iDreamPost

KTRకి ఫోన్ చేసిన ఏపీ సీఎం జగన్!

KTR, YS Jagan: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామరావుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్ చేశారు. శుక్రవారం మాజీ మంత్రి కేటీఆర్ కు ఏపీ సీఎం జగన్ ఫోన్ చేశారు. ఎందుకంటే..

KTR, YS Jagan: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామరావుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్ చేశారు. శుక్రవారం మాజీ మంత్రి కేటీఆర్ కు ఏపీ సీఎం జగన్ ఫోన్ చేశారు. ఎందుకంటే..

KTRకి ఫోన్ చేసిన ఏపీ సీఎం జగన్!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామరావుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్ చేశారు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కి ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం జగన్ ..మాజీ మంత్రి కేటీఆర్ కి ఫోన్ చేశారు. గరువారం రాత్రి కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో జారిపడ్డటంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కేసీఆర్ కాలికి గాయం కావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజీగుడలోని యశోద హాస్పిటల్ కి తరలించారు. కేసీఆర్ ని పరీక్షించిన వైద్యులు ఆయన తుంటి ఎముకకు గాయమైందని తెలిపారు. శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆపరేషన్ కి కావాల్సిన పరీక్షలను ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. కేసీఆర్ కి ప్రమాదం జరగడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు.

డిసెంబర్ 3న తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ కి వెళ్లి అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు అక్కడికి వెళ్లి కలుస్తున్నారు. ఇక గురువారం రాత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లో జారి పడి ప్రమాదానికి గురయ్యారు. మాజీ ఆయన కోలుకోవడానికి 45 రోజుల పడుతుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. కేసీఆర్ కి ప్రమాదం కారణంగా ఆస్పత్రిలో చేరిన విషయం తెలుసుకొని పలువురు బీఆర్ఎస్ నేతలు పరామర్శించేందుకు యశోద ఆస్పత్రికి క్యూ కడుతున్నారు.

అలానే ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు ఫోన్ చేసి కేసీఆర్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఇదే సమయంలో కేసీఆర్ ఆరోగ్యంపై ఏపీ సీఎం జగన్ ఫోన్ లో పరామర్శించారు. కేటీఆర్ కు సీఎం జగన్ ఫోన్ చేశారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు.కేసీఆర్ త్వరగా కోలుకోవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. మరి.. కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం జగన్ పోన్ చేసి తెలుసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి