iDreamPost

రూ.28 లక్షల భారీ ధర పలికిన యాపిల్ ఫోన్!

రూ.28 లక్షల భారీ ధర పలికిన యాపిల్ ఫోన్!

యాపిల్.. యాపిల్.. ఇప్పుడిదే ట్రెండ్.. ఐ ఫోన్ ఉందంటే సెలబ్రిటీ హోదా.. ప్రతి కుర్రకారు మదిలో మెదిలే ఆలోచన.. ఐ ఫోన్ చేతిలో ఉంటే ఉంటది అనుకుంటారు..

యాపిల్ సంస్థ గురించి తెలియని వారుండరు. ఇక యాపిల్ నుంచి వచ్చే ఐఫోన్లు అంటే ఇష్టపడని వారుండరు. కొత్తగా ఏదైన యాఫిల్ ఐ ఫోన్ మోడల్ విడుదల అవుతుందంటే దానిని కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఐ ఫోన్ కి సంబంధించిన వార్తల గురించి తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఉంటారు. ఈక్రమంలో యాపిల్ ఐ ఫోన్లు అనేక మోడల్స్ మార్కెట్ల లోకి వచ్చాయి. అయితే సెప్టెంబర్ 7న ఐఫోన్ 14 సిరీస్ విడుదల కానుంది. అయితే ఈ కొత్త ఐ ఫోన్ సిరీస్ విడుదల కంటే ముందు యాపిల్ కు సంబంధించిన ఓ ఆశ్చర్యకరమైన వార్త వచ్చింది. యాపిల్ కి సంబంధించిన ఓ ఫోన్ వేలంలో భారీ ధర పలికింది.

ఇక వివరాల్లోకి వెళ్తే..

ఆర్ఆర్ ఆక్షన్ సంస్థ యాపిల్ కు సంబంధించిన 70 ఉత్పత్తులను వేలానికి పెట్టింది. అందులో చాలా వస్తువులు వేలంలో మంచి ధర పలికాయి. అయితే యాపిల్ ఐఫోన్ సంబంధించిన మొదటి తరం ఫోన్, 2007 నాటి మోడల్ కు చెందిన ఒకటి కూడా వేలం వేశారు. ఈ ఫోన్ కోసం చాలా మంది పోటి పడ్డారు. అయితే ఎవరు ఊహించని ధర పలికింది ఈ మొదటి తరం ఐఫోన్. 35,000 డాలర్లకు ఒకరు ఈ ఫోన్ ను దక్కించుకున్నారు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.28 లక్షలు అన్నమాట. వేలంలో భారీ ధర పలికిన ఆ ఐఫోన్ 2007 నాటి 8GB మోడలు.

యాపిల్ అప్పటి సీఈవో స్టీవ్ జాబ్స్ ఈ ఫోన్ ను 2007 జనవరి 9న శాన్ ఫ్రాన్సిస్కోలోని మ్యాక్ వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో ఆవిష్కరించారు. అప్పట్లో ఈ ఫోన్ ధర కేవలం 599 డాలర్లు ఉండేది. అయితే తాజా వేలంలో యాపిల్ 35,414 డాలర్లు పలికింది. యాపిల్ మొదటి తరం ఐపాడ్ రూ.20 లక్షలకు అమ్ముడుపోయింది. ఇక ఈ వేలంలో యాపిల్-1 సర్క్యూట్ బోర్డు మన కరెన్సీలో రూ.5.41 కోట్లు పలికింది. మరి.. మొదటితరం యాపిల్ ఐఫోన్ భారీస్థాయిలో అమ్ముడు పోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి