iDreamPost

చరిత్రను తిరగరాస్తున్న వైఎస్‌ జగన్‌

చరిత్రను తిరగరాస్తున్న వైఎస్‌ జగన్‌

ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం.. అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల సాకులు చెబుతూ వాటి అమలును అటకెక్కించడం.. ఇదీ ఇప్పటి వరకు జాతీయ స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోనూ రాజకీయ పార్టీలు, వాటి అధిపతులు కొందరు వ్యవహరించిన తీరు. ఎన్నికల్లో ఇచ్చిన హమీలన్నీ ఏ రాజకీయ పార్టీ కూడా అమలు చేయదనే భావన ప్రజల్లో బలంగా వేళ్లూనుకుపోయిన సమయంలో.. చరిత్రను తిరిగరాసేలా వైసీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎన్నికల వేళ తాను ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీల్లో దాదాపు 90 శాతం అమలు చేసిన సీఎం వైఎస్‌ జగన్‌.. పేద ప్రజలకు ఇచ్చిన ఓ హామీని తాజాగా ఆచరణలో పెట్టారు.

వైసీపీ అధికారంలోకి వస్తే.. టిక్కో ఇళ్లను రూపాయికే ఇస్తామని హామీ ఇచ్చిన వైఎస్‌ జగన్‌.. గత మంత్రివర్గ సమావేశంలో ఈ పథకానికి ఆమోద ముద్ర వేశారు. దాన్ని అమలు చేసేలా తాజాగా పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హాయంలో జీ ప్లస్‌ 3 తరహాలో 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో పేదలకు ఇళ్లు నిర్మించే కార్యక్రమం మొదలు పెట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరో 1.50 లక్షల చొప్పున మూడు లక్షలతోపాటు.. లబ్ధిదారుల వాటాగా కొంత మొత్తాన్ని, బ్యాంకుల ద్వారా మరికొంత మొత్తాన్ని ఇళ్ల నిర్మాణం పథకంలో చేర్చారు. దీనికి అందరికీ ఇళ్లు అనే పేరును పెట్టారు.

300 చదరపు అడుగుల ఇంటికి ప్రభుత్వాలు ఇచ్చే మూడు లక్షలతోపాటు, లబ్ధిదారుల వాటాగా 500 రూపాయలు, బ్యాంకు రుణం మూడు లక్షలు, 365 చదరపు అడుగుల ఇంటికి ప్రభుత్వాల వాటా మూడు లక్షలు, లబ్ధిదారుని వాటా 50 వేలు, బ్యాంకు రుణం 3 లక్షలు, 430 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఇంటికి ప్రభుత్వాల వాటా మూడు లక్షలు, లబ్ధిదారుని వాటా లక్ష రూపాయలు, బ్యాంకు రుణం మూడు లక్షల రూపాయలు చొప్పన నిర్థేశించారు. లబ్ధిదారుల వాటా ఇంటిలోకి చేరకముందే కట్టించుకున్నారు. బ్యాంకు రుణం మూడు లక్షల రూపాయలను నెల వారీ వాయిదాల్లో 20 ఏళ్ల పాటు చెల్లించేలా పథకాన్ని రూపొందించారు.

స్థలం, ఇసుక ఉచితంగా అందిస్తూ, రాయతీపై సిమెంట్, మెటిరీయల్‌ ఇస్తూ కూడా నిర్మాణ సంస్థకు చదరపు అడుగుకు రెండు వేల రూపాయల చొప్పన నాటి చంద్రబాబు ప్రభుత్వం చెల్లించింది. మార్కెట్‌ ధర చదరపు అడుగుకు వెయి రూపాయలు ఉండగా.. చంద్రబాబు ప్రభుత్వం కేవలం నిర్మాణానికే రెండు వేల రూపాయలు చెల్లించింది. లబ్ధిదారుల నెత్తిన బ్యాంకు అప్పు పెట్టి.. పాలకులు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారనేది ప్రధాన ఆరోపణ. ఈ పథకంలో జరుగుతున్న అవినీతిని నాడు ఎన్నికల బహిరంగ సభల్లో ఎండగట్టిన వైఎస్‌ జగన్‌.. తాను అధికారంలోకి వస్తే.. పేదలపై బ్యాంకు అప్పు భారాన్ని తీసేస్తామని చెప్పారు.

ఇచ్చిన మాట ప్రకారం 300 చదరపు అడుగులు విస్తీర్ణం గల 1,43,600 ఇళ్లను రూపాయికే లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఇళ్ల లబ్ధిదారులకు వారు చెల్లించిన వాటలో 50 శాతం రాయితీ కూడా ఇచ్చారు. ఇప్పటికే లబ్ధిదారులు తమ వాటాగా చెల్లించిన మొత్తంలో 50 శాతం తిరిగి వెనక్కి ఇచ్చేలా మున్సిపల్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. టిక్కో ఇళ్లు వద్దని, ఇళ్ల పట్టాల పథకంలో స్థలం తీసుకున్న వారికి.. వారు చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేలా మార్గదర్శకాలు జారీ చేశారు.

నాలుగు పేజీలతో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన సీఎం వైఎస్‌జగన్‌.. అమలు చేయగలిగిన వాటినే చెప్పారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది నుంచే హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఎన్నికల్లో చెప్పిన హామీలనే కాక.. ప్రజలకు అవసరమైన పథకాలను కూడా అమలు చేస్తున్నారు. వైఎస్సార్‌ కాపు నేస్తం పేరుతో కాపుల్లోని 45–60 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు ఏడాదికి 15 వేలు చొప్పన నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఈ పథకం కింద లబ్ధిదారులకు 15 వేల రూపాయల చొప్పన అందించారు. అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా ఈబీసీ నేస్తం పథకం కింద ఏడాదికి 15 వేల రూపాయల చొప్పన రాబోయే మూడేళ్లలో 45 వేల రూపాయలు అందించాలని నిర్ణయించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి