిడ్డలను కనడం ఒకప్పుడు చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందింది. కొత్త కొత్త పద్ధతుల ద్వారా బిడ్డలకు జన్మనిస్తున్నారు తల్లులు. ఈ క్రమంలో కన్న కొడుకు వీర్యంతో ఒక తల్లి మరొక బిడ్డకు జన్మనించింది. వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తున్న ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

  • Published Apr 13, 2024 | 4:47 PMUpdated Apr 13, 2024 | 4:47 PM
మరణించిన కొడుకు వీర్యంతో  బిడ్డను కన్న నటి! ఏ తల్లి చేయని పని!

మాతృత్వం ఒక వరం అంటూ ఉంటారు. సాధారణంగా 35 ఏళ్ల లోపు బిడ్డలకు జన్మనిచ్చేలా చూస్తూ ఉంటారు తల్లిదండ్రులు. కానీ, ఇక్కడ ఒక మహిళ 69 ఏళ్ళ వయస్సులో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అది కూడా తన కన్న కొడుకు వీర్యంతో. కొడుకు వీర్యంతో మరొక బిడ్డకు జన్మనివ్వడం ఏంటా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ, దీని వెనుక ఉన్న కారణాలు తెలిస్తే మాత్రం ఎవరికీ కన్నీళ్లు ఆగవు. ఒకప్పుడు బిడ్డలకు జన్మనివ్వడం అంటే తల్లులకు చాలా కష్టతరంగా మారేది. మరణం అంచుల వరకు వెళ్లి వచ్చిన మాతృ మూర్తులు కూడా ఎంతో మంది ఉన్నారు. కానీ, ఇప్పుడు కాలం మారింది. కాలంతో పాటు కొత్త కొత్త టెక్నాలజీలు కూడా పుట్టుకొచ్చాయి. ఇప్పుడు ఎంతో మంది తల్లులు సరోగసి విధానంలో బిడ్డలకు జన్మను ఇస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక సీనియర్ నటి కూడా.. ఇలానే తన కన్న కొడుకు వీర్యంతో మరొక బిడ్డకు జన్మనిచ్చింది. ఇంతకీ ఆ నటి ఎవరు.. దీని వెనుక గల కారణాలేంటి అనే విషయాల గురించి తెలుసుకుందాం.

ఇప్పటివరకు చెప్పుకున్న నటి మరెవరో కాదు. స్పెయిన్ దేశానికి చెందిన ఒకప్పటి నటి అనా ఒబ్రెగాన్. ఇప్పుడు ఆమె వయస్సు 69 సంవత్సరాలు. ఈమెకు గతంలో అలెస్‌ లెక్వియో అనే ఒక కొడుకు ఉన్నాడు. అయితే అతను 27 ఏళ్ళ వయస్సులో క్యాన్సర్ కారణంగా మరణించాడు. అతను మరణాన్ని ముందే ఉహించాడో లేక ఏం జరిగిందో తెలియదు కానీ. మరణానికి ముందే తన వీర్యాన్ని జాగ్రత్తగా ఒక హెల్త్ సెంటర్ లో భద్రపరిచాడు. క్యాన్సర్ కారణంగా కొన్నాళ్ళకు అతను ప్రాణాలు కోల్పోయాడు. అయితే మరణానికి ముందు తానూ ఎలాగైనా తండ్రి అవ్వాలని కలలు కంటూ ఉండేవాడు అలెస్ లెక్వియో. అతడు చనిపోయిన చాలా కాలానికి కానీ.. తన తల్లికి తన కొడుకు చివరి కోరిక తెలియలేదు. దీనితో అలెస్ లెక్వియో వీర్యం భద్రపరిచిన విషయం గురించి.. ఇంట్లో దొరికిన కొన్ని డాక్యుమెంట్స్ ఆధారంగా ఆమె తెలుసుకుంది. ఇక అప్పుడు తండ్రి కావాలన్న తన బిడ్డ కోరికను తానె స్వయంగా నెరవేర్చాలని నిర్ణయించుకుంది ఆ కన్న తల్లి.

ఈ క్రమంలోనే ఆమె ఎంతో మంది డాక్టర్స్ ను సంప్రదించి.. తన కొడుకు వీర్యం ద్వారా ఒక బిడ్డకు జన్మనివ్వాలని అనుకుంది. గత ఏడాది డాక్టర్స్ వద్దకు వెళ్లి ఇందుకు తగిన ఫార్మాలిటీస్ అన్నిటిని పూర్తి చేసింది. ఆమె ప్రాణాలకు ప్రమాదం ఉన్నా సరే.. కొడుకు వీర్య కణాలతో గర్భం దాల్చి ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు అనిత అనే పేరు పెట్టి.. ఆ పాపా మొదటి పుట్టిన రోజు సందర్బంగా ఈ విషయాలను చెప్పుకొచ్చింది అనా ఒబ్రెగాన్. ఆమె పోస్ట్ ఆ పాపా గురించి ఇలా రాసుకొచ్చింది.. “అనితా నీకు అప్పుడే ఏడాది నిండిపోయింది. అగాధమైన చీకటిలో మునిగిపోయి, విపరీతమైన బాధతో ఉన్న నా హృదయాన్ని నీ వెలుగుతో నింపేశావ్.. నీ చిరునవ్వు, ముద్దు ముద్దుమాటలు, నీ బుడిబుడి అడుగులు నాకు చాలు.. మీ నాన్న నన్ను ఎంత ప్రేమతో చూసాడో అదే ప్రేమతో నన్ను చూస్తున్నందుకు ధన్యవాదాలు. ఇప్పటివరకూ ఎవరూ నన్ను అలా చూడలేదు” అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Ana_Obregon Oficial (@ana_obregon_oficial)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి