iDreamPost

సమయం ఐదేళ్ళే

సమయం ఐదేళ్ళే

ఒక ప్రభుత్వ పదవీ కాలం ఐదేళ్ళు. ఈ ఐదేళ్ళలో ఏం చేయగలరో అది చెప్పాలి. ఏం చెప్పారో అది చేయాలి.

ఫైనాన్స్ కమిషన్ – అన్ని ప్రణాళికలు (ఎన్నేళ్ళ ముందు చూపుతో చేసినా) ఐదేళ్ళకోసారి  ప్లానింగ్ కమిషన్ (నీతి ఆయోగ్) – అన్ని నిర్ణయాలు (రాబోయే ఎన్నేళ్ళకు చేసినా) ఐదేళ్ళకోసారి అమరావతి ప్లాన్ ప్రణాళికలు ఎన్నేళ్ళకైనా రూపొందించుకోవచ్చు. ఎన్నేళ్ళ ముందుచూపు (విజన్) అయినా ఉండొచ్చు, ఉండాలి కూడా. కానీ ఆ విజన్ లో కార్యాచరణ తమకు ప్రజలు ఇచ్చిన ఐదేళ్ళ గడువులో పూర్తవ్వాలి. లేదా మొదలవ్వాలి. అమరావతిలో ఇది మిస్సయ్యింది. “తాత్కాలిక” పదం దాటి “శాశ్వత” పదం వినిపించి, కనిపించి ఉండాల్సింది. గత ప్రభుత్వం ఆ దిశగా నడిచి ఉండాల్సింది.

“శాశ్వత” కోసం “విజన్” కాగితాలకే (మరో ఐదేళ్ళ అధికారంపై ఆశతో) పరిమితం అయింది. “శాశ్వతం” పదం అమరావతిలో మిస్సయ్యింది. ఎన్ని చేసినా, ఎన్ని కట్టినా కనిపించేదంతా “తాత్కాలికం” అనే ముద్ర పడిపోయింది.

“శాశ్వతం” అనే ఫీలింగ్ వేరు, “తాత్కాలికం” అనే ఫీలింగ్ వేరు. శాశ్వతం అనే ఫీలింగ్ లేకపోవడం వల్లనేమో రాజధాని కోల్పోతున్నాం అనే ఫీలింగ్ కూడా కనిపించడం లేదు. అలాంటి ఫీలింగ్ ఉంటే విజయవాడ ఈపాటికి అగ్నిగుండం అయ్యుండేది. పోరాటాల పురిటిగడ్డ, రాజకీయ రాజధాని, మా బెజవాడ మౌనంగా ఉంది.

“తాత్కాలికం” కోసం రోడ్డెక్కడం ఎందుకులే అనుకుంటున్నారో, ఏమో! బెజవాడ ఐడెంటిటీగా ఉన్న “బెంజి సర్కిల్” పోగొట్టుకున్నాక “తాత్కాలికం” పొతే ఏంటిలే అనుకుంటున్నారేమో! లేదంటే, అకస్మాత్తుగా పెంచిన అద్దెలు పోతున్నాయనే బాధలో ఉన్నారేమో… !  

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి