iDreamPost

ఆ భ్రమలో పురంధేశ్వరి ఉన్నారంటూ విజయసాయిరెడ్డి సెటైర్!

ఏపీలో వైఎస్సాఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఇప్పటికే పలుమార్లుపురంధేశ్వరి వ్యాాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన సాయిరెడ్డి..తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో వైఎస్సాఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఇప్పటికే పలుమార్లుపురంధేశ్వరి వ్యాాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన సాయిరెడ్డి..తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆ భ్రమలో పురంధేశ్వరి ఉన్నారంటూ విజయసాయిరెడ్డి సెటైర్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటుంది. అధికార, ప్రతిపక్షాల మధ్య పరస్పర ఆరోపణలకు కొదవలేదు. ఇక తరచూ వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అయితే కొన్ని రోజుల నుంచి ఏపీలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి, రాష్ట్ర బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరికి మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తోంది. ఆమె.. సీఎం జగన్, విజయసాయి రెడ్డి గురించి సుప్రీం కోర్టుకు లేఖ రాయడం, ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడంతోనే ఈ వార్ మొదలైందని టాక్. ఇప్పటికే అనేక సార్లు పురంధేశ్వరిపై వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి.. తాజాగా మరోసారి ఆమెపై మండిపడ్డారు.

దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీలో ఉంటూ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూనే టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆమె చేసిన హడావుడే అందుకు నిదర్శనం. అంతేకాక బీజేపీ పార్టీ కంటే.. టీడీపీ కోసం ఆమె పరోక్షం పని చేస్తుందని వైసీపీ నేతలు సైతం ఆరోపిస్తున్నారు. తాజాగా వైఎస్సాఆర్ సీపీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ఆమెపై మండిపడ్డారు. పురంధేశ్వరి గారు సెలెక్టివ్ అటెన్షన్ అనే మానసికి భ్రాంతిలో ఉన్నారని, తనకు కావాల్సిన వాటినే నమ్ముతారని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.

వాస్తవాలు కళ్లముందు కనిపిస్తున్నా ఆమె పట్టించుకోరు. దృష్టంతా ‘బావ’ సారూప్య పార్టీకి, తమ కుటుంబానికి మేలు చేయడంపైనే , పచ్చపార్టీ ఆరోపణలను నిర్ధారించుకోకుండా రిపీట్ చేయడం సెలెక్టివ్ అటెన్షన్  లక్షణమే అంటూ  విజయ సాయి రెడ్డి ట్వీట్ చేశారు. ఇంకా ఆయన ఎక్స్ వేదికగా పలు అంశాలను లేవనెత్తారు. అనుకూల మీడియా పెద్దలు, సొంత సామాజిక వర్గ హితులు, ఇతర పార్టీల్లోని స్లీపర్ సెల్స్ ప్రయోజనాల కోసమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక పోటీ నుంచి తప్పుకుందంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.

దీనినే జెండా పీకేయడమని ఎందుకు అనకూడదో బాకా మీడియా స్పష్టత ఇవ్వాలని పోస్టు చేశారు. ఏపీలో కూడా మిత్ర పక్షాలకు సీట్లు ఇవ్వాలి కాబట్టి టీడీపీ 100 స్థానాల్లో కూడా పోటీ చేసే పరిస్థితి లేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. గతంలో కూడా పురంధేశ్వరిపై విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎన్టీఆర్  ఇంటికి పది అడుగుల దూరంలో ఉండి కూడా  ఆనయకు ఏనాడు  ఒక్క ముద్ద అన్నం పెట్టని ఘనత పురంధేశ్వరిదని ఎద్దేవా చేశారు. పురంధేశ్వరికి సిద్ధాంతం, విధానం, ప్రవర్తన, వ్యక్తిత్వం, సమాజ హితం, మంచి స్నేహం, ధర్మం, న్యాయం వంటివేవి లేవని ఆయన మండిపడ్డారు.

పురందేశ్వరి  ఒకసారి పోటీ చేసిన స్థానం నుంచి తిరిగి బరిలో దిగరన్నారు. వైఎస్సార్ హవాలో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై బాపట్ల, విశాఖపట్నంలో బయటపడ్డారని, బీజేపీలో చేరాక రాజంపేట నుంచి పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారని ఆయన గుర్తు చేశారు. పురంధేశ్వరి ప్రవర్తన చూసి.. బీజేపీ నేతలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆమె రాష్ట్రంలో బీజేపీ అభివృద్ధి కంటే టీడీపీ కోసమే కష్టపడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మరి..తాజాగా దగ్గుబాటి పురంధేశ్వరిపై వైఎస్సాఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి