iDreamPost

జగన్‌ నిర్ణయం సరైంది : ఆర్‌. నారాయణ మూర్తి

జగన్‌ నిర్ణయం సరైంది : ఆర్‌. నారాయణ మూర్తి

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ పెద్దల ఆలోచనకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ప్రతిపాదిత మూడు రాజధానులు ఏర్పాటు నిర్ణయం సరేదేనని సినీనటుడు ఆర్‌.నారాయణ మూర్తి పేర్కొన్నారు. అన్ని ప్రాంతాలకు అభివృద్దిని విస్తరిచాలన్న లక్ష్యంతో సీఎం జగన్‌ సంకల్పించిన మూడు రాజధానుల నిర్ణయం వల్ల ఆయా ప్రాంతాలలో వలసలు తుగ్గుతాయని నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు.

విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేస్తే ఉత్తరాంధ్ర నుంచి వలసలు తగ్గుతాయని నారాయణ మూర్తి పేర్కొన్నారు. ఆర్థిక అసమానతలతో ప్రాంతాల మధ్య విద్వేషాలు తలెత్తకుండా ఉండాలన్న, అభివృద్ధి ఫలాలు అన్ని జిల్లాలకు, అన్ని ప్రాంతాలకు అందాలన్న. మూడు రాజధానుల ఏర్పాటే సరైనదని నారాయణ మూర్తి పేర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి