iDreamPost

ఒక్క రోజులో 25 వేల కేసులు.. వణికిపోతున్న అగ్రరాజ్యం

ఒక్క రోజులో 25 వేల కేసులు.. వణికిపోతున్న అగ్రరాజ్యం

బహుశా ప్రపంచం మొత్తం మీద కరోనా వైరస్ ధాటికి బాగా ఎఫెక్టయిన దేశం అగ్రరాజ్యం అమెరికానే కావచ్చు. అమెరికా మొత్తం గడచిన 24 గంటల్లో 25 వేల కరోనా వైరస్ కేసులు రిజస్టర్ అయ్యాయి. ప్రపంచం మొత్తం మీద 24 గంటల్లో ఇన్ని వేల కేసులు ఇంకే దేశంలోను నమోదవ్వలేదు. మెడికల్ ఎమర్జెన్సీ క్రింద దాదాపు 40 రోజుల లాక్ డౌన్ ను వైట్ హౌస్ సడలింపులు ఇవ్వటంతోనే కేసుల తీవ్రత మళ్ళీ పెరిగిపోతున్నట్లు అక్కడి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో సుమారు 22 లక్షలకు చేరుకుంది. అదే సమయంలో 1.18 లక్షల మంది చనిపోయారు.

ఇక ప్రపంచం మొత్తం మీద 80 లక్షల మందికి కరోనా వైరస్ సోకగా సుమారు 4.35 లక్షల మంది మరణించటం గమనార్హం. అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కేసులు పెరిగిపోతున్నాయి. ఆరిజోనాలో లాక్ డౌన్ సమయంలో రోజుకు సగటున 400 కేసులు నమోదైతే లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత వెయ్యి కేసులు నమోదవుతున్నాయి. న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా లాంటి అనేక రాష్ట్రాల్లో కేసుల ఉధృతి పెరిగోతుండటంతో అమెరికా మళ్ళీ వణికిపోతోంది.

ఇప్పటికీ అమెరికాలోని కొలంబియా యూనివర్సిటి హాస్పిటల్లో చాలామంది కరోనా వైరస్ పేషంట్లను చేర్చుకోవటం లేదు. సమస్యతో వచ్చిన వాళ్ళకు మందులిచ్చి పంపేస్తున్నారట. ఎందుకంటే కొలంబియా యూనివర్సిటి ఆసుపత్రిలో పనిచేస్తున్న సుమారు 4500 మంది సిబ్బందిలో సగానికి పైగా కరోనా వైరస్ సోకిందని సమాచారం. తమ సిబ్బందిలోని వాళ్ళకే అందరికీ సరైన చికిత్సను అందించలేని సమయంలో బయట నుండి వచ్చే పేషంట్లకు చికిత్స అందిచలేని కారణంగానే ఎవరినీ చేర్చుకోవటం లేదట.

న్యూయార్క్, కాలిఫోర్నియా లాంటి రాష్ట్రాల్లో వైరస్ కారణంగా చనిపోయిన పేషంట్లను సామూహిక ఖననాలకే ప్రభుత్వాలు మొగ్గు చూపుతున్నాయి. న్యూయార్క్ కు దగ్గరలోనే ఉన్న హెవెన్ ఐల్యాండ్ కు ఒకేసారి వందలాది మృతదేహాలను తీసుకెళ్ళి ఖననం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆసుపత్రుల్లో మృతదేహాలను జాగ్రత్త చేయటానికి అవకాశాలు లేక మృత దేహాలను తీసుకెళ్ళటానికి కుటుంబసభ్యులు, బంధులు వెనకాడుతున్న నేపధ్యంలో వాటిని ఖననం చేసే బాధ్యత కూడా ప్రభుత్వం మీదే పడటం ప్రభుత్వానికి పెద్ద సమస్యగా తయారైపోయింది. మొత్తం మీద కంటికి కనబడని వైరస్ రూపంలో దాడి చేస్తున్న శతృవుతో పోరాటం చేయలేక అగ్రరాజ్యం చేతులెత్తేసిందనే అనుకోవాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి