iDreamPost

బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పై హత్యాయత్నం కేసు నమోదు!

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎన్నిక సందడి కొనసాగుతుంది. అధికార, ప్రతిపక్ష నేతలు ప్రచారాలతో దుమ్మురేపుతున్నారు.

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎన్నిక సందడి కొనసాగుతుంది. అధికార, ప్రతిపక్ష నేతలు ప్రచారాలతో దుమ్మురేపుతున్నారు.

బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పై హత్యాయత్నం కేసు నమోదు!

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలం కనిపిస్తుంది. అధికార పార్టీ బీఆర్ఎస్, ప్రతిప పార్టీలు ముమ్ముంగా ప్రచారాలు చేస్తున్నారు. ఈసారి అన్ని పార్టీలు ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓటర్లను ప్రసన్నం చేసుకోవాడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాన పార్టీలతో పాటు ఇతర పార్టీ నేతలు సైతం ఈసారి ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా బీఎస్పీ తెలంగాణ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు కావడం సంచలనం రేపుతుంది. వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా అన్ని పార్టీ నేతలు ముమ్మర ప్రచారాలు చేస్తున్నారు. అయితే ప్రచార సమయంలో కొన్ని అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. బీఎస్పీ తెలంగాణ అధ్యక్షులు, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, ఆయన కుమారుడిపై కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ స్టేషన్ లో హత్యాయత్నం కేసు బుక్ అయ్యింది. ఆదివారం రాత్రి బీఎస్పీ, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య జరిగిన గొడవలో ఈ కేసు నమోదు అయ్యింది. ప్రవీణ్ కుమార్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేధికగా వెల్లడించారు.

ఆదివారం జరిగిన ప్రచార సభలో తమ పార్టీ సభ్యులకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షన జరిగింది. ఈ సందర్బంగా తనపై, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో పీహెచ్ డీ స్కాలర్ అయిన తన కొడుకుతో పాటు పార్టీలో 11 మందిపై ఏకంగా హత్యాయత్నం సెక్షన్ 307 కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.దారుణం ఏంటంటే.. సిర్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేరు కోనప్ప కనుసన్ననలో ఈ కేసు నమోదు అయినట్లు ప్రవీణ్ కుమారె తెలిపారు. విచిత్రం ఏంటంటే వాహనం నుంచి రూ.25 దొంగిలించానని ఆయన డ్రైవర్ కేసుల పెట్టారు. 25 ఏళ్ల పాటు ఎలాంటి మచ్చ లేకుండా ఐపీఎస్ ఆఫీసర్ గా కొనసాగిన తనపై 25 వేల దొంగతనం కూడా వేస్తారా? అని ప్రశ్నించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి