iDreamPost

వృషభోత్సవం.. సాంస్కృతిక వారసత్వానికి సజీవ చిహ్నం..

వృషభోత్సవం.. సాంస్కృతిక వారసత్వానికి సజీవ చిహ్నం..

  • ఎద్దులను రాళ్లుగా మార్చి నందిని చెప్పి పూజిస్తే సరిపోతుందా..?
  • శివాలయంలో నంది ఎందుకు ఉంటుంది..?
  • మన ఊరిలో, మన పొలాల్లో సంచరించాల్సిన ఎద్దులు ఏమయ్యాయి..?
  • ఆవు ఉత్పత్తి వృద్ధికి, తక్కువ నీటితో పంటలు పండించడం ఎద్దులు మూలం కాదా?
  • ఎద్దు కాలు పెడితే ఎలాంటి భూమి అయినా వ్యవసాయానికి అనుకూలం.

 

వృషభం(ఎద్దు) భారతదేశపు సాంస్కృతిక వారసత్వానికి సజీవ చిహ్నం. హరప్పా మొహంజదారో నాగరికతలో వృషభాని(ఎద్దు)కి విశేష ప్రాధాన్యం ఇవ్వబడింది.

మన దేశానికి రైతు వెన్నెముక అయితే ఆ రైతుకు వెన్నెముక వృషభం (ఎద్దు). నాలుగు దశాబ్దాల క్రితం వరకు మన దేశంలో వృషభాలను (ఎద్దులను) పొలం దున్నడానికి, పండిన పంటను, సరుకుల రవాణాకు, మనుషుల ప్రయాణానికి ఉపయోగించేవారు.

సేంద్రియ ఎరువుల తయారీకి అవసరమైన పేడ ఎద్దుల వల్ల కూడా లభ్యమయ్యేది. చక్కగానుగ ద్వారా సహజ పద్ధతిలో నూనెలు ఉత్పత్తి చేయడానికి ఎద్దులు ఉపయోగపడేవి. ఆవుల సహజ గర్భ ధారణ ద్వారా పాలను ఉత్పత్తి చేయడానికి ఎద్దులు ఉపయోగపడేవి.

జల్లికట్టు, బండలాగుడు పోటీలు, ఎడ్లబండ్ల పరుగు పందేలు మొదలైన పశువుల క్రీడల ద్వారా ఎద్దులు గ్రామీణ భారతీయులకు వినోదాన్ని పంచుతుండేవి. వృషభాలు గంగిరెద్దులుగా అలంకరింపబడి సంక్రాంతి పండుగకు శోభను, కలను తెచ్చేవి.

పరమేశ్వరుని వాహనంగా వృషభాన్ని(నంది) తరతరాలుగా పూజించడం అనేది మన భారతదేశ సంస్కృతిలో భాగము. కానీ ఇది గతం. మన భారతదేశ సంస్కృతితో విడదీయలేని సంబంధం ఉన్న వృషభం నేడు మనదేశంలో ప్రాధాన్యాన్ని కోల్పోతూ అంతరించే దశకు వస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి