iDreamPost

విక్రమ్ విజయానికి 5 కారణాలు

విక్రమ్ విజయానికి 5 కారణాలు

కమల్ హాసన్ డబ్బింగ్ సినిమా తెలుగులో బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లోకి ప్రవేశించి ఎన్ని సంవత్సరాలు అయ్యిందంటే గుర్తు చేసుకోవడం కష్టం. అభిమానులు సైతం అసలు అలాంటి సందర్భం వస్తుందానే అనుమానంతోనే ఎదురు చూశారు. ఫైనల్ గా విక్రమ్ వాటికి బ్రేక్ వేసింది. థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న 6 కోట్ల షేర్ టార్గెట్ ని ఈజీగా దాటేసి ఇప్పుడు 10 కోట్ల వైపు పరుగులు పెడుతోంది. వీక్ డేస్ లో సాధారణంగానే డ్రాప్ ఉంటుంది. అలాంటిది విక్రమ్ కు సోమవారం ఆక్యుపెన్సీ ఎనభై శాతం దాకా వచ్చిందంటే ఇది అరుదైన ఘనతే. ఒకవైపు మేజర్ పోటీ ఇస్తున్నప్పటికీ ఈ ఫీట్ సాధించడం పట్ల ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబవుతున్నారు

విక్రమ్ విజయానికి ప్రధానంగా అయిదు కారణాలు చెప్పుకోవచ్చు. ఎలాంటి అనవసర ప్రయోగాల జోలికి పోకుండా స్వాగ్ కమల్ ని పూర్తి యాక్షన్ కమర్షియల్ ఫార్మాట్ లో చూపించడం మొదటిది. ఈ విషయంలో లోకేష్ కనగరాజ్ తీసుకున్న శ్రద్ధ నిజంగా ప్రశంసనీయం. కెజిఎఫ్ తరహా ఎలివేషన్ హీరోయిజంని లోకనాయకుడి ఇమేజ్ కి తగ్గట్టు టైలరింగ్ చేసి స్క్రీన్ బ్లాస్ట్ అయ్యేలా ఎపిసోడ్స్ ని తీర్చిదిద్దిన తీరు రెండోది. విజయ్ సేతుపతి ఫహద్ ఫాసిల్ లాంటి న్యూ జనరేషన్ టాలెంట్స్ ఉన్నప్పటికీ వాళ్ల నుంచి డామినేషన్ ఎదురు కాకుండా క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం మూడోది. ఇక నాలుగోది టెర్రిఫిక్ అనే మాట చిన్నదనిపించే అనిరుద్ రవిచందర్ సంగీతం.

అయిదో కారణం క్లైమాక్స్ ఎపిసోడ్ లో సూర్యని వాడుకుని దానికి ఖైదీలో ఢిల్లీ పాత్రకు ముడిపెట్టిన తీరు యూత్ ఆడియన్స్ ని ఫిదా చేసేసింది. ఇది కదా తమకు కావాల్సిన ఎంటర్ టైనరంటూ రిపీట్స్ వేస్తూ థియేటర్లకు వెళ్తున్నారు. ఇక్కడే ఇలా ఉంటే ఇక తమిళనాడులో పరిస్థితి వేరే చెప్పనక్కర్లేదు. కొన్ని చోట్ల తెల్లవారుఝాము షోలు వేస్తున్నారు. సాయంత్రం ఆటలకు డిమాండ్ మాములుగా లేదు. వెంటనే విక్రమ్ 2 చేయమని ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఇవాళ కమల్ తెలుగు తమిళ ప్రేక్షకులకు విడివిడిగా థాంక్స్ చెబుతూ ఒక స్పెషల్ వీడియో విడుదల చేశారు. ఆయన కళ్ళలో మాటల్లో ఆనందం చూడగానే తెలిసిపోతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి