iDreamPost

రోజుకు రూ.కోటి సంపాదిస్తున్న జొమాటో డెలివరీ బాయ్‌.. అతను ఎవరంటే!

  • Published Jun 15, 2023 | 5:20 PMUpdated Jun 15, 2023 | 5:20 PM
  • Published Jun 15, 2023 | 5:20 PMUpdated Jun 15, 2023 | 5:20 PM
రోజుకు రూ.కోటి సంపాదిస్తున్న జొమాటో డెలివరీ బాయ్‌.. అతను ఎవరంటే!

ప్రస్తుతం ప్రతిదీ ఆన్‌లైన్‌లోనే లభిస్తోంది. కాలు కదిపే పని లేకుండా కావాల్సిన వాటిని క్షణాల్లో కూర్చున్న దగ్గరకు రప్పించుకుంటున్నాం. కేవలం వస్తువులు, బట్టలు, సరుకులు ఇవి మాత్రమే కాక.. తినే తిండి కూడా ఆన్‌లైన్‌లో లభిస్తోంది. స్విగ్గీ, జొమాటో వచ్చాక ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ఊహించని రీతిలో పెరిగింది. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా.. ఎప్పుడు కావాలంటే అప్పుడు.. ఏం తినాలనిపిస్తే.. అది ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేయడం.. అరగంట వ్యవధిలో ఆస్వాధించడం చేస్తున్నాం. ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ వల్ల ఎప్పుడు తినాలనిపిస్తే.. అప్పుడు తినగలుగుతున్నాం. మరో పక్క ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ.. ఎందరికో ఉపాధి మార్గంగా మారింది. నిరుద్యోగులు, చదువుకునే యువతకు.. ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌లు కల్పతరువుగా మారాయి. వారి ఆర్థిక అవసరాలు తీరుస్తున్నాయి. ప్రస్తుత కాలంలో చాలా మంది యువత.. వారికి ఉండే వీలును బట్టి.. ఫుడ్‌ డెలివరీ ఏజెంట్స్‌గా మారి.. తమ ఖర్చులకు సరిపడా సంపాదించుకుంటున్నారు.

అయితే నెలంతా.. పూర్తి సమయం డెలివరీ బాయ్‌గా చేస్తే.. మహా అయితే 50 వేల రూపాయల వరకు సంపాదించుకోగలరు. కానీ ఇప్పుడు మీరు తెలుసుకోబోయే ఈ డెలివరీ బాయ్‌.. కేవలం ఒక్క రోజుకే ఏకంగా కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు. అంటే నెలకు ఏకంగా 30 కోట్ల రూపాయల సంపాదన అన్నమాట. సాధారణంగా డెలివరీ బాయ్‌ రోజుకు మహా అయితే.. వెయ్యి, రెండు వేల రూపాయలు సంపాదించడమే చాలా ఎక్కువ. అలాంటిది.. ఏకంగా రోజుకు ఏకంగా కోటి రూపాయలు ఎలా సంపాదిస్తున్నాడు అబ్బా అని అనుమానం వస్తుందా.. ఇంతకు ఎవరా డెలివరీ భాయ్‌ అని ఆలోచిస్తున్నారా.. అయితే మీ కోసమే ఆ డెలివరీ బాయ్‌ వివరాలు..

రోజుకు కోటి రూపాయలు సంపాదిస్తున్న ఆ డెలివరీ బాయ్‌ ఎవరు అంటే.. జొమాటో ఫౌండర్, సీఈఓ దీపిందర్ గోయల్. అవును అతడే. కంపెనీ ఓనర్‌..డెలివరీ బాయ్‌ ఏంటి అంటే.. ఒక్కసారి మీరు దీపిందర్‌ గోయల్‌ ట్విట్టర్ ప్రొఫైల్, ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ చూస్తే మీకే అర్థం అవుతుంది. సోషల్‌ మీడిమా ప్లాట్‌ఫామ్‌లో ఆయన తనను తాను జొమాటో డెలివరీ బాయ్‌గానే పరిచయం చేసుకున్నారు. జొమాటోను స్థాపించిన దీపిందర్ అప్పుడప్పుడు స్వయంగా ఆర్డర్లు డెలివరీ చేస్తుంటారు. ఇంటింటికి వెళ్లి ఆహారం అందజేస్తారు. తనను తాను డెలివరీ బాయ్‌గా చెప్పుకోవడానికి ఆయన ఎన్నడు వెనకాడరు.

జొమాటో సంస్థ 2021లో స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయింది. ఆ తర్వాత దీపిందర్ గోయల్ నికర సంపద విలువ 650 మిలియన్ డాలర్లకు (రూ.5,345 కోట్లకు) చేరుకుంది. ప్రస్తుతం ఆయనకు కంపెనీలో 4.7 శాతం వాటా ఉంది. ప్రస్తుతం దీపిందర్‌ గోయల్ కంపెనీ నుంచి ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోవడం లేదు. అయితే, ఎంప్లాయీ స్టాక్ ఓనర్ షిప్ ప్లాన్స్ ద్వారా ఆయనకు రూ.358 కోట్లు అందాయి. ఈ లెక్కన రోజుకు రూ.కోటి సంపాదించినట్లే కదా. ప్రస్తుతం జొమాటో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.66,875 కోట్లుగా ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి