iDreamPost

OTT Movies: రేపు ఒక్కరోజే ఓటీటీలోకి 21 సినిమాలు

ఓటీటీకి కొత్త కొత్త సినిమాలు, థియేటర్లలో హిట్‌ అయిన సినిమాలు చాలా తొందరగా వచ్చేస్తున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు కూడా వస్తున్నాయి.

ఓటీటీకి కొత్త కొత్త సినిమాలు, థియేటర్లలో హిట్‌ అయిన సినిమాలు చాలా తొందరగా వచ్చేస్తున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు కూడా వస్తున్నాయి.

OTT Movies: రేపు ఒక్కరోజే ఓటీటీలోకి 21 సినిమాలు

ప్రస్తుత సమాజంలో ఓటీటీ అనేది నిత్యావసరం అయిపోయింది. సెల్‌ఫోన్‌, ఇంటర్‌ నెట్‌ అందుబాటులో ఉన్న చాలా మంది ఓటీటీలో సినిమాలు చూడ్డానికి బాగా అలవాటు పడిపోయారు. నిత్యం ఓ మూవీ అయినా ఓటీటీలో చూసే వారు లేకపోలేదు. కరోనా వైరస్‌ విజృంభించిన తర్వాత పరిస్థితులు చాలా మారిపోయాయి. జనం ఇంటికే పరిమితం అయి ఓటీటీలో సినిమాలు చూడ్డానికి అలవాటు పడ్డారు. కరోనా పరిస్థితులు మారిన తర్వాత కూడా అదే పరిస్థితి ఉంది.

జనం సినిమా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడ్డం బాగా తగ్గించేశారు. థియేటర్లలో విడుదల అయ్యే సినిమాలు కూడా తక్కువ కాలంలో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. దీంతో ఓటీటీకే ఎక్కువ మంది పచ్చజెండా ఊపేస్తున్నారు. ఖర్చు గురించి కూడా బాగా ఆలోచిస్తున్నారు. థియేటర్‌కు వెళ్లి ఓ కుటుంబం  మొత్తం సినిమా చూడాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. అలా కాకుండా ఓటీటీ సబ్‌స్క్రిప్చన్‌ తీసుకుంటే సంవత్సరం మొత్తం చిత్రాలు చూడొచ్చు.

తమకు లభిస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని పలు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ మరింత ఎఫెక్టివ్‌గా పని చేస్తున్నాయి. ప్రేక్షకులను మెప్పించే సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, డాక్యుమెంటరీ ఫిల్మ్‌లు, షోలను స్ట్రీమింగ్‌ చేస్తున్నాయి. థియేటర్లలో సూపర్‌ హిట్‌ అవుతున్న వాటిని భారీ మొత్తానికి ఇచ్చి తీసుకుంటున్నాయి. ముఖ్యంగా స్టార్‌ హీరోల సినిమాలను కోట్ల రూపాయలకు కొంటున్నాయి. థియేటర్లలో ఫెయిల్‌ అయిన చిత్రాలు ఓటీటీలో సూపర్‌ హిట్లుగా నిలుస్తున్నాయి. ప్రతీ వారం లాగే ఈ  కూడా మంచి మంచి సినిమాలు పలు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలోకి వస్తున్నాయి. రేపు ఒక్కరోజే ఏకంగా 21 సినిమాలు స్ట్రీమింగ్‌ అవ్వనున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషకు చెందిన సినిమాలు కూడా స్ట్రీమింగ్‌ అవ్వనున్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌

  • అన్నపూరణి ( తెలుగు)
  • త్రీ ఆఫ్‌ అజ్‌ ( హిందీ)
  • బెర్లిన్‌ (స్పానిస్‌) సిరీస్‌
  • క్యోగయ హమ్‌ కహాన్‌ ( హిందీ)
  • శాస్త్రి విరుధ్‌ శాస్త్రి ( నెట్‌ఫ్లిక్స్‌)
  • థాంక్యూ ఐయామ్‌ సారీ ( స్వీడిస్‌ )
  • హెల్‌ క్యాంప్‌ టీన్‌ నైట్‌మేర్‌ ( ఇంగ్లీష్‌)
  • ది అబాండన్డ్‌( ఇంగ్లీష్‌)

డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌

  • స్వాతి ముత్తిన మలే హనియే ( కన్నడ)
  • మంగళవారం (తెలుగు)
  • ట్వల్త్‌ ఫెయిల్‌ ( హిందీ)

జీ5

  • డోనో ( హిందీ )
  • సేఫ్డ్‌ ( హిందీ)
  • వన్స్‌ అపాన్‌ టూ టైమ్స్‌ ( హిందీ)

ఆహా

  • లైసెన్స్‌ ( తెలుగు)
  • కీడా కోలా ( తెలుగు )

ఈటీవీ విన్‌

  • సగిలేటి కథ ( తెలుగు)

సింప్లీ సౌత్‌

  • పార్కింగ్‌ ( తెలుగు )

అమెజాన్‌ ప్రైమ్‌

  • టైగర్‌ 3 ( హిందీ )

ఐ స్ట్రీమ్‌

  • పేరరి యాథవర్‌ ( మలయాళం)

మరి, రేపు పలు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో స్ట్రీమింగ్‌ అవ్వనున్న 21 సినిమాల్లో మీ ఫేవరేట్‌ ఏదో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి