iDreamPost

రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. అకౌంట్‌ల్లో డబ్బులు జమ!

రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. అకౌంట్‌ల్లో డబ్బులు జమ!

బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయం, అనుబంధ రంగాలతో పాటు పౌర సరఫరాల శాఖలపై తాడేపల్లిలోని క్యాంపు  ఆఫీస్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందరర్భంగా రాష్ట్రంలో పంటల సాగు, తాజా పరిస్థితులను సీఎంకు అధికారులు వివరించారు. పంటల సాగు గురించి  అధికారులను అడిగి తెలుసుకన్నారు. ముందస్తు రబీ పంటలు వేసే అవకాశం ఉందని..విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. అలాగే రైతు భరోసాపై స్పష్టత ఇఛ్చారు. త్వరలో రైతులకు వారి ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయనున్నారు.

ఇక ఈ సమీక్ష సమావేశంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ..” ఎలాంటి అవినవీతికి ఆస్కారం లేకుండా రైతులకు లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధ్యాన్యం కొనుగోలు సమయంలో రైతులకు మంచి జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. ఎప్పటి మాదిరిగానే మిల్లర్లు, మధ్యవర్తుల  జోక్యాన్ని పూర్తిగా నివారించాలని తెలిపారు. ఆహారశుద్ధి రంగంలో ఏర్పాటు చేస్తున్న యూనిట్లను ఉపయోగించుకుని చిరుధాన్యాలను ప్రాసెస్‌ చేయాలని సూచించారు. పీడీఎస్ ద్వారా మిల్లెట్లను ప్రజలకు పంపిణీ చేయాలని అధికారులకు తెలిపారు. అదే విధంగా ధాన్యం రైతులకు మద్దతు ధరతో పాటు జీఎల్‌టీ రూపంలో అదనంగా క్వింటాకు రూ.250 చొప్పున ఇస్తున్నామని సీఎం తెలిపారు.

రైతు భరోసా కింద ఇప్పటివరకు రూ.31,005 కోట్లు అందించామని సీఎం తెలిపారు. అలానే త్వరలో మరో విడత రైతు భరోసాను రైతు బ్యాంకు ఖాతాల్లోకి విడుదల చేసేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. నవంబర్‌ మొదటి వారంలో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలి సూచించించారు. ఇక పంటల సాగుపై కూడా సీఎం జగన్ ఆరా తీశారు. ఏటా సీజన్‌లో పంటలు వేయటానికి ముందే తప్పనిసరిగా భూసార పరీక్షలు నిర్వహించి… వాటి ఫలితాలతో కూడిన ధృవీకరణ పత్రాలను రైతులకు అందించేలా చర్యలు తీసుకోవాలి అన్నారు. ఆర్బీకేల స్థాయిలో భూసార పరీక్షలు చేసే విధంగా అధికారులు అడుగులు ముందుకేయాలి అన్నారు. భూసార పరీక్షలకు అవసరమైన పరికరాలను ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేలా చూడాలన్నారు. మరి.. త్వరలో రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయడానికి సిద్ధమవుతు సీఎం జగన్  రైతులకు అందించిన శుభవార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి