iDreamPost

1999 Sankranthi Releases : అయిదుగురు హీరోల మధ్య జనవరి పోటీ – Nostalgia

సంక్రాంతి ఉండటంతో పాటు న్యూ ఇయర్ డేతో మొదలుపెట్టి క్రేజీ చిత్రాలన్నీ దీన్నే టార్గెట్ చేసుకుని మరీ వస్తాయి. ప్రతి సంవత్సరం ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు ఉంటాయి. ఓసారి ఫ్లాష్ బ్యాక్ లో 1999 వెళదాం. ఒకటో తేదీన శుభారంభం చేయాలన్నట్టుగా వచ్చిన చిరంజీవి తమిళ రీమేక్ 'స్నేహం కోసం' విజయవంతమయ్యింది కానీ మరీ ఆశించిన స్థాయిలో కాదన్నది వాస్తవం.

ఏడాది పొడవునా సినిమాలు రిలీజవుతాయి కానీ జనవరి నెల ప్రత్యేకత మాత్రం దేనికీ రాదన్నది వాస్తవం. సంక్రాంతి ఉండటంతో పాటు న్యూ ఇయర్ డేతో మొదలుపెట్టి క్రేజీ చిత్రాలన్నీ దీన్నే టార్గెట్ చేసుకుని మరీ వస్తాయి. ప్రతి సంవత్సరం ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు ఉంటాయి. ఓసారి ఫ్లాష్ బ్యాక్ లో 1999 వెళదాం. ఒకటో తేదీన శుభారంభం చేయాలన్నట్టుగా వచ్చిన చిరంజీవి తమిళ రీమేక్ ‘స్నేహం కోసం’ విజయవంతమయ్యింది కానీ మరీ ఆశించిన స్థాయిలో కాదన్నది వాస్తవం. తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చిరు బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చినప్పటికీ ఓవర్ సెంటిమెంట్ తో పాటు పోటీ వచ్చిన ఇతర కారణాలు కూడా గట్టి ప్రభావం చూపించాయి.

రాజశేఖర్ హీరోగా ఈవివి దర్శకత్వంలో వచ్చిన సీరియస్ సోషల్ డ్రామా ‘నేటి గాంధీ’ 8న వచ్చి నిరాశపరిచింది. అదే రోజు ‘తెలంగాణ’ టైటిల్ తో ప్రత్యేక రాష్ట్ర పోరు, నక్సలైట్ పోరుని ఉద్దేశించి తీసిన సినిమాకు ప్రశంసలు దక్కాయి కానీ కాసులు రాలేదు. సంక్రాంతి హడావిడి 13న సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ‘పెద్ద మనుషులు’తో మొదలైంది. సుమన్ హీరోగా రూపొందిన ఈ విలేజ్ స్టోరీ బాక్సాఫీస్ దగ్గర తోక ముడిచింది. అదే రోజు వచ్చిన బాలకృష్ణ ‘సమరసింహారెడ్డి’ ఊహించని విధంగా తెలుగు సినిమా పాత రికార్డులన్నీ బద్దలు కొడుతూ ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో బయ్యర్లకు కురిసిన కనక వర్షంలో థియేటర్లు ఉక్కిరిబిక్కరి అయ్యాయి.

మరుసటి రోజు అంటే 14న కృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ‘మానవుడు దానవుడు’ నిరాశపరిచింది. అంతం కాదిది ఆరంభం స్టైల్ లో సూపర్ స్టార్ చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. 22న అర్జున్ ‘హలో ఫ్రెండ్’, 29న జంధ్యాల దర్శకత్వం వహించిన ఆఖరి చిత్రం ‘విచిత్రం’ రిలీజయ్యాయి కానీ ఫలితం మాత్రం రెండూ ఫ్లాపే. డబ్బింగ్ సినిమాలు టైగర్ ఝాన్సీ, పోలీస్ వారెంట్, సాహస కన్యలుని ఎవరూ పట్టించుకోలేదు. యునానిమస్ విన్నర్ గా సమరసింహారెడ్డి నిలవగా రెండో స్థానంలో స్నేహం కోసం నిలిచింది. చిరంజీవి, బాలకృష్ణ, కృష్ణ, రాజశేఖర్, సుమన్, అర్జున్ మధ్య పోటీ అలా ఇద్దరిని మాత్రమే గట్టెక్కించడం గమనార్హం.

Also Read : Lakshmi : లేడీ టైటిల్ తో సూపర్ హిట్ సినిమా – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి