iDreamPost

తక్కువ ధరకే మార్కెట్ లోకి షావోమీ ఎలక్ట్రిక్ కారు.. ఒకేసారి 20వేల ఆర్డర్లు!

  • Published Apr 03, 2024 | 6:08 PMUpdated Apr 03, 2024 | 6:08 PM

ప్రస్తుతం దేశ విదేశాల్లో రకరకాల మోడల్స్, ఫీచర్స్ కలిగిన కొత్త కొత్త కార్లు అనేవి మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సరి కొత్త ఎలక్ట్రిక్ కార్లు అనేవి ఓ ప్రముఖ కంపెనీ మార్కెట్ లో లాంచ్ చేశాయి.

ప్రస్తుతం దేశ విదేశాల్లో రకరకాల మోడల్స్, ఫీచర్స్ కలిగిన కొత్త కొత్త కార్లు అనేవి మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సరి కొత్త ఎలక్ట్రిక్ కార్లు అనేవి ఓ ప్రముఖ కంపెనీ మార్కెట్ లో లాంచ్ చేశాయి.

  • Published Apr 03, 2024 | 6:08 PMUpdated Apr 03, 2024 | 6:08 PM
తక్కువ ధరకే మార్కెట్ లోకి షావోమీ ఎలక్ట్రిక్ కారు.. ఒకేసారి  20వేల ఆర్డర్లు!

ప్రస్తుతం దేశ విదేశాల్లో రకరకాల మోడల్స్, ఫీచర్స్ కలిగిన కొత్త కొత్త కార్లు అనేవి మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి. ఇప్పటికే ఎక్కడ చూసిన కార్ల వినియోగం అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. వ్యక్తిగత అవసరాల దృష్ట్యా ఈ కారును వినియోగం అనేది అవసరం నుంచి అత్యవసరంగా మారిపోయింది. ఈ క్రమంలోనే కొంతమంది లేటెస్ట్ ఫీచర్లతో వచ్చిన కార్లను కొనడంలో ఎప్పుడు ట్రెండి గా నిలుస్తుంటారు. ఇక ఈ మధ్య కాలంలో అయితే ఎలక్ట్రికల్ బైక్స్ తో పాటు ఎలక్ట్రిక్ కార్లు కూడా మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చేశాయి. తాజాగా మరోసారి చైనాలో స్మార్ట్‌ ఫోన్‌ తయారీ కంపెనీ హువావే కూడా ఈ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీలోకి అడుగుపెట్టింది. కాగా, చెరీ అనే కంపెనీతో కలిసి ఈ కొత్త ఎలక్ట్రిక్ కార్లను సెడాన్‌ను మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. మరి ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

తాజాగా చైనా స్మార్ట్‌ ఫోన్‌ తయారీ కంపెనీ హువావే కూడా ఎలక్ట్రిక్‌ కార్ల తయారీలోకి అడుగుపెట్టింది. పైగా ఇది చెరీ అనే కంపెనీతో కలిసి ఓ కొత్త ఎలక్ట్రిక్‌ సెడాన్‌ను మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. అలాగే.. లక్సీడ్‌ ఎస్‌7 పేరుతో ఈ ఎలక్ట్రిక్‌ సెడాన్‌ కారును మార్కెట్ లో ఆవిష్కరించింది. అంతేకాకుండా.. ఈ కంపెనీ ఏకంగా ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజం టెస్లా పై కన్నేసి నంబర్‌ వన్‌ స్థానం తమ లక్ష్యమని స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రీ బుక్‌ చేసుకున్న వారికి డెలివరీలు సైతం ప్రారంభించినట్లు ఆ కంపెనీ ప్రకటించింది. అయితే నిజానికి ఎప్పుడో దీని లాంచ్‌ ఉంటుందని ప్రకటించినా ఆ కంపెనీలో.. సెమీకండక్టర్ల కొరత కారణంగా వాటి ఉత్పత్తి ఆలస్యమైంది. దీంతో ఇప్పుడు అన్నీ సమకూరడంతో.. ఉత్పత్తితో పాటు డెలివరీలు కూడా చేస్తు‍న్నట్లు పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి.

అయితే ఈ ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ కి చెందిన తొలి ఎలక్ట్రిక్ కారు  ఈ లక్సీడ్‌ ఎస్‌7 సెడాన్‌ పేరుతో ప్రకటించారు. పైగా ఈ కారును  ప్రకటించగానే..  దాదాపు 20వేల ఆర్డర్లు వచ్చినట్లు ఆ కంపెనీ గత  సంవత్సరం నవంబర్ లో  పేర్కొంది. అంతేకాకుండా.. తమ కంపెనీ ఆర్డర్ వివరాలను  2023 నవంబర్‌ 28వ తేదీన బహిరంగంగా వివరించింది. ఇక  కంపెనీలో సెమీ కండక్టర్ల కొరత కారణంగా ఉత్పత్తి పనులు నిలిచాయని.. కానీ ఇప్పుడు ఆ సమస్య పరిష్కారం కావడంతో ఉత్పత్తి వేగం సాగిందని పేర్కొంది. కాగా,  ఆర్డర్‌ అందుకున్న 4 నుంచి 5 నెలల లోపు కంపెనీ ఈ లక్సీడ్‌ ఎస్‌7 కార్ల డెలివరీలను అందించేందుకు ప్రయత్నిస్తోంది.  అయితే ఈ ఏప్రిల్‌ చివరి నాటికి వాటి ఉత్పత్తి, డెలివరీల సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందని హువావే తెలిపింది.

ఇక ఈ కారు లాంచింగ్‌ సందర్భంగా హువావే స్మార్ట్‌ కారు సొల్యూషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అండ్‌ చైర్మన్‌ రిచర్డ్‌ యు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం విబోలో ఓ పోస్ట్‌ కూడా  షేర్‌ చేశారు. దానిలో ఈ కారు గురించి పూర్తి సమాచారం ఉంది. అలాగే  ప్రీ బుక్‌ చేసుకున్న కస్టమర్లతో పాటు ప్రస్తుతం బుక్‌ చేసుకుంటున్న వారికి కూడా డెలివరీలు అందిస్తామని కూడా అందులో పేర్కొని ఉంది. కాగా, ఈ హువావే లక్సీడ్‌ ఎస్‌7 ఎలక్ట్రిక్‌ సెడాన్‌ కారు ధర రూ. 34,600 డాలర్లుగా ఉంది. అంటే మన ఇండియన్  కరెన్సీలో దీని ధర అక్షరాల రూ. 28.27 లక్షల వరకూ ఉంటుంది. మరి, మార్కెట్ లో చైనా స్మార్ట్ కంపెనీ కొత్తగా లాంచ్ చేసిన ఈ లక్సీడ్‌ ఎస్‌7 సెడాన్‌  కార్ల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి