iDreamPost

Inimel: వీడియో: శృతిహాసన్​తో లోకేశ్ కొత్త ప్రోమో! రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

  • Published Mar 22, 2024 | 1:29 PMUpdated Mar 22, 2024 | 2:20 PM

నిన్నటి వరకు ఆయనో స్టార్ డైరెక్టర్. ఇప్పుడు కూడా బిగ్ హీరోస్​తో మూవీస్​ను లైన్​లో పెట్టారు. అయితే ఇన్నాళ్లూ తన దర్శకత్వ ప్రతిభతోనే మెప్పించిన ఆయన.. ఇప్పుడు ప్రముఖ హీరోయిన్​తో ఓ వీడియో సాంగ్​లో రెచ్చిపోయారు. ఆయన మరెవరో కాదు.. లోకేష్​ కనగరాజ్.

నిన్నటి వరకు ఆయనో స్టార్ డైరెక్టర్. ఇప్పుడు కూడా బిగ్ హీరోస్​తో మూవీస్​ను లైన్​లో పెట్టారు. అయితే ఇన్నాళ్లూ తన దర్శకత్వ ప్రతిభతోనే మెప్పించిన ఆయన.. ఇప్పుడు ప్రముఖ హీరోయిన్​తో ఓ వీడియో సాంగ్​లో రెచ్చిపోయారు. ఆయన మరెవరో కాదు.. లోకేష్​ కనగరాజ్.

  • Published Mar 22, 2024 | 1:29 PMUpdated Mar 22, 2024 | 2:20 PM
Inimel: వీడియో: శృతిహాసన్​తో లోకేశ్ కొత్త ప్రోమో! రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

లోకేష్ కనగరాజ్.. ఈ పేరు తెలియని యంగ్ జనరేషన్ మూవీ లవర్స్ ఉండరనే చెప్పాలి. యాక్షన్ విజువల్స్, స్టైలిష్ మేకింగ్​తో ఆడియెన్స్​ మనసుల్లో చెరగని స్థానాన్ని దక్కించుకున్నారు. విజయ్, కమల్ హాసన్, కార్తీ, సూర్య లాంటి బడా స్టార్స్​తో సినిమాలు తీస్తూ అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ పాపులారిటీ దక్కించుకున్నారు. లోకేష్ డైరెక్షన్​లో వచ్చిన ‘మాస్టర్’, ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’ తమిళంతో పాటు తెలుగు నాట కూడా భారీ వసూళ్లు సాధించాయి. అయితే ఇన్నాళ్లూ ఆయనలో డైరెక్షన్ స్కిల్స్ మాత్రమే ఉన్నాయని అంతా అనుకున్నారు. స్క్రిప్ట్ రాసుకోవడం, సినిమాలు తీసేయడం మాత్రమే లోకేష్​కు తెలుసునని భావిస్తే పప్పులో కాలేసినట్లే. ఆయనలో టెక్నీషియన్​తో పాటు మంచి యాక్టర్​ కూడా ఉన్నారు. నిన్నటి వరకు డైరెక్టర్​గా మెప్పించిన లోకేష్.. ఇప్పుడు హీరోయిన్ శృతిహాసన్​తో ఘాటు రొమాన్స్ చేస్తూ షాక్ ఇచ్చారు.

హీరోగా లాంఛ్ అవ్వాలనే ఆలోచనల్లో ఉన్న లోకేష్ కనగరాజ్ శృతిహాసన్​తో కలసి చేసిన ఓ రొమాంటిక్ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 18 సెకన్లు మాత్రమే ఉన్న ‘ఇనిమెల్’ అనే ఈ సాంగ్ ప్రోమో ఆడియెన్స్​ను ఊపేస్తోంది. ఇందులో శృతి-లోకేష్ కెమెస్ట్రీ సూపర్బ్​గా ఉంది. సినిమాలు తీస్తూ మేకర్​గా అలరిస్తూ వచ్చిన లోకేష్.. ఇప్పుడు శృతితో హద్దులు దాటి రెచ్చిపోయారు. ‘ఇనిమెల్’ పాటలో ఎలాంటి భయం లేకుండా ఆమెతో ఘాటు రొమాన్స్​ చేస్తూ అల్లాడించారు. వాళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ, ఇంటిమనీ సీన్స్ చాలా హాట్​గా ఉన్నాయి. శృతిని లోకేష్ దగ్గరకు లాక్కోవడం, ఒకర్నొకరు హగ్ చేసుకోవడం, వాళ్లు చాలా క్లోజ్​గా ఉండటం మామూలుగా లేదు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ షాకవుతున్నారు. లోకీ మామ మామూలోడు కాదుగా.. ఏమాత్రం బెరుకు లేకుండా శృతితో రొమాన్స్ చేశేశాడని కామెంట్స్ చేస్తున్నారు. ఆయన కొత్త లుక్ కూడా అదిరిపోయిందని అంటున్నారు.

ఇక, ఇనిమెల్ సాంగ్​కు స్వయంగా కమల్ హాసన్ లిరిక్స్ రాశారు. ఆయన నిర్మాణంలోనే మొత్తం రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద ఈ సాంగ్ తెరకెక్కింది. దీనికి ‘కేజీఎఫ్’ ఫేమ్ భువన గౌడ సినిమాటోగ్రఫీ అందించారు. ఎడిటింగ్ బాధ్యతల్ని ఫిలోమిన్ రాజ్ చూసుకున్నారు. ఈ సాంగ్ కాన్సెప్ట్, కంపోజింగ్ క్రెడిట్స్ శృతిహాసన్​కే ఇవ్వాలి. ద్వారకేష్ ప్రభాకర్ డైరెక్ట్ చేసిన ఇనిమెల్ సాంగ్ పూర్తి వెర్షన్ యూట్యూబ్​లో ఈ నెల 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మరి.. ఇనిమెల్ సాంగ్​లో లోకేష్ పెర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి