iDreamPost

విద్యార్థి దశలోనే బాబు నీచ రాజకీయాలు చేశాడు: విజయసాయి రెడ్డి

విద్యార్థి దశలోనే బాబు నీచ రాజకీయాలు చేశాడు: విజయసాయి రెడ్డి

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డైవలప్మెంట్ కేసులో రిమాండ్ ఖైదీగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. శనివారం సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి..విజయవాడలోని ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టారు. ఆదివారం సాయంత్రం ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ క్రమంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబు నాయుడిని తరలించారు. ఈ స్కాంలో దాదాపు రూ.370 కోట్లు పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసు విషయం పక్కన పెడితే.. చంద్రబాబు పై వైసీపీ మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచక పడుతున్నారు. బాబు పాపం పడిందని అందుకు ఈ దుస్థితి వచ్చిందంటూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి సైతం బాబుపై సెటైర్లు వేశారు. చంద్రబాబు.. విద్యార్థి దశలోనే నీచ రాజకీయాలు చేశాడని ఆయన విమర్శించారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు స్వతహాగా నేర స్వభావం కలిగిన వ్యక్తి అని, బాబు నీతిమంతుడని ఎవరూ అనుకోవడం లేదని, అన్ని కేసుల్లో ఆయన స్టేలు తెచ్చుకున్నారని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఇక టీడీపీ మాటలను ఎవరూ విశ్వసించే పరిస్థితి లేదని ఆయన తెలిపారు. టీడీపీ తలపెట్టిన బంద్ కు అసలు స్పందనే లేదని, బంద్ రోజు చంద్రబాబు హెరిటేజ్ షాప్ లు కూడా మూయలేదని చెప్పారు. రాష్ట్రంలో రాజకీయాలను భ్రష్టు పట్టించింది బాబేనని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబుకు ఎప్పుడూ కూడా  ప్రజాభిమానం లేదని, కేవలం అన్ని వ్యవస్థలను మేనేజ్ చేశారని  తెలిపారు.

విద్యార్థి దశలోనే చంద్రబాబు నీచ రాజకీయాలు చేశారని సాయి రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు  14 ఏళ్ల పాలనలో ప్రతిదీ స్కామేనని ఆయన విమర్శించారు. చంద్రబాబు ఓ స్కిల్డ్ నేరస్థుడని, ఆయన చేయని అరాచకాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం ద్వారా సుమారు రూ.470 కోట్లు కొట్టేశారని విజయ సాయి రెడ్డి తెలిపారు. ఈ కుంభకోణానికి చంద్రబాబేపాల్పడ్డాడని ఐటీశాఖ కూడా చెప్పింది. చంద్రబాబు నిజాయితీ పరుడైతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో విచారణ ఎదుర్కొవాలని ఆయన సవాల్ చేశారు. మరి.. ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి