iDreamPost

రాజ్యసభకు ఆ నలుగురు.. ప్రకటించిన వైఎస్సార్‌సీపీ

రాజ్యసభకు ఆ నలుగురు.. ప్రకటించిన వైఎస్సార్‌సీపీ

ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ఎవరు వెళ్లబోతున్నారన్నది ఖాయమైంది. ఈ మేరకు నలుగురు అభ్యర్థులను వైఎస్సార్‌సీపీ వెల్లడించింది. ప్రస్తుతం మంత్రులుగా పని చేస్తున్న మోపీదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోష్లతోపాటు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ముకేష్‌ అంబాని ప్రతినిధి పరిమల్‌ నత్వానీ పేర్లను వైఎస్సార్‌సీపీ అధిష్టానం ప్రకటించింది.

వచ్చే నెల మొదటి వారంలో రాజ్యసభలో 55 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి నాలుగు, తెలంగాణ నుంచి రెండు వెరసి మొత్తం ఆరు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇందులో ఏపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న టి.సుబ్బిరామిరెడ్డి, తోట సీతారామ లక్ష్మి, కె.కేశవరావు, మొమ్మద్‌ఆలీఖాన్‌ల పదవీ కాలం ఏప్రిల్‌లో ముగుస్తోంది. వీరి స్థానంలో వైఎస్సార్‌సీపీ ప్రకటించిన నలుగురు అభ్యర్థులు పెద్దల సభలో అడుగుపెట్టబోతున్నారు.

Read Also : జగన్ రాజ్యసభకు ఎవరిని పంపుతున్నాడు?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి