iDreamPost

మాచర్లలో అలజడికి బోండా ఉమా, బుద్దా వెంకన్నప్రయత్నం.. దాడి చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు …

మాచర్లలో అలజడికి బోండా ఉమా, బుద్దా వెంకన్నప్రయత్నం.. దాడి చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు …

గుంటూరు జిలా మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పర్యటన నేపథ్యంలో బుధవారం మాచర్లలో తీవ్ర ఉద్రికత్త చోటుచేసుకుంది. మాచర్ల నియోజకవర్గంలో మంగళవారం టిడిపి కార్యకర్తలు నామినేషన్లు వేయకుండా వైసిపి కార్యకర్తలు దాడి చేశారని ఆరోపిస్తున్న తెలుగుదేశం పార్టీ.. ఎన్నికలను పర్యవేక్షించే ఉద్దేశంతో ఈ రోజు పార్టీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు ఇరువురు మాచర్ల పర్యటనకి వచ్చారు. ఈ సందర్భంగా వైసిపి తెలుగుదేశం కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

తమ నాయకులు బోండా ఉమా, బుద్దా వెంకన్న కార్లపై వైసిపి నేతలు దాడికి తెగబడ్డారని తెలుగుదేశం కార్యకర్తలు ఆరోపించారు. వైసిపి కార్యకర్తల దాడిలో తమకు స్వల్ప గాయాలయ్యాయని బోండా ఉమా, బుద్దా వెంకన్న లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

కాగా ఇటీవల మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కారుపై గుంటూరు నాగార్జున యూనివర్సిటీ సమీపంలో కొందరు తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేసి కారుని ధ్వంసం చేసిన నేపథ్యంలో ఆగ్రహంగా ఉన్న వైసిపి కార్యకర్తలు గుంటూరు రాజకీయాలతో అసలు సంభందమే లేని విజయవాడకు చెందిన బోండా ఉమా, బుద్దా వెంకన్నలు మాచర్ల పర్యటనకి వస్తూ మార్గం మధ్యంలో ఒక చోట గుమికూడిన వైసిపి కార్యకర్తలను చూసి తమ కారు ఆపి ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేయడంతో, ఒక్క సారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని, ఈ సమయంలో కొందరు బోండా ఉమా, బుద్దా వెంకన్నప్రయాణిస్తున్న కారుపై రాళ్లు విసరడం, కర్రలతో దాడి చేయడంతో కారు అద్దాలు పగిలాయి.

స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు చాలా సున్నితంగా వ్యవహరించాలి. పరస్పర దాడులు రెచ్చగొట్టే ధోరణలు విడనాడాలి. ఏ పార్టీ అధికారంలో వున్నా పలనాడు ప్రాంతంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడూ సమస్యాత్మకంగానే ఉంటాయి. ఇలాంటి ప్రాంతానికి పొరుగు జిల్లా నాయకులు వచ్చి రెచ్చగొట్టడం సరియన్ పద్దతి కాదు. టిడిపి తరపున గుంటూరు జిల్లా హోం మంత్రి గా పిలవబడ్డ గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు లాంటి నేతలు ఉండగా తమ నోటి దురుసుతో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన కృష్ణా జిల్లా నేతలైన బోండా ఉమా, బుద్దా వెంకన్నలు మాచర్లకు వెళ్లడం రాజకీయ వైరాలు పెంచడానికి తప్ప దేనికి ఉపయోగం లేదు.

ఎన్నికల్లో అధికార పార్టీ కార్యకర్తలు సమన్వయంతో ఉండడం చాలా అవసరం. లేదంటే ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి దాడులు జరగకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఎంతైనా ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి